Aloe Vera Benefits: కలబంద ఎన్నో ఔషధ గుణాలు

Aloevera: కలబంద ఒక రకమైన ఔషధ మొక్క. కలబంద మొక్క చూడడానికి కొంచెం దట్టంగా ముళ్ళ స్వభావాన్ని కలిగి ఉంటుంది. జిగురు లాంటి గుజ్జు పదార్థంతో నిండి ఉంటుంది. కలబంద మొక్క అన్ని రకములైన భూముల్లో, కుండీల్లో కూడా పెరుగుతుంది, ఈ మొక్కను చాలా సులభంగా పెంచుకోవచ్చు ,పొడవు తక్కువగా ఉంటుంది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.

విటమిన్ ఏ ,విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ బి, విటమిన్ b 1,b2,b3,b6,b12,తో పాటు క్యాల్షియం, ఫాస్ఫరస్ ,పొటాషియం, ఐరన్ ,సోడియం, మాంగనీస్ ,కాపర్ ,వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. కలబందాన్ని సంస్కృతంలో “కుమారి “అని పిలుస్తారు. ఇంగ్లీషులో “aloe vera “అంటారు. ఇది ఒక అందమైన చెట్టు. ఇది బాగా పెరిగిన తర్వాత కలబంద మట్టాలను అడ్డంగా కోస్తే దాన్నుంచి తెల్లని ,చిక్కని ,ద్రవం కారుతుంది .దాన్ని ఎండలో పెడితే అది నల్లగా మారుతుంది .దీనినే ము సంబరం అంటారు.

Asphodelaceae కుటుంబానికి చెందినది.దీన్ని సైంటిఫిక్ నేమ్,aloe vera. దీనిని కుమారి అని కూడా పిలుస్తారు.కలబందలో గ్లిజరిన్, సోడియం పామాల్ ,సోడియం కార్బోనేట్, సోడియం ఫామ్ కే మ్మెల్ట్ ,సార్బోటొల్ ,మొదలైనటువంటి అనేక పోషకాలను కలిగి ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ,చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.

Aloe Vera Benefits కలబంద ఎన్నో ఔషధ గుణాలు

Aloe Vera gel:

ఒక కలబంద ఆకును తీసుకొని ,మొదట దానిని పైన ఉన్న తొక్కును తీసి ,లోపల ఉన్న గుజ్జును మాత్రమే తీసుకోవాలి. ఈ గుజ్జును శుభ్రంగా వాష్ చేసుకొ వాలి. ఈ గుజ్జును మిక్సీ జార్లు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వచ్చిన మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకొని ,దానిలోనికి విటమిన్ ఈ క్యపుల్స్ ను వేసి, స్పూన్ తో బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక డబ్బాలో వేసుకొని నిల్వ చేసుకోవచ్చు. కలబంద మరియు ఆలివ్ నూనెతో తయారుచేసిన ప్యాక్ చర్మంన్ని సున్నితంగా మరియు మృదువుగా చేసి మృతులను తగ్గిస్తుంది.

1 టీ స్పూన్ కలబంద గుజ్జు ,1/2టీ స్పూన్ ఆలివ్ నూనెతో ఈ ప్యాక్ ను తయారు చేసుకోవచ్చు. ఒక గిన్నెలో కలబంద గుజ్జు మరియు ఆలివ్ నూనె వేసి వేసి, బాగా కలిపి పేస్టు లాగా తయారు చేసుకొ వా లి.ఈ పేస్టుని ముఖానికి రాసుకొని 30 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. కలబంద గుజ్జు ముటిమలు తగ్గించడానికి చర్మంపై అద్భుతంగా పనిచేస్తుంది. కలబంద గుజ్జు మరియు నిమ్మరసం కలిపి పేస్టులాగా చేసుకుని ముఖానికి రాసుకోవాలి.ఇది మొటిమలు మచ్చలు తగ్గించడంలో సహాయపడుతుంది .కలబంద గుజ్జు మరియు నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకొని , 30 నిమిషాల తర్వాత ,చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి .దీనివల్ల చర్మ సౌందర్యం పెరుగుతుంది.

Read: Lady finger Benefits in Telugu: మన శరీరంలో రోగ నిరోధక శక్తి రెట్టింపు

Aloe Vera juice:

అలోవెరా జ్యూస్ లో ఉండే య oటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. దీనివల్ల శరీరంలోక్యాన్సర్ కారకాలు వృద్ధి చెందకుండా ఉండేలా చేస్తాయి. శరీరానికి హానిచేసే ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలోవీరా జ్యూస్ ను తీసుకోవడం ద్వారా జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది .ఇది పెద్ద పేగును శుభ్రపరచడమే కాకుండా ,నిలువ ఉన్న జీవక్రియ వ్యర్ధాలను శరీరం బయటకు పంపుతుంది .శరీరంలో ఏర్పడే కొవ్వును వేగంగా కరిగించి ,అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది. ఇది శరీరానికి అవసరమైన అన్ని రకాల అమినో ఆమ్లాలను అందిస్తుంది. ఇందులో ఉండే ఆమైన ఆమ్లాలు కండరాల కణజాల వృద్ధికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది.

జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలు అలోవెరా సమృద్ధిగా కలిగి ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్యలను తగ్గించుకోవచ్చు. కేశాలకు సహాసిద్ధమైన మెరుపును తీసుకువచ్చి, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలోవెరా జ్యూస్ యాంటీ ఏజింగ్ లక్షణాలను పుష్కలంగా కలిగి ఉంది. ఇది చర్మంపై ఏర్పడే మృతుకనాలను తొలగించి చర్మం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. అలోవెరా జ్యూస్ తీసుకోవడం వల్ల వయసు మీద పడడం వల్ల వచ్చే ముడతలను తొలగించి ఆరోగ్యవంతమైన చర్మాన్ని ఇస్తుంది. అలోవెరా జ్యూస్ తీసుకోవడం వల్ల కడుపులో ఏర్పడే అల్సర్లు మరియు అజీర్తిని వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలోవెరా జ్యూస్ తీసుకోవడం వల్ల ఉదర ఆరోగ్యాన్ని పెంచుతుంది .గ్యాస్టిక్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది .శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

Aloe Vera Gel for face:

అలోవెరా జెల్ ,కీరారసం, పెరుగు ,రోజ్ వాటర్ ను కలిపి ముఖం ,మెడ పై రాయాలి .పావు గంట తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి .చర్మంపై ఉండే ర్యాష్ ,మురికి ,వదిలించుకోవడంలో ఈ ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది. అలోవెరా జెల్ ,మామిడి గుజ్జు ,నిమ్మరసం కలిపి, ప్యాక్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటిలో కడిగేయాలి .దీనివల్ల చర్మం కాంతివంతంగా అవుతుంది. కలబంద ఆకుల్లో ముళ్ళ కొసలను కత్తిరించి ,మిగతా ఆకును ముక్కలుగా కోసి ,నీళ్లలో ఉడికించి గుజ్జులా చేయాలి .ఈ గుజ్జులో తేనె కలిపి, ముఖానికి రాసుకోవాలి .20 నిమిషాల తర్వాత కడిగేయాలి .ఇలా చేయడం వల్ల చర్మం పై ఉండే జిడ్డు తొలగిపోయి ప్రకాశవంతంగా ముఖంతయారవుతుంది. కలబంద గుజ్జు తీసుకొని అందులో రోజు వాటర్ కలిపి శరీరానికి రాసుకుంటే శరీరంలోని మృతుకణాలు పోతాయి. దీనివల్ల శరీరం అందంగా కనిపిస్తుంది.

Aloe Vera gel for hair:

కలబంద కేవలం చర్మ సౌందర్యానికే కాదు .జుట్టుకు కూడా అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది. కలబంద గుజ్జు జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. కలబంద ,ఆముదం నూనె ను కలిపి,ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుదల బాగా ఉంటుంది. రెండు టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు మరియుఒక టేబుల్ స్పూన్ల ఆముదo నూనెను తీసుకోవాలి. ఈ రెండింటి మిశ్రమాన్ని బాగా కలిపి ,నెమ్మదిగా జుట్టు కుదుర్లపై మసాజ్ చేయాలి .రాత్రిపూట అలాగే ఉంచి మరుసటి రోజు షాంపుతో తల స్నానం చేయాలి.

ఇది చుండ్రు మరియు చుండ్రు సంబంధిత సమస్యలను శాశ్వతంగా తొలగిస్తుంది. చుండ్రు వల్ల వచ్చే దురద వంటి సమస్య ,ఉన్నవారికి అద్భుతంగా పనిచేస్తుంది. కలబంద నూనె వల్ల జుట్టు రాలడం ,వెంట్రుకలు తెల్లబడడం ,ఎర్రబడటం ,చుండ్రు ఇంకా తలలో వచ్చే అనేక కురుపులు ,దురద వంటి సమస్యలు పోవడమే కాకుండా,ఎప్పటికీ రావు.

Aloe Vera for hair:

కలబంద గుజ్జు ఒక పావు కిలో తీసుకోవాలి .అలాగే పావు కిలో కొబ్బరి నూనెను తీసుకోవాలి. కలబంద లోపల ఉన్న గుజ్జును మాత్రమే గీరి తీసుకోవాలి. ఒక బండి లో కొబ్బరి నూనె పోసి ,అందులో ఈ కలబంద గుజ్జును వేసి బాగా నూనెలో కలిసిపోయేటట్లు కలపాలి .బాండి పొయ్యి మీద పెట్టి సన్నని సెగ పెట్టి కలుపుతూ ఉండాలి .అడుగు అంటకుండా నీరు అంతా ఆవిరి అయిపోయి నూనె మాత్రమే మిగులుతుంది .

ఈ నూనెను రోజు గోరువెచ్చగా చేసి తలలో కుదురులకు రాసి బాగా మర్ధనచేయాలి. దీనిని జుట్టుకు పెట్టుకోవడం వల్ల జుట్టు యొక్క pH బ్యాలెన్స్ గా ఉండేటట్లు చేస్తుంది. కలబంద కేవలం చర్మ సౌందర్యానికి కాదు .జుట్టు కు కూడా అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది . కలబంద గుజ్జు జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

Aloe Vera benefits:

నోటిలో దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నిర్మూలించడంలో కలబంద గుజ్జు ప్రభావంతంగా పనిచేస్తుంది. పిప్పిపళ్ళకు ,దంతక్షయానికి కారణం అయ్యే బ్యాక్టీరియాను నివారించడంలో కలబంద చక్కగా పనిచేస్తుంది. అలోవెరా గుజ్జును చక్కెరతో కలిపి తీసుకుంటే శరీరానికి చల్లదనాన్ని మరియు ఆరోగ్యాన్నిఇస్తుంది. అలోవెరా గుజ్జును ఉడికించి వాపులు ,గడ్డలపై కడితే తగ్గిపోతాయి. కాలిన పుండ్లపై కలబంద ఆకులను వేడి చేసి ,రసమును పిండిన బాధ తగ్గడమే కాక , వ్రాణాలు త్వరగా మానిపోతాయి.

దగ్గు ను నివారించడానికి ఒక స్పూన్ మిరియాలు, హాఫ్ టీ స్పూన్ టీ సొంటి ,ఆఫ్ టీ స్పూన్ తేనె కలిపి తీసుకుంటే త్వరగా దగ్గును నివారించవచ్చు. ఈ కలబంద మొక్క సర్వరోగ లను నయo చేస్తుంది. కలబంద గుజ్జుని రోజ్ వాటర్ లో కలిపి శరీరానికి రాస్తే శరీరంలోని మృతుకణాలు పోతాయి. శరీరం కాలిన చోట కలబంద గుజ్జుని రాస్తే త్వరగా మానిపోతాయి. ఉదయం పరిగడుపున కలబంద ఆకులను తింటే కడుపులో ఉన్న అన్ని రకాల వ్యాధులు పోతాయి. శరీరంలో ఉండే నల్లని భాగాలలో క లబంధ గుజ్జును రాసుకుంటే నల్ల మచ్చలు గాని, ముళ్ళలో ఏర్పడిన నలుపు గాని వెంటనే పోయి శరీరం కాంతివంతంగా మెరుస్తుంది.

కీళ్ల నొప్పులు తగ్గించడానికి కలబంద గుజ్జు బాగా ఉపయోగపడుతుంది. కలబందలో అలోయి న్ అని రసాయన పదార్థం ఉంది. జుట్టు సంరక్షణలో కూడా కలబంద బాగా ఉపయోగపడుతుంది .జుట్టు లోని చుండ్రును నివారిస్తుంది .జుట్టు నల్లగా మెరిసేందుకు సహాయపడుతుంది. కలబంద కండిషనర్ లాగా కూడా ఉపయోగపడుతుంది. అలో వీర వేడి చేసే గుణం కలిగి ఉంటుంది .చేదు రుచిగా ఉంటుంది .

లివర్కు టానిక్ లాగా పనిచేస్తుంది .గర్భాశయానికి కూడా ఒక మంచి టానిక్ లాగా పని చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది .నెలసరి సమస్యను నివారిస్తుంది .నెలసరి సమస్యలు ఆలస్యంఉన్నవారికి కలబంద మంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా కడుపులో ఏర్పడే అల్సర్లు మరియు అజిర్తి, వంటి సమస్యలను తగ్గిస్తుంది .ఉదర ఆరోగ్యాన్ని పెంచుతుంది. గ్యాస్టిక్ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది .శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Aloe Vera side effect:

కలబంద ను తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో, అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవి కలబంద గుజ్జును డైరెక్ట్ గా ఫేస్ ల మీద పెట్టుకోకూడదు. దీనివల్ల అలర్జీ సమస్యలు వస్తాయి. సౌందర్య ఉత్పత్తిలోనూ, ఆయుర్వేదంలోనూ, జ్యూసు, హెయిర్, ప్రపంచవ్యాప్తంగా చాలా ఉత్పత్తులు ఉన్నాయి. దీనివల్ల నష్టాలు కూడా ఉన్నాయి. కలబంద గుజ్జును సరియైన నియమాలు పాటించి తీసుకోవాలి లేకపోతే నష్టం కలుగుతుంది. కొంతమంది ఆహారం తిన్న వెంటనే జీర్ణం అవ్వడానికి కలబంద గుజ్జును తీసుకుంటారు. ఇది పేగు కదలికలకు బాగా ఉపయోగపడుతుంది.

అధిక మొత్తంలో తీసుకుంటే దుష్ప్రభాలు వస్తాయి. కలబంద లో ఉన్న laxative గుణాలు విరేచనాన్ని కలగజేస్తాయి. ఒకవేళ మీరు ఏదైనా ఆరోగ్య సమస్యలు కలిగి ఉండి డాక్టర్ చెప్పిన మందులను వాడే సమయంలో కలబంద రసం తాగడం వల్ల మందులతో దుష్ప్రభావాలు అధికం చేస్తుంది అంతేకాకుండా laxative గుణాలు తీసుకున్న మందులతో కలిపి వేసుకున్న మందులు శరీరం గ్రహించకుండా చేస్తుంది.

మీరు ఉల్లిపాయ, అల్లం ,వెల్లుల్లి, లిల్లీలతో ,కలబంద వాడితేఅలర్జీలకు గురి అవుతారు. 12సంవత్సరాల తక్కువ వయస్సుఉన్న పిల్లలు కలబందను దూరంగా ఉంచడం మంచిది. మూత్ర విసర్జన సమయంలో మూత్రం ఎరుపు, గులాబీ ,రంగులో ఉండడానికి కారణం అవుతుంది. మృదు కండరాలను బలహీనపరుస్తుంది. చిన్నపిల్లలు యుక్త వయస్సులు ఉన్నవారు కలబందకు దూరంగా ఉండాలి.

అనారోగ్య సమస్యలు ఉన్న వారు మందులు తీసుకున్నట్లయితే కలబంద గుజ్జులో laxative ఉందందున మందులు వేసుకుంటే అవి పని చేయవు. చర్మంపై దద్దుర్లు, చాతిలో నొప్పి శాస తీసుకోవడంలో ఇబ్బంది వంటిదుష్ప్రభావాలు ఎదురవుతాయి. గర్భంతో ఉన్న స్త్రీలు కలబందను తీసుకోకపోవడం మంచిది. ఒకవేళ తీసుకుంటే కలబందలో ఉండే laxative గుణాలు గర్భ స్రావం కి కారణం అవుతాయి.

పిల్లలకు పాలిచ్చే తల్లులు కూడా కలబందకు దూరం ఉండడం మంచిది. ఒకవేళ పాలిచ్చే తల్లులు తీసుకుంటే పాల ద్వారా శిశువుకు చేరి విరోచనాలు కలుగజేస్తుంది. కలబంద రసం తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులను అధికం చేసే ఎడ్రినల్ అనే హార్మోన్ అధికం చేస్తుంది. తీరంలోని పొటాషియం స్థాయిలను తగ్గించి క్రమరాహిత్య హృదయ స్పందన కలిగిస్తుంది.

కలబంద రసం తాగడం వల్ల శరీర రక్తంలోని చక్కర స్థాయిలను తగ్గిస్తుంది. ఒకవేళ మీరు రక్తంలోని రక్తంలోని చక్కెర స్థాయిలను సమన్వయపరిచే మందులు లేదా మధుమేహ వ్యాధిగ్రస్తులు అయితే సాధ్యమైనంత వరకు కలబందకు దూరం ఉండటం చాలా మంచిది. ఎవరైతే ఇన్సులిన్ వంటి మందులను వాడుతున్నారో ,మరియు శరీరంలోని చెక్కెరస్థాయిలను తగ్గించుకోవడానికి మందులను వాడుతున్నారో, వారు కలబంద రసము తీసుకోకపోవడమే,మంచిది.

ఎక్కువ కాలం పాటు కలబంద రసం తీసుకోవడం వల్ల మలబద్దక సమస్య వస్తుంది. మొత్తంలో తీసుకుంటే కలబంద రసం పెల్విస్ మరియు మూత్ర సంబంధిత వ్యాధులు కలిగే అవకాశం ఉంది. కలబంద రసం తీసుకోవడం వల్ల ఎలక్ట్రాన్ల ఆ సమతుల్యతను మరియు శరీరంకు డీహైడ్రేట్ కు గురిచేస్తుంది. కలబంద గుజ్జులో laxative గుణాలు ఉన్నందున విరోచనాలు కలుగుతాయి. చర్మ సమస్యలు వంటి సమస్యలు తలెత్తుతాయి. గర్భంతో ఉన్న స్త్రీలు కలబంద రసం ను తీసుకోవడం వల్ల గర్భస్రావం కలగవచ్చు. డెలివరీ సమయంలో సమస్యలు తలెత్తుతాయి.

Exit mobile version