PlantsRecipes

Chikkudu Benefits in Telugu: చిక్కుడుకాయలను వారంలో ఒక్కసారైనా తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు

Chikkudu Benefits in Telugu: చిక్కుడుకాయగురించి; చిక్కుడుకాయలు ఎక్కువగా చలికాలంలో లభిస్తాయి. ఆహారంలో భాగంగా చిక్కుడుకాయలను వారంలో ఒక్కసారైనా ఆహారంలోచేర్చుకుంటే శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అనేక పోషక విలువలను కలిగి ఉంటాయి ఈ చిక్కుడుకాయలు. చిక్కుడుకాయను తినడానికి చాలామంది ఇష్టపడతారు. తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చిక్కుడుకాయ ‘fabaceae ‘కుటుంబానికి చెందినది. దీన్ని సైంటిఫిక్ నేమ్,”lablab purpureus” దీనిని ‘broad beans’ అని కూడా అంటారు.

హిందీలో సేమ్ పల్లి అంటారు.చిక్కుడుకాయలో యాంటీ ఆక్సిడెంట్లు ,విటమిన్లు, పుష్కలంగా ఉన్నాయి. చిక్కుడుకాయలో పీచు పదార్థాలు ,క్యాల్షియం, పోలీక్ట్ ఆమ్లం,మాంసకృతులు ,మెగ్నీషియం, ఐరన్ ,ఫాస్పరస్ ,జింక్ వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి. చిక్కుడుకాయలో విటమిన్ ఏ, విటమిన్ సి ,విటమిన్b1ఉన్నాయి.100 గ్రాముల చిక్కుడుకాయలు దాదాపు మూడింతలకు పై గా నీరే ఉంటుంది. చిక్కుడుకాయలను కూరల రూపంలో అయినా లేదా గింజలనుఉడికించి అయినా ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.

మరియు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇవి క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. మరియు హుద్రోగాలు దూరం చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు చిక్కుడుకాయలను తీసుకోవడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. చిక్కుడుకాయలో ఉండే క్యాల్షియం ,విటమిన్ డి ,ఎముకలకు దృఢంగా మారే టట్లు చేస్తుంది. గర్భిణీలు ,పాలిచ్చే తల్లులకు చిక్కుడుకాయలను తీసుకోవడం వల్ల శక్తిలబిస్తుంది. చిక్కుడుకాయలను తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది .కాబట్టి ఆకలి వేయదు. ఫలితంగా బరువు నియంత్రణలో ఉంచుకోవచ్చు.

చిక్కుడుకాయ కర్రీ తయారీ విధానం;

ఇందులో ఉండే పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేటట్లు చేస్తుంది. మరియు పేగు క్యాన్సర్ రాకుండా చేస్తుంది. విటమిన్ ఏ ఉండటం వల్ల కంటి చూపును మెరుగుపరుస్తుంది. చిక్కుడుకాయ లో విటమిన్ b1ఉండటం వల్ల మెదడుపని తీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. విటమిన్ b1 గుండె ఆరోగ్యాoగాఉంచడంలో సహాయపడుతుంది. సెలీనియం ,మ్యాంగనీస్ వంటి, ఖనిజాలు చిక్కుడుకాయలో పుష్కలంగా లభిస్తాయి. చిక్కుడుకాయలో మాంగనీస్ ఉండటం వల్ల నిద్రలేమి సమస్యలను తగ్గిస్తుంది.

చిక్కుడు గింజల గురించి:

Chikkudu Benefits in Telugu

చిక్కుడు గింజలు రక్తంలోని షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తాయి. అయితే చిక్కుడు గింజలు తినడం అలవాటు చేసుకుంటే మొదట్లో కాస్త కడుపులో ఉబ్బరంగా ఉంటుంది .క్రమంగా గ్యాస్ నుంచి ఉపశమనం కలిగి తొందరగా ఆహారం జీర్ణమవుతుంది. చిక్కుడు గింజలలో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అతి సారం మరియు మధుమేహం మరియు కొలెస్ట్రాలను తగ్గిస్తుంది .చిక్కుడుకాయలో క్యాల్షియం ,ఇనుము ,ఫాస్పరస్, మాంగనీస్, బాష్పరం, పుష్కలంగా లభిస్తాయి .చిక్కుడుకాయలు ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, మరియు క్యాలరీలు అధికంగా ఉంటాయి.

చిక్కుడుకాయలు తీసుకోవడం వల్ల వృద్ధాప్యం వల్ల వచ్చే అనేక వ్యాధులను నివారిస్తుంది. కాల్షియం మరియు ఐరన్ అధికంగా కలిగి ఉండటం వల్లరక్త స్రావం సమయంలో స్త్రీలు రక్తం కోల్పోతారు .కాబట్టి ఎముకలు బలహీనంగా ఉంటాయి. కాబట్టి చిక్కుడుకాయలు తీసుకోవడం వల్ల ఎముకలు గట్టిగా తయారవుతాయి. మతిమరుపు సమస్యను నయం చేయడానికి డాక్టర్లు లేవో డిపో అనే కెమికల్స్ ను వాడతారు.

ఈ లెవో డిపో అనే కెమికల్స్ చిక్కుడులో ఉండటం మన అదృష్టం. కాబట్టి మెదడు చురుకుగా పనిచేయడానికి మరియు మతిమరుపు నుతగ్గించడానికి చిక్కుడును తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
చిక్కుడుకాయలోని క్యాలరీస్; చిక్కుడుకాయలో 209 క్యాలరీల శక్తి ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ 8.2 గ్రామ్స్, ఫ్యాట్ 3 గ్రామ్స్, 41 mg, ఐరన్0.76mg, నీ విషయం మెగ్నీషియం42mg, ఫాస్పరస్49mg, జింక్0.38 mg,ప్రోటీన్ 6.1 గ్రా, ఉంటాయి. ఏ విటమిన్, సి విటమిన్ ,విటమిన్ b1 మరియు ప్రోటీన్స్, మినరల్స్ ను ,పుష్కలంగా కలిగి ఉంటుంది.

ముందుగా చిక్కుడుకాయలను పురుగు లేకుండా శుభ్రంగా , చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని శుభ్రంగా వాటర్ తో వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక టమాట పండును సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడు ఉప్పు కొద్దిగా కొత్తిమీర టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు తీసుకొని పక్కన పెట్టుకోవాలి.

ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని అందులో టి టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి.oil వేడి అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నonion వేసిదోరగా వేయించుకోవాలి. టమాట పండును వేసుకుని ముగ్గిoచుకోవాలి. ఆ తర్వాత మనం సన్నగా తెంచుకున్నచిక్కుడుకాయ లను వేసుకోవాలి. చిక్కుడుకాయలను ఒకసారి బాగా కలుపుకొని చిటికెడు పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, మరియు వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్, వన్ టీ స్పూన్ కారం, వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొవలి.

కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ కి మూత పెట్టుకోవాలి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే చిక్కుడుకాయలు పూర్తిగా ఉడికిపోయి ఉంటాయి. చివరగా ఒకసారి బాగా మొత్తం కలుపుకొని టెస్ట్ కు సరిపడినంత ఉప్పు ఉందో లేదో చూసుకొని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. వేడివేడిగా ఉండే చిక్కుడుకాయల కూర రెడీ. అన్నంలో గాని ,సైడ్ డిష్ గా గాని ,చపాతీల్లోకి గాని ,చాలా బాగుంటుంది.

చిక్కుడుకాయల ఫ్రై తయారీ విధానం:

నేను ఇక్కడ 300 గ్రాముల చిక్కుడుకాయలను తీసుకున్నాను. వీటిని శుభ్రంగా నీటితో కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటిని ఒక బౌల్లోకి తీసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఐదు నిమిషాలు ఉడికించుకున్నాను. తర్వాత ఒక కడాయి పెట్టుకుని అందులో నూనె వేసుకుని ముందుగా పోపు గింజలను వేసుకున్నాను. ఈ పోపు గింజలు చిటపటలాడిన తర్వాత, ముందుగా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను వేసుకొని బాగా కలుపుకున్నాను. అందులోనే చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసుకోవాలి.

వీటిని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. చిక్కుడుకాయలు ఉడికే వరకు మనం ఇక్కడ మిక్సీ జార్,తీసుకొని, అందులో రెండు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, ఒక చిన్న సైజు వెల్లుల్లి రెమ్మలు, రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బెర, ఒక టీ స్పూన్ కారం ,ఒక టీ స్పూన్ ఉప్పు, వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. బరకగా గ్రైండ్ చేసుకున్న పేస్టును పక్కన పెట్టుకోవాలి. చిక్కుడుకాయలు ఉడికినాయో లేదో మూత తీసి చూడాలి.

మూత తీసి చూస్తే చిక్కుడుకాయలు ఉడికిపోయి ఉంటాయి. ఇందులోనే మనం తయారు చేసుకున్నపేస్టు ను వేసి ఒకసారి బాగా మొత్తం కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. మూత తీసి చూస్తే చిక్కుడుకాయ ఫ్రై అయి ఉంటాయి.చాలా టేస్ట్ గా ఉండే చిక్కుడుకాయ ఫ్రై రెడీ.
రెడ్ బ్లడ్ సెల్స్ లో సమస్య ఉన్నవారు కచ్చితంగా డాక్టర్ని సంపాదించే దీనిని తీసుకోవాలి.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button