Plants

Bachali Kura benefits Telugu: పోయి సాగ్ బచ్చలి ఆకుల ఉపయోగాలు

బచ్చలాకు గురించి: బచాలీ కురాను పోయి సాగ్ లేదా మలబార్ బచ్చలికూర లేదా చైనీస్ బచ్చలికూర అని కూడా పిలుస్తారు. బచ్చలిని ఇండియన్ స్పీనచ్ లేదా మలబార్ స్పినచ్ అంటారు. ఈ పంటను భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో సాగు అవుతుంది. బచ్చలి కూర సాధారణంగా తీగల లాగా పెరిగే బహు వార్షిక పంట. దీన్ని ఏక వార్షిక పంట గ కూడా పండిస్తారు. దీని కాండం మెత్తగా ఉండి, లేత ఆకులు కలిగి ఉంటుంది. దీన్ని లేత కొమ్మలు , మరియు ఆకులు కాడాలతో సహా వండుకుంటారు. బచ్చలాకులో నాలుగైదు రకాలు కలువు.

దీనిలో ముఖ్యమైనది తీగబచ్చలి. దీనిని తీగ మొక్కలుగా పెంచవచ్చు. ఆకులు కాడలు కాండాలు కలిగి ఉండును. ఎర్ర బచ్చలి,కాడ బచ్చలి, తీగ బచ్చలి మనకు దొరుకుతుంది. ఎక్కువగా కాడ బచ్చలి మనకు దొరుకుతుంది. ఇంటి పెరట్లో కూడా పెంచుకోవచ్చు దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

బచ్చలి ఆకుల ఉపయోగాలు:

బచ్చలి కూర అధిక మొత్తంలో క్యాల్షియం ,పొటాషియం, మెగ్నీషియం, ఇనుమును, సరఫరా చేస్తుంది .అంతేకాకుండా విటమిన్ ఏ, విటమిన్ సి,లను కూడా కలిగి ఉంటుంది .లేత కాడలో కూడా విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఆకులలో ఉండే బీటా కెరోటిన్ కంటి చూపును మెరుగుపరుస్తుంది. బచ్చలిలోని ఆగ్జాలిక్ ఆసిడ్ మిగతా ఆకుకూరల కంటే తక్కువ మోతాదులో ఉండటం వలన ఆరోగ్యానికి చాలా మంచిది.

ముఖ్యంగా కిడ్నీలకు ఎలాంటి హాని కలగదు. ఊపిరితిత్తులకు బచ్చలి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా వృద్యాప ప్రక్రియలను తగ్గిస్తుంది. ఆకులలోని జిగట పదార్థం మలబద్ధకపు నివారణలో ఉపయోగపడుతుంది. సోఫా నిక్ అనే పదార్థం బచ్చలిలో ఉండటం వల్ల క్యాన్సర్ రాకుండా చేస్తుంది. ఆకులు కాండం నుండి తీసిన రసాన్ని తరచుగా వచ్చే తలనొప్పిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. బ చ్చలి కూర శరీరంలోని చెడు కొవ్వును తగ్గించి, మంచి కొవ్వును పెంచుతుంది.

Bachali kura benefits telugu
Bachali kura

బచ్చలి ఆకులో ఉండే క్యాలరీస్:

బచ్చలాకు ఎన్నో పోషక విలువను కలిగి ఉంది. 100 గ్రాముల బచ్చలాకులో20 కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది. పిండి పదార్థాలు 3.40 గ్రాములు, ప్రోటీన్ 1.80g, కొవ్వు 0.30g, పోలిక్ యాసిడ్ .104m/g ఉంటుంది. విటమిన్ ఏ 400 మైక్రోగ్రామ్, విటమిన్ సి 102, మిల్లీగ్రామ్ క్యాల్షియం 109 మిల్లీగ్రామ్, ఐరన్ 1.2 మిల్లీగ్రామ్, మెగ్నీషియం 65 మిల్లీగ్రామ్ ,జింక్ 0.43 మిల్లీగ్రామ్, కార్బోహైడ్రేట్స్ 3.5 గ్రామ్, మాంసకృతులు 2 గ్రామస్. బచ్చలాకు ఇన్ని పోషక విలువలను కలిగి ఉంటుంది.

బచ్చలాకు లీఫ్ గురించి:

బచ్చలి ఆకులను ,కందిపప్పుతో కలిపి ,కూరగా వండుకొని తింటే గర్భిణీలు ఎదుర్కొనే మలబద్ధకం సమస్య తగ్గిపోతుంది.

పచ్చి ఆకులను రోజుకు రెండు పూటలా నమలి మింగితే నాలుక మీది గుగ్గలు తగ్గిపోతాయి. బచ్చలి ఆకులను నూరి కనతకు పట్టిస్తే తలలో నుంచి వచ్చే త్రీవమైన వేడి తగ్గిపోవడంతో పాటు మంచి నిద్ర కలుగుతుంది. బచ్చలి ఆకుతో చేసిన కూరలు తరచూవాడుతూ ఉంటే మన శరీరానికి చలవ చేస్తుంది. దగ్గు, పైత్యం వంటివి తగ్గిపోతాయి. రక్తహీనత తొలగిపోతుంది ఆకలి పెరుగుతుంది మజ్జిగలో బచ్చలి ఆకులు వేసి ఉడికించి తింటూ ఉంటే పైల్స్ కారణంగా వచ్చే రక్తస్రావం తగ్గిపోతుంది. ఆకుల రసాన్ని కాలిన పుండ్ల మీద పెడితే వెంటనే మంట తగ్గడంతో పాటు పుండ్లు కూడా మానిపోతాయి.

ఆకుల కషాయాన్ని రోజుకు రెండు పూటలు సేవిస్తే మూత్రం సాఫీగా జరుగుతుంది. తీగ బచ్చలి కూరను ప్రతిరోజు తినటం వల్ల వీర్యవృద్ది పెరుగుతుంది. మరియు కంఠస్వరం మృదువుగా మారుతుంది. 200 గ్రాముల బచ్చలి ఆకుల్ని రసాన్ని రోజు రెండు పూటలా తీసుకుంటే మూత్రాశయంలో ఏర్పడే రాళ్లు కరిగిపోతాయి. ఆకుకూరల వల్ల అధిక బరువు ఊబకాయం రాకుండా కాపాడుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా తగ్గిస్తాయి. క్యాన్సర్ రాకుండా రక్షిస్తాయి. ఆకుకూరలు తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. రక్తం తయారీకి కావాల్సిన ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.

బచ్చలి ఆకుతో బోలెడు లాభాలు (bachali kura benefits):

  1. ఆకుకూరలో బచ్చలి కూరకి ప్రత్యేకమైన స్థానం ఉంది .ఇది తెలియని వాలంటూ ఉండరు. దీనిలో పోషకాలతో పాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి
  2. . బచ్చలి రెండు రకాలుగా ఉంది. అవి తీగ బచ్చలి, కాడ బచ్చలి ఎక్కువగా కాడ బచ్చలి మనకు దొరుకుతుంది. ఇంటి పెరట్లో కూడా పెంచుకోవచ్చు. దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు మనకి కలుగుతాయి.
  3. బచ్చలి ఆకుల రసాన్ని ,స్పూన్ తేనె కలిపి, ప్రతి రోజు తీసుకుంటే రక్తహీనత ,నిమోనియా సమస్య తగ్గుతుంది.
  4. ఇందులో సెలీనియం, నీ యసిన్ ,ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ,పుష్కలంగా ఉండటం వల్ల మెదడు నరాల ఆరోగ్యానికి చాలా మంచిది.
  5. బచ్చలి ఆకులని ఆహారంలో చేర్చుకోవడం వల్ల చర్మానికి కొత్త మెరుపు వస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు బచ్చలి కూరను రోజువారి ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది.
  6. మూత్ర సమస్యలు ఉన్నవారు రోజు బచ్చలి కూర కషాయాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బచ్చలి ఆకుల రసాన్ని కాలిన పుండ్ల మీద పెడితే పుండ్లుతగ్గిపోతాయి.
  7. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండాబచ్చలి ఆకు కాపాడుతుంది. పచ్చకామెర్లు వచ్చి తగ్గాక బచ్చలి కూర తింటే త్వరగా కోలుకుంటారు.
  8. బచ్చలి ఆకులను కందిపప్పుతో తింటే గర్భిణీలు ఎదుర్కొనే మలబద్ధకం సమస్య తగ్గిపోతుంది. బచ్చలాకులో పోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య రాకుండా కాపాడుతుంది.
  9. బాడీలో కొత్త కణాల పునరుత్పత్తికి పోలిక్ యాసిడ్ అవసరం. 100గ్రాముల బచ్చలి కూరలో 4 00మిల్లీగ్రాములు ఉంటుంది.

కoద బచ్చలి గురించి:

కంద అనగా భూమిలో పెరిగే ఒక దుంప. కంద బచ్చలిని ఎక్కువగా ఫంక్షన్లలో, పెళ్లిలలో వండేవారు. కంద గడ్డలు ముదురు పింక్ రంగులో ఉంటాయి. దీంతో కూరలు వండుకోవడానికి ఆ
ఇష్టతను చూపుతారు. అయితే అవి అందించే లాభాలు అన్ని ఇన్ని కావు.

ఎందుకంటే మన శరీరా ల కుఅవసరమయ్యే పోషకాలు అన్ని ఇన్ని కావు. కొన్ని ప్రాంతాల వారు చిలకడ దుంప, మొహరం గడ్డలు ,గెనుసు గడ్డలు అంటారు. కందగడ్డలో బీటా కెరటం సమృద్ధిగా ఉంటుంది అందువల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది గర్భంతో ఉన్నవారు విటమిన్ సి మహిళలకు విటమిన్స్ఎంత అవసరమో ఇది కందగడ్డలో లభిస్తుంది. కందగడ్డలు తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది.

కందగడ్డలో ఉండే బీటా కెరోటిన్ చర్మ సమస్యలు రాకుండా చేస్తుంది. కందగడ్డలు యాంటీ ఇన్ఫ్లమెంటరీ ,యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల నొప్పులు ,వాపులను,తగ్గిస్తాయి. పిండం సరిగ్గా పెరిగేందుకు సహాయపడుతుంది ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. సూర్యుడు నుంచి విడుదలయ్యే అతినీల లోహిత కిరణాల నుండి రక్షణ కలిగిస్తాయి. గాయాలు త్వరగా మానడానికి ఉపయోగపడతాయి. డయాబెటిక్ ఉన్నవారికి కందుగడ్డలు ఒక వరమే అని చెప్పవచ్చు. దుంప అయినప్పటికీ ఇవి ఆలు లాగా కాదు .కందగడ్డలు తినడం ద్వారా వాటిలో ఉండే ఫైబర్ ,రక్తంలో షుగర్ పెరగకుండా చేస్తాయి.

అలాగే విటమిన్ సి ,పొటాషియం వల్ల, షుగర్ లెవెల్స్ ,పెరగకుండా చేస్తాయి. కందగడ్డను స్పెసిఫిక్ నేమ్ amorphophallus paeoniifolius. ఇది araceae కుటుంబానికి చెందినది. కందగడ్డ ను ఏనుగు పాదం అని కూడా అంటారు. ఎందుకంటే కందగడ్డను రెండు భాగాలుగా కట్ చేసినప్పుడు అది ఏనుగు పాదంలాగా కనిపిస్తుంది. కండలో పుష్కలంగా ఉండే పోషకాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యాన్ని క్రమబద్ధీకరిస్తుంది.

Bachali kura pappu:

గుండె సమస్యలకు చెక్ పెడుతుంది క్యాన్సర్ ను అడ్డుకుంటుంది .కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది .బాడికి వేడి చేస్తే ఇది చలువ చేసే గుణం కలిగి ఉంటుంది. బాడీలో చెడు కొలెస్ట్రాల్ ను ఉంటే మనం బంతిలాగా బరువు పెరుగుతాము. కందరు తింటే చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయి బరువు తగ్గిపోతారు ఫిట్నెస్ గా తయారవుతారు దీని వల్ల ఇందులో ఉండే ఫైబర్ అధిక బరువు తగ్గాలనుకునేవారు వారానికి రెండు సార్లు కొందరు తింటే మంచిది. కందాలో ఉండే పోషకాలు మహిళలకు చాలా మంచిది. కంద మహిళల్లో ఈస్ట్రోజన్ ను ఉత్పత్తి పెంచుతుంది.

కీళ్ల నొప్పుల్ని నివారిస్తుంది ఫైబర్ ఉండే ఏ ఆహారం అయినా బరును తగ్గిస్తుంది కొందరు తింటే ఇక ఆకులు వేయదు ఉడకబెట్టి తింటే ఎంతో మేలు. ఓమ్ 3 ప్లాటియాడ్స్ కందలో ఉంటాయి. అంతేకాదు కెరోటిన్ ,విటమిన్ b6 ,విటమిన్ సి ఖనిజాలు ఉంటాయి .ఇది జుట్టు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ముసలితనo త్వరగా రాకుండా ఉండాలంటే కంద తినాలి .కంద ముఖంపై ముడతలను పోగొడుతుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ముసలితనాన్ని అడ్డుకుంటుంది .

కందలో ఫైబర్ ఎక్కువ కాబట్టి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. కాబట్టి షుగర్ పేషెంట్లు కూడా తినవచ్చు. మన శరీరంలో చెడు, విష పదార్థాలు ఉంటే అవి బయటికి పంపిస్తుంది. పొట్ట ,పేగు ,లివర్ను అన్ని శుభ్రంగా ఉంచుతుంది .మతిమరుపు వస్తుందంటే కచ్చితంగా కందాను తీసుకోవాలి .ఇందులో మెగ్నీషియం, సెలీనియా ,జింక్, ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ,జ్ఞాపకశక్తిని పెంచుతాయి .మెదుడు నరాలు చురుకుగా పనిచేసేలా చేస్తాయి. ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే కంద తినాలి. అడ్డమైన వైరస్లు మన దరిచేరనీయవు. కంద మంచి బ్యాక్టీరియాను అభివృద్ధి చేసి యాంటీ బ్యాక్టీరియా గా మారుతుంది ..

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button