Coriander Benefits in Telugu: కొత్తిమీర యొక్క శాస్త్రీయ నామం కొరియాండమ్ సా టి వమ్coriandrum sativum. సంస్కృతంలో ధనియా అంటారు. ఇంగ్లీషులో coriander అంటారు. కొత్తిమీర ఆకులలో దయామిన్ ,నియాసిన్ ,రిబో ప్లావి న్, క్యాల్షియం ,సోడియం , మెగ్నీషియం, ఇనుము, మ్యాంగనీస్,పొటాషియం మరియు విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి.
భారతీయ సంప్రదాయ వంటకాలలో కొత్తిమీరను ఎక్కువగా ఉపయోగిస్తారు. సుహాసన భరితంగా ఉంటుంది. కొత్తిమీరను ఔషధంగా కూడా వాడుతున్నారు. కొత్తిమీర కాండంలోనూ ఆకుల్లోనూ గింజల్లోనూ సుగంధ భరితంగా ఉంటుంది. ధనియాల మొక్కల నుంచి ఈ కొత్తిమీర మనకు లభిస్తుంది. కొందరు కొత్తిమీరను ఆహార పదార్థాల యొక్క అలంకరణ అలంకరణ కోసం కూడా ఉపయోగిస్తారు. కొత్తిమీరలో విటమిన్లు, ఖనిజ లవణాలు , సమృద్ధిగా ఉన్నాయి. మరియు ఐరన్ కూడా ఉంటుంది. కొత్తిమీరలో డ్యూడి సీనల్ అనే పదార్థం ఉండటం వల్ల ఆహారాన్ని విషతుల్యం చేసే సాల్మ నెల్లా బ్యాక్టీరియాను నివారిస్తుంది.
కొత్తిమీర ను ప్రతిరోజు తీసుకోవడం ద్వారా విటమిన్ ఏ విటమిన్ b1, విటమిన్ b6 విటమిన్ సి లోహం వంటి పదార్థాల లోపం ఏర్పడకుండా నివారిస్తుంది.
కొత్తిమీరలోని క్యాలరీస్:
100గ్రాముల కొత్తిమీర లో పోషక విలువలు: కార్బోహైడ్రేడ్లు3.67 గ్రామ్,పీచు పదార్థం 2.80 గ్రామ్,కొలెస్ట్రాల్ 0 గ్రామ్,కొవ్వు0.52 గ్రామ్, ప్రోటీన్2.13 గ్రామ్, కాల్షియం67 మిల్లీగ్రామ్, మెగ్నీషియం26 మిల్లిగ్రామ్ ,ఇనుము1 .77 మిల్లీగ్రామ్,మాంగనీస్ 0.426 మిల్లీగ్రామ్,సెలీనియం0.9 మిల్లీగ్రామ్, జింక్0.50 మిల్లీగ్రామ్, సోడియం46 మిల్లీగ్రామ్, పొటాషియం521 మిల్లీగ్రామ్, విటమిన్ ఏ67.48 మిల్లీగ్రామ్, విటమిన్ సి 27 మిల్లీగ్రామ్,విటమిన్ ఈ2.50 మిల్లీగ్రామ్,విటమిన్ కె310 మిల్లీ గ్రామ్,దయామిన్ 0.067 మిల్లీగ్రామ్.
కొత్తిమీర యొక్క ఉపయోగాలు:
కొత్తిమీరను తీసుకోవడం ద్వారా గ్యాస్ సమస్యను తగ్గించడంతోపాటు మూత్రాన్ని చేయడం జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే క్యాల్షియం ఎముకలను దృఢంగా ఉంచడంలో స హ యపడుతుంది.కంటి సమస్యలను కూడా నివారిస్తుంది.మానసిక ఆందోళన కూడా నివారిస్తుంది.ఉదర కండరాలు పట్టేసి నొప్పిని కలిగిస్తున్నప్పుడు కొత్తిమీరను తీసుకోవడం ద్వారా చాలా ఉపశమనం లభిస్తుంది.
బంక విరోచనాలు తగ్గించడానికి కొత్తిమీర రసం చాలా బాగా ఉపయోగపడుతుంది. నోటి పూత ,నోటి దుర్వాసన, చిగుర్ల వాపు, చిగురు లో నుంచి రక్తం కారడం వీటిన న్నింటిని కొత్తిమీర ఆకులను నమిలి నమిలితే నూటికి సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. మంగు మచ్చలు ,చర్మం మీద నల్లని మచ్చలు, పొడి చర్మం ఉన్నవారు కొత్తిమీర రసాన్ని తీసుకోవడం ద్వారా ఉపశమనం కలుగుతుంది.
కళ్ళ మంటలు, కళ్ళ కలక, తాజాగా ఉండే కొత్తిమీర ఆకులను తీసుకొని బాగా కడిగి ముద్దగా నూరి రసాన్ని తీసుకోవాలి. దీనిని చనుబాలతో కలిపి కళ్ళల్లో బిందువులుగా వేసుకుంటే కళ్ల మంటలు కనురెప్పలు అంటుకుపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. దంత సంబంధిత వ్యాధులను మరియు కంటి జబ్బులను కూడా ఈ కొత్తిమీర తీసుకోవడం ద్వారా ఉపశమనం కలుగుతుంది. ముక్కు సంబంధించిన వ్యాధులను కూడా తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ ను నీవారిస్తుంది. కొత్తిమీరను ఉదయం మరియు సాయంత్రం నూరి రెండు పూటలా తీసుకోవడం ద్వారా బరువు సమస్య ఉపశమనం కలుగుతుంది. జీర్ణసమస్యలను కూడా తగ్గిస్తుంది.
మహిళలలో ఉండే రుతుక్రమ సమస్యలను కూడా కొత్తిమీర తీసుకోవడం ద్వారా ఉపశమనం కలుగుతుంది. కడుపులో ఏర్పడే క్యాన్సర్లను ప్రారంభ దశలో నశనం చేసేశక్తి కూడా ఈ కొత్తిమీర కు ఉంది. క్షయ వ్యాధి, ఉబ్బసం ,ఎలర్జీలు మెదడు బలహీనత, కళ్ళ బలహీనత వంటి సమస్యలను ఈ కొత్తిమీర తీసుకోవడం ద్వారా ఉపశమనం కలుగుతుంది. స్మాల్ ఫాక్స్ వ్యాధి నివారణలో కూడా ఈ కొత్తిమీర ఉపయోగపడుతుంది.
శ్వాస నాలల్లో ఉండే కఫాన్ని కూడా తగ్గిస్తుంది. కొత్తిమీరను తీసుకోవడం ద్వారా విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ b ,మరియు విటమిన్లు మరియు బీటా కే రోటిన్ వంటివి కొత్తిమీర ఆకులలో మనకు లభిస్తాయి. మూత్రవిసర్జనకంగా కూడా ఈ కొత్తిమీర తీసుకోవడం ద్వారా ఉపశమనంకలిగిస్తుంది. శరీరంలోఉండే విష పదార్థాలను కూడా బయటికి పంపిస్తుంది. మరియు శరీరంలో ఏర్పడే గ్యాస్టిక్ సమస్యను కూడా నివారిస్తుంది.మూత్ర పిండాల యొక్క పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.
కొత్తిమీరలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. హైపర్ టెన్షన్ను తగ్గిస్తుంది. ధమనులుమరియు సీరా ల గోడలపై ఏర్పడే కొవ్వును కరిగిస్తుంది.గుండెసంబంధిత వ్యాధులను కూడా తగ్గిస్తుంది. కొత్తిమీర యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. కొత్తిమీరలో పీచు శాతం ఎక్కువ కాబట్టి దీనిని ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరంలో హానీచేసే కొవ్వును నివారిస్తుంది. జుట్టు పెరుగుదలకు కూడా కొత్తిమీర కొత్తిమీర రసం బాగా ఉపయోగపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కొత్తిమీర రసం సహాయపడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కొత్తిమీర ఆకు రసం లో ఉంటాయి.
మొటిమలు మరియు మచ్చలను తగ్గించడంలో కూడా ఈ ఆకుల రసం ఉపయోగపడుతుంది. కాలేయం మరియు మూత్రపిండాల యొక్క పనితీరును సక్రమంగా జరిగేటట్లు చేస్తుంది. రుమటాయిడ్ ,ఆర్థరైటిస్ వంటి వ్యాధులను తగ్గించడంలో కూడాఈ కొత్తిమీర ఉపయోగపడుతుంది. అల్జీమర్స్ నివారించడంలో కూడా ఈ కొత్తిమీర ఉపయోగిస్తారు. నాడీ వ్యవస్థ రుగ్మతాలను కూడా తొలగిస్తుంది.
దద్దుర్లు మరియు దురద, మంట ,అలర్జీలను తగ్గించడంకోసంకోసం కొత్తిమీరను ఉపయోగిస్తారు. దీనిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల కడుపులో ఏర్పడే వికారం మరియు వాంతులు ల న్ను తగ్గిస్తుంది .అంతేకాకుండా కడుపులో ఏర్పడే సమస్యలను తగ్గిస్తుంది .మరియు కడుపుని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కొత్తిమీర డయేరియాను తగ్గిస్తుంది. మరియు ఆకలిని పెంచుతుంది.
కొత్తిమీర పచ్చడి తయారీ విధానం.
ముందుగా ఒక పెద్ద కట్ట కోతిమీరను తీసుకొని దానిని శుభ్రంగా మూడు నాలుగు సార్లు నీటితో వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత వాటికి రంద్రాలున్న గిన్నెలోకి వేసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుని చిటపటలాడిన వరకు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. తరువాత అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 10 ఎండు మిరపకాయలను దోరగా వేయించుకున్నాను.
వేయించి ఎండు మిరపకాయలను ఒక ప్లేట్ లోకి పక్కన పెట్టుకున్నాను. అదే నూనెలోకి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కాడలతో సహా వేసుకుని నూనెలోనే మగ్గించుకున్నాను. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కొత్తిమీర ఉడికిపోయి ఉంటుంది. అందులోనే కొద్దిగా చింతపండుని వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకున్నాను. పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చింతపండు, కొత్తిమీర ఉడికిపోయి ఉంటుంది.
దీన్ని ఒక రుబ్బు రోల్ లోకి,తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను ,ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలు వేసుకుని దంచుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసి దంచుకున్నాను. అందులోనే వేయించి పక్కన పెట్టుకున్న ఎండు మిరపకాయలను కూడా వేసుకుని రో ట్లో మెత్తగా రుబ్బుకున్నాను. ఆ తరువాత నూనెలో మగ్గించుకున్న కొత్తిమీర, చింతపండును కూడా వేసుకొని రోట్లోనే మెత్తగా రుబ్బుకున్నాను. చివరికి టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ వేసుకొని పక్కకి తీసుకున్నాను. వేడివేడి అన్నంలోకి కొత్తిమీర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది.
కొత్తిమీర రైస్ తయారీ విధానం:
ముందుగా ఒక గ్లాస్ రైస్ ని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను. అందులో ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను సన్నగా తరిగి కడాయిలో వేసుకున్నాను. అది కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక చిన్న గ్లాసు పచ్చిబఠానీలు మరియు కొన్ని క్యారెట్ ముక్కలను సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడికించుకున్నాను. మూత తీసి చూస్తే బఠానీలు ,ఉల్లిపాయలు ,క్యారెట్ మగ్గిపోయి ఉంటాయి. అందులోనే చిటికెడు పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్నాను.
తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నాను. అందులోనే ఒక ఇంచు అల్లం వేసుకున్నాను. ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకున్నాను. రెండు లవంగా ముక్కలు ,ఒక చిన్న సైజు చెక్క, ఒక ఇలాచీని వేసుకోవాలి. ఒక పది పచ్చిమిరపకాయలను సగానికి కట్ చేసి వేసుకున్నాను. టేస్ట్ కుసరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను.
ఈమిశ్రమాన్ని మొత్తం ఉడికిపోయి ఉన్నా పచ్చి బఠానీ, ఉల్లిగడ్డ, క్యారెట్ లోకి వేసుకుని మొత్తం ఒకసారి బాగా కలుపుకున్నాను. ఐదు నిమిషాలు మూత పెట్టుకొని పచ్చివాసన పోయేంతవరకుమగ్గించుకున్నాను. తర్వాత మూత తీసి చూస్తే మొత్తం మగ్గిపోయి ఉంటాయి అందులోకి ముందుగా ఉ డకబెట్టుకొని పక్కన పెట్టుకున్న రైస్ ని వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకున్నాను. టేస్ట్ కి సరిపడినంత ఉప్పు ఉందో లేదో చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. వేడివేడిగా ఉండే కొత్తిమీర రైస్ రెడీ. టెస్టు చాలా బాగుంటుంది.
కొత్తిమీర యొక్క దుష్ప్రభావాలు:
కొత్తిమీర అధిక వినియోగం వలన కొంతమంది ప్రజలలో అలర్జీ , అతిసారం,కలుగుతుంది. కాబట్టి మితంగానే తీసుకోవాలి. మరి కొంతమందిలో రక్త పోటు చాలా తక్కువగా మారెందుకు సహాయపడుతుంది. దీనివల్ల మూర్చ లేదా సృహకోల్పోయో అవకాశం ఎక్కువగా ఉంటుంది. శ్వాస సమస్యలతో బాధపడుతున్న వారు కొత్తిమీరను ఉపయోగించే ముందు వైద్యుని సంప్రదించవలసి ఉంటుంది. కొత్తిమీరను తీసుకోవడం వల్ల చాతి నొప్పి కలుగుతుంది కొంతమందిలో. బట్టి ఔషధ ప్రయోగాల కోసం కొత్తిమీరను ఉపయోగించే ముందు వైద్యుని సంప్రదించాలి.
కొత్తిమీర సీడ్స్ గురించి:
ఈ కొత్తిమీర అనేది ధనియాల నుంచి మొక్కగా మనకు లభిస్తుంది. ఈ ధనియాలు ఫ్రెష్ గా ఉండటం వల్ల తొందరగా మొలకెత్తుతాయి. ఈ ధనియాలను ఫ్రెష్ గా కొనుక్కోవచ్చి వాటిపైన చపాతీ కర్రతో రుద్దడం వల్ల, ఒక ధనియ రెండుగా చీలిపోతాయి. ఇలా చేసుకోవడం వల్ల విత్తనాలు తొందరగా మొలకెత్తుతాయి. ఎనిమిది నుంచి పది రోజుల్లో మొలకలుబయటికి వస్తాయి. మన ఇంట్లో చాలాకాలం ని లువ ఉంచుకోవడం వల్ల కొన్ని విత్తనాలు మొలకెత్తవు. కాబట్టి మంచి విత్తనాలు సెలెక్ట్ చేసుకోవాలి.