Plants

Chukka Kura benefits in Telugu: చుక్కకూర ఈ రోగాలకు చెక్

Chukka kura: చుక్కకూర మనఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ ఏ ,విటమిన్ సి ,లతోపాటు ఐరన్ ,క్యాల్షియం, మెగ్నీషియం ,పొటాషియం వంటి ,ఖనిజాలతో పాటు ,బీటా కిరోటిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్ ,పుష్కలంగా లభిస్తాయి. చుక్క కూరలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది రక్తహీనత సమస్యతో బాధపడేవారు ,క్రమం తప్పకుండా చుక్కకూరను, ఏదో ఒక రూపంలో తీసుకోవడం వలన ,రక్తహీన సమస్యను దూరం చేసుకోవచ్చు .చుక్క కూర శరీరంలో ఎర్ర రక్త కణాల వృద్ధికి ఎంతో సహాయపడతాయి. చుక్కకూరను ఇంగ్లీషులోsorrel leaves అంటారు.

ముఖ్యంగా పురుషులలో చిక్కకూర చేసే మేలు అంతా ఇంత కాదు. ఇందులో జింక్ పుష్కలంగా లభిస్తుంది .జింకు ఉండటం వల్ల పురుషులలో వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే మగవారిలో వచ్చే శృంగారసమస్యలను తగ్గించడంతోపాటు ,శృంగార శక్తిని రెట్టింపు చేస్తుంది. చుక్కకూర జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇందులో సమృద్ధిగా లభించే ఫైబర్ మలబద్ధక సమస్యను ,దూరం చేసి మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును, కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. చుక్కకూర ఆకుల రసం వల్ల రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి జుట్టు ఒత్తుగా పెరిగేందుకు, మరియు ఆరోగ్యంగా ఉండేందుకు చిక్కకూర రసం బాగా ఉపయోగపడుతుంది.

Chukka kura telugu

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం కాంతివంతంగా మరియు యవ్వనంగా ఉండేందుకు సహాయపడుతుంది. చుక్కకూరలో ఉండే విటమిన్ ఏ ,మరియు బీటా కెరోటిన్లు కంటి చూపులు మెరుగుపరుస్తాయి. అలాగే ఇందులో ఉండే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు శరీరంలో క్యాన్సర్ కణాల వృద్ధిని నివారిస్తాయి. చుక్కకూర మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారం. షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. శరీరంలో తెల్ల రక్త కణాల వృద్దికి దోహద పడటంతో పాటు ,శరీరాన్ని అనేక వ్యాధుల నుండి కాపాడి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

Chukka kura Pappu తయారీ విధానం:

ముందుగా రెండు చిన్న సైజు చిక్కకూర కట్టలను తీసుకున్నాను. వాటిని వేర్లు మాత్రమే కట్ చేసి, తరువాత చిక్కకూరను రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక కుక్కర్ తీసుకోవాలి. ఒక కప్పు కంది బ్యాలెను తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిక్కకూరను వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను సన్న కట్ చేసుకుని కుక్కర్లో వేసుకోవాలి. పది పచ్చిమిరపకాయలు సగం కట్ చేసి వేసుకోవాలి. చిటికెడు పసుపు, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చిక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఒక టమాట పండు సన్నగా కట్ చేసుకోనివేసుకోవాలి.

ఫ్యాన్ వేడి అయిన తర్వాత త్రీ టేబుల్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడి అయిన తర్వాత పోపు గింజలను వేసుకొని, అవి బాగా చిటపటలాడిన తర్వాత, నాలుగు వెల్లుల్లి రెమ్మలను కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోవాలి. వెల్లుల్లి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక చిన్న సైజుఉల్లిగడ్డ ను,సన్నగా కట్ చేసుకోని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే రెండు ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలి. చివరగా రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని, బాగా దోరగా వేయించిన తర్వాత చిక్కకూర పప్పులో కలుపుకోవాలి. గుమగుమలాడే చిక్కకూర పప్పు రెడీ.

Chukkakura pachadi తయారీ విధానం:

చుక్కకూరను మూడు కట్టలు తీసుకోవాలి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని, చిన్నచిన్న పీసెస్ గా కట్ చేసుకొని ,నీళ్ళు పోయేంతవరకు రంద్రాలు ఉన్న గిన్నెలు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. లో ఫ్రేమ్ పెట్టుకొని లైట్ కలర్ చేంజ్ చెయ్, చిటపటలాడేంతవరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. కారానికి తగ్గట్లుగా 10 నుంచి 15 ఎండు మిరపకాయలు బాగా ఫ్రై చేసుకుని ,లో ఫ్రేమ్ లో పెట్టుకొని ,వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చుక్కకూర పులుపు ఎక్కువ కాబట్టి కారం ఎక్కువగానే పడుతుంది.

ఇప్పుడు అదే పాన్ లో ఒక టేబుల్ ఆయిల్ వేసుకొని ,ఆయిల్ హీట్ అయిన తర్వాత ,ఒక టేబుల్ జీలకర్ర వేసి నా తర్వాత మనం ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నా చుక్కకూరను అందులో వేసి మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి. ఇదంతా మగ్గి వాటర్ మొత్తం బయటికి వచ్చేంతవరకు , లో ఫ్లేమ్ లో ఉంచుకొని ,చుక్కకూర బాగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ,కంప్లీట్ గా పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు, ఎండుమిరపకాయలు వేసి ఫైన్ గా పౌడర్ చేసుకోవాలి.

ఇప్పుడు చల్లార్చిన చుక్కకూర సపరేట్గా మిక్సీలో లేదా రోకలిలో కచ్చాపచ్చాగా దంచుకోవాలి. తర్వాత ఒక ఫ్యాన్,పెట్టుకుని రెండు టేబుల్ ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత, పోపు దినుసులు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత, ఒక ఎండుమిర్చి సగానికి కట్ చేసుకొని,వేసుకోవాలి. రెండు రెమ్మల కరివేపాకు ,ఒక చిన్న ఉల్లిపాయ, సన్నగా కట్ చేసుకుని వేసుకుని, ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. ఇందులోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న చుక్కకూర, ఎండు మిరపకాయల ,నువ్వుల పొడి కూడా వేసి, ఇవి అన్ని ఒకసారి కలుపుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని టెస్ట్ చూడాలి. టేస్ట్ కి సరిపడినంత ఉప్పు లేకపోతే కొద్దిగా యాడ్ వేసుకోవాలి. ఇవి అన్ని ఒకసారి కలుపుకొని రెండు నిమిషాలు low flame పెట్టుకొని, స్టవ్ ఆఫ్ చేసి పక్కన దించుకోవాలి. అంతేనండి ఈ చిక్కకూర పచ్చడి రెడీ.ఈ పచ్చడిని బాక్స్ లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు .వారం రోజులపాటు నిల్వ ఉంటుంది.

Chukka Kura recipe తయారీ విధానం:

చుక్కకూరను ముందుగా తీసుకోవాలి. కాడలతో సహా కట్ చేసుకుని తీసుకోవాలి. వేర్లు మాత్రమే కట్ చేసి చుక్కకూరను సన్నగా పీసెస్ గా కట్ చేసుకోవాలి. రెండు లేదా మూడు కట్టలను తీసుకోవాలి. ముందుకు స్టవ్ ఆన్ చేసి, ఒక ఫ్యాన్ పెట్టుకుని అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్నా, చుక్కకూర మరియు, పది పచ్చి మిరపకాయలు, ఒక టమాట పండు, ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఆయిల్ టీ స్పూను ఆయిల్ వేసి, చిన్న గ్లాసు వాటర్ వేసుకొని, ఈ మిశ్రమాన్ని మొత్తం ,ఒక 10నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ,చుక్కకూరను, మెత్తగా ఉడికించుకోవాలి.

పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చుక్కకూర మొత్తం ఉడికిపోయి ఉంటుంది .దీనిని పప్పు గుత్తితో మెత్త మాష్ చేసుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకుని తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ,వేడి అయిన తర్వాత పోపు గింజలు ,నాలుగు వెల్లుల్లి రెమ్మలు కచ్చాపచ్చా దంచుకుని వేసుకోవాలి .రెండు రెమ్మల కరేపాకు కూడా వేసుకోవాలి. ఒక చిన్న సైజు ఉల్లిగడ్డను వేసుకొని, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి .ఈ మిశ్రమాన్ని మెత్తగా చేసి పెట్టుకున్నా చుక్కకూర కర్రీలో కలుపుకోవాలి. పులపుల్లగా ఉండే చుక్కకూర కర్రీరెడీ. ఇది వేడి వేడి అన్నంలో గాని ,చపాతీల్లోకి గాని, పుల్కాల్లో గాని చాలా బాగుంటుంది.

Chukka kura egg recipe తయారీ విధానం:

ముందుగా చుక్కకూరను శుభ్రంగా వాష్ చేసుకుని , సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గుడ్లను ఒక బౌల్లో తీసుకొని , గుడ్లు మునిగేంత వరకు నీటిని వేసి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. గుడ్లు ఉడకపెట్టిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్యాన్,పెట్టుకుని అందులో మూడు టేబుల్ల ఆయిల్ వేసుకొని,ఆయిల్ వేడి తర్వాత , ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లను వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుని పక్కన ఆ తర్వాత, పెద్ద సైజు ఉల్లిగడ్డను సన్నగా కట్ చేసుకుని అదే,ఆయిల్ లో వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుని పచ్చివాసన పోయేంతవరకు వేడి చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి ,కట్ చేసి పెట్టుకున్నా చుక్కకూరను మొత్తం వేసుకొని ,లో ఫ్లేమ్ లో ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ మొత్తం పైకి వచ్చి ఉడికిపోయి ఉంటుంది. ఆ తర్వాత మన oపక్కన ఉడకబెట్టుకున్న గుడ్లను వేసి, మొత్తం ఒకసారి బాగా కలుపుకొని టెస్ట్ కు సరిపడినంత ఉప్పు ఉందో లేదో చూసుకొని, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని వేడి వేడి అన్నంలో గాని చపాతీలో గాని తినవచ్చు.

Chukka Kura ఉపయోగాలు:

మనకు లభించే ఆకుకూరలలో చుక్కకూర ఒకటి. చుక్కకూర పప్పు ,చుక్కకూర పచ్చడి ,లేదా పులుసుగా వండుకోవచ్చు. దీనిని ఎక్కువగా అన్నంలో ,చపాతీలోతీసుకుంటారు. చుక్కకూరలో విటమిన్లు ,ఖనిజాలు, మినరల్స్ ,సమృద్ధిగా ఉంటాయి. పుల్లగా ఉండే ఈ ఆకుకూర తినడం వలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఒక కప్పు చుక్క కూరలో 123 మిల్లీగ్రాముల క్యాల్షియం లభిస్తుంది. ఇది దంతాలను మరియు ఎముకలను దృఢంగా ఉంచుతుంది. క్యాన్సర్ రాకుండా చుక్కకూర చేస్తుంది .

చుక్కకూరలో ఫైబర్ అధికంగా ఉండడంవల్ల బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం. చుక్కకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది .కాబట్టి ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి ,రక్తహీనతను తగ్గిస్తుంది. ఇది బిలిరూబిన్ సేకరించడానికి ఉపయోగపడుతుంది. కాలేయ సంబంధిత వ్యాధులను రాకుండా నివారిస్తుంది. ఇది జీర్ణశక్తిని పెంచి, జీర్ణ సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది. ఇది శరీరంలో అధికంగా ఉన్న చెడు నీరును బయటకు తొలగిస్తుంది. వాంతులు, విరోచనాలు, కాకుండా ఈ చుక్కకూర చేస్తుంది .

మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. అలాగే మూత్ర సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది. శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది .గుండెకు ఒత్తిడిని తగ్గిస్తుంది .చుక్కకూరలో బీటా కెరోటిన్ఉంటుంది .కాబట్టి కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఈ చుక్కకూరలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ కాబట్టి క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. తరచుగా చుక్కకూరను తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగ్గాపనిచేస్తుంది. దీని ఫలితంగా గ్యాస్ ,ఎసిడిటీ ,కడుపు ఉబ్బరం ,మలబద్ధకం ,వంటి సమస్యల నుంచి రాకుండా చేస్తుంది. చుక్కకూర,లోవిటమిన్ సి తో పాటు శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఈ ఆకుకూరలు మన డైట్ లో చేర్చుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. కాలేయ సంబంధిత వ్యాధులను దరిచేరనీవవు. ఫైబర్,తీసుకోవడం వల్ల క్యాన్సర్ వ్యాధుల నుంచి కూడా కాపాడుతుంది. చెడు కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గించి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది. రక్తపోటు కూడా రాకుండా చేస్తుంది. విటమిన్ ఏ ,విటమిన్ సి ,ప్రభావం వల్ల చర్మం నిగనిగలాడుతూ, కాంతివంతంగా ప్రకాశిస్తుంది. చర్మంపై మచ్చలు, ముడతలు, దురద ,అలర్జీ, వంటివి రాకుండా చేస్తుంది. విటమిన్ సి ప్రభావం వల్ల జుట్టు, ఒత్తుగా పెరుగుతుంది.

కేశ సౌందర్యం నల్లగా ,ఒత్తుగా వస్తాయి. విటమిన్ ఏ ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. రే చీకటి రాకుండా చేస్తుంది. ఒక చుక్కకూలో మెగ్నీషియం ఉండటం వల్ల మెదడు తీరు బాగా పనిచేసేటట్టు చేస్తుంది .మరియు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. కాల్షియం వల్ల బాలింత శిశువు కు,పాలు ఎక్కువగా వస్తాయి. పిల్లలు ఎత్తు పెరగడానికి చిక్కకూరలో క్యాల్షియం బాగా సమృద్ధిగా ఉంటుంది. వృద్ధులకు క్యాల్షియం ఎక్కువ అవసరం. కాబట్టి ఈ చుక్కకూర తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, కందిపప్పు మునిగేంత వరకు గ్లాస్ నీళ్లు వేసుకోవాలి. చిక్క కూరలో నీటి శాతం ఎక్కువ కాబట్టి తక్కువ నీళ్లు వేసుకోవాలి. వీటిని అన్నింటిని వేసి కుక్కర్ కి మూత పెట్టి, స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో మూడు విజిల్ వచ్చేవరకు చిక్క కూర పప్పును ఉడికించుకోవాలి. కొద్దిసేపు తర్వాత కుక్కర్ చల్లబడిన తర్వాత మూత తీసి చూస్తే ,చిక్కకూర పప్పు మొత్తం ఉడికిపోయి ఉంటుంది. దీనిని పప్పు గుత్తితో మెత్తగా మాష్ చేసుకోవాలి. తర్వాత తాలింపు కోసం ఒక పాన్ పెట్టుకుని.

కీళ్లనొప్పులు ,మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది. ఐరన్ ఉండటం వల్ల అన్ని అవయవాలకు రక్త ప్రసరణ సరిగ్గా జరిగేటట్లు చేస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఈ చిక్కకూర తీసుకోవడం చాలా మంచిది. మగవారిలో వీర కణాల వృద్ధిని పెంచుతుంది. ఈ చుక్క కూర తీసుకోవడం వల్ల తెల్ల రక్త కణాలు అభి వృద్ధి చెందాయి. మూత్రపిండ సమస్యలు ఉన్నవారికి ఈ చుక్కకూర బాగా ఉపయోగపడుతుంది. యూనినరీ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది.

చుక్కకూర ఆకుల రసం వల్ల కలిగే ఉపయోగాలు:

చుక్కకూర ఆకుల రసం తీసుకుని, అందులో కొద్దిగా పాలు లేదా పెరుగు కలిపి మూడు రోజులు తీసుకుంటే కామెర్లవ్యాధి తగ్గుతుంది.చుక్క కూర ఆకుల రసంలో చిటికెడు సోడా ఉప్పు కలిపి ,త్రాగితే కడుపు నొప్పి, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి .అతిసారా వ్యాధి రాకుండా చేస్తుంది. ఆకులను వేడి చేసి రసాన్ని తీసి ఆ రసాన్ని చెవులో రెండు చుక్కలు వేస్తే చెవిపోటు తగ్గుతుంది. పుండు ,గాయాలు అయిన చోట ఈ ఆకుల రసం రాస్తే త్వరగా మానిపోతాయి. ఇది తేలు విషానికి విరుగుడుగా పనిచేస్తుంది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button