Lady finger Benefits in Telugu: మన శరీరంలో రోగ నిరోధక శక్తి రెట్టింపు

Lady finger: బెండకాయలో మన శరీర ఆరోగ్యానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉన్నాయి. బెండకాయ గింజల్లో కూడా ఆరోగ్యానికి ఎంతో మంచివి .అయితే బెండకాయను నానబెట్టిన నీటిని తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బెండకాయ వేపుడు ,బెండకాయ పులుసు ,బెండకాయ కూర, వంటకం ఏదైనా అందులో బే oడి ఉంటే చాలు ,లొట్టలు వేసుకొని భోజనం చేస్తారు .కేవలం నోటికి రుచిగా ఉండటమే మాత్రమే కాదు .ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది.

బెండకాయలో విటమిన్ ఏ ,B1,B2,b3,b5,B6,విటమిన్ సి ,విటమికే ,విటమిన్ ఈ,కూడా ఉన్నాయి. బెండకాయ మాల్వేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామము:” abelmoschus esculentus. “హిందీలో bhindi అని , ఇంగ్లీషులో ladies finger అంటారు. తెలుగులో బెండకాయ అంటారు. బెండకాయ మన శరీరంలో రోగ నిరోధక శక్తిని రెట్టింపు చేసే అద్భుతమైన లక్షణాలు కలిగి ఉంది. ఇందులో ఉండే విటమిన్ సి అనేక వ్యాధుల నుండి మనల్ని కాపాడుతుంది అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు లక్షణాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి.

బెండకాయ ఆస్తమాను తగ్గించే అద్భుత ఔషధ గుణాలు కలిగి ఉంది. బెండకాయలను ఆహారంలో తీసుకుంటే ఎముకలు దృఢంగా మారుతాయి. అలాగే గర్భిణీ మహిళలలు బెండకాయలను ఆహారంలో తీసుకోవడం ద్వారా పుట్టబోయే బిడ్డ ఎముకలు దృఢంగా ,ఆరోగ్యవంతంగా ఉంటాయి.

బెండకాయలోని క్యాలరీస్:

100 గ్రాముల బెండకాయలు లభించే పోషకాలు:
కార్బోహైడ్రేట్ 7.45 గ్రామ్స్, ప్రోటీన్స్ 1.93 గ్రామ్స్, ఫైబర్ 3.2 g, వాటర్ 89.6 గ్రామ్స్, 100 గ్రాముల బెండకాయలు 33 కిలో క్యాలరీ శక్తి లభిస్తుంది. సోడియం 7మిల్లి గ్రాములు, పొటాషియం 299 మిల్లీగ్రామ్స్, ఐరన్ 0.62 మిల్లీగ్రామ్స్, మెగ్నీషియం 57 మిల్లీగ్రామ్స్, క్యాల్షియం 82 మిల్లీగ్రామ్స్, ఫాస్పరస్ 61 మిల్లీగ్రామ్స్.

బెండకాయ ను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు(Lady finger Benefits):

బెండకాయను తీసుకోవడం ద్వారా మధుమేహం అదుపులో ఉంటుంది. బెండకాయ గింజలు, తొక్కలోని ఎంజైమ్స్ ఇన్సూలీ న్స్ స్థాయిని క్రమబద్ధీకరిస్తాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు వారానికి ఒకసారి బెండకాయను తీసుకోవడం మంచి ఉపశమనం కలుగుతుంది. బెండకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి జీర్ణవ్యవస్థ పనితీరు చక్కగా పనిచేస్తుంది. కాబట్టి మలబద్దకాన్ని నివారించుకోవచ్చు. బెండకాయలు కొద్దిగా తిన్న కావాల్సిన శక్తి లభిస్తుంది. కాబట్టి ఊబకాయంతో బాధపడే వారికి bhindi మంచి ఉపసమనం కలిగిస్తుంది. బెండకాయను తీసుకోవడం ద్వారా అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది.

https://telugu.thefinexpress.com/health/wp-content/uploads/sites/12/2022/11/Ladies-finger-Benefits-in-Telugu-video.mp4

చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణాలు బెండకాయ కలిగి ఉంది. పెద్ద పేగు క్యాన్సర్ నివారణలో బెండకాయ ఉపయోగపడుతుంది. బెండకాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ కాబట్టి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా కలిగి ఉంటుంది. పెద్దపేగు క్యాన్సర్ ,ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణలో బెండకాయ ఉపయోగపడుతుంది. దంతా క్షయoతో బాధపడే వారుబెండకాయ తీసుకుంటే చక్కని ఉపశమనం కలుగుతుంది. బెండకాయలు ఐరన్ అధికంగా ఉండటం వల్ల గర్భవతులు బెండకాయను తీసుకుంటే పుట్టు పోయే బిడ్డకు మేలు కలుగుతుంది. ఫోలేట్ ఆమ్లం సమృద్ధిగా ఉండటం వల్ల బిడ్డ మెదడు పనితీరు చక్కగా పనిచేస్తుంది.

మరియు నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి బెండకాయ దోహద పడుతుంది. బెండకాయలో ప్రోబయాటిక్ ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియాను పెంపొందిస్తుంది. బెండకాయలోని ప్లవనాయిడ్లు మెదడు ఆరోగ్యాoగా ఉంచడంలో సహాయపడుతుంది. మెదడు పనితీరు చక్కగా పనిచేసేటట్లు చేసి జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. చర్మకాంతి మెరుగుపరచడంలోనూ బెండకాయ ఉపయోగపడుతుంది. క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల,ఎముకలను పటిష్టం చేయడంలో బెండకాయ ఉపయోగపడుతుంది.

బెండకాయ 65 ఫ్రై తయారీ విధానం:

బెండకాయ 65 తయారు కి కావాల్సిన పదార్థాలు. బెండకాయలు అరకిలో, అల్లం చిన్న ముక్క, పచ్చిమిరపకాయలు నాలుగు ,వెల్లుల్లి రెమ్మలు నాలుగు ,శెనగపిండి 1/4కప్పు, బియ్యప్పిండి 1/4 కప్పు, జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ,మిరపకారము ఒక టీ స్పూన్ ,ఉప్పు తగినంత, పల్లీలు 1/4కప్పు ,గరం మసాలా అర టీ స్పూన్ ప,చ్చికొబ్బరి 1/4పావు కప్పు. తయారీ విధానం: ముందుగా అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి రెమ్మలు మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

ఆ తర్వాత బెండకాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టి తడి పూర్తిగా పోయాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ప్లేట్ లోనికి బెండకాయ ముక్కలు, శనగపిండి, బియ్యప్పిండి ,జీలకర్ర పొడి, మిరపకారం ,కొద్దిగా నీళ్లు వేసి కలుపుకోవాలి. స్టవ్ మీద కడాయిలో నూనె వేసుకొని వేడి అయిన తర్వాత పల్లీలు వేసి డీప్ గా ఫ్రై చేసుకోని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే నూనెలో కరేపాకు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో మరొకసారి బెండకాయ ముక్కలను పకోడీలుగా వేసి మీడియం ఫ్లేమ్ లో ఉంచి సుమారు పావుగంట సేపు వేయించుకోని, అందులోనే,గరం మసాల వేసుకొని, పక్కన పెట్టుకున్న పల్లీలు వేసి, పచ్చికొబ్బరి తురుము ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలుపుకోవాలి.

వేడివేడిగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ.

బెండకాయ కర్రీ తయారీ విధానం:

ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టి తడి పూర్తిగా పోయాక చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను సన్నగా కట్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు టమాట పండును సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని, ఒక కడాయి పెట్టుకోవాలి.

అందులోనే త్రి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత, మన ముందు కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఉల్లిగడ్డను వేసుకొని దోరగా కలర్ మారిపోయినంతవరకు వేయించుకోవాలి. ఆ తర్వాత సన్నగా రౌండ్ గాకట్ చేసి పెట్టుకున్నా బెండకాయలను వేసుకోవాలి. అందులోనే చిటికెడు పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి.

ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బెండకాయలు మగ్గిపోయి ఉంటాయి. అందులోని మనం సన్నాఫ్ కట్ చేసి పెట్టుకున్న టమాటా పండును వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి.1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. టమాట పండు వేయడం వల్ల నీళ్లు వస్తాయి .కాబట్టి బెండకాయలో నీళ్లు వేసుకోకూడదు. లో ఫ్లేమ్ లో ముగించుకోవాలి. చివరకు కొత్తిమీర వేసి బాగా ఒకసారి మొత్తం కలుపుకొని టెస్ట్ కి సరిపోయినంత ఉప్పు ఉందో లేదో చూసుకుని దించుకోవాలి. తేయండి వేడివేడిగా ఉండే బెండకాయ కూర రెడీ. దీనిని అన్నంతో గాని, చపాతీల్లోకి గాని ,రోటీలోకి గాని ,సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటుంది.

Benda బెండకాయ ప్లాంట్ గురించి:

బెండకాయలోని మ్యూకస్,వంటి పదార్థాలు కడుపులో మంట నుంచి ఉపశమాన్ని కలిగిస్తుంది. పీచు పదార్థం, విటమిన్ సి దీనిలో ఎక్కువగా ఉంటుంది. వ్యూగాస్ పదార్థము గ్యాస్టిక్ సమస్యలను, ఎసిడిటీ కి చక్కని పరిష్కారము. దిల్ లో గల డయూరిక్ లక్షణాలు ఉండటం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్లను నయం చేసుకోవచ్చు.

బెండకాయ డికాషన్ తాగితే జ్వరం తగ్గుతుంది. చిన్న చిన్న ముక్కలుగా కోసి నీటిలో మరిగించి చల్లారాక తాగితే టెంపరేచర్ను తగ్గించుకోవచ్చు. బెండకాయ నిలువుగా చీల్చి రెండు ముక్కలుగా సగం చేసుకొని గ్లాస్ నీటిలో రాత్రంతా ఉంచి మసిటి రోజు ఉదయం ముక్కలు తీసివేసి ఆ నీటిని తాగాలి. ఇలా రెండు రెండు వారాలపాటు తాగితే షుగర్ స్థాయిలు తగ్గుతాయి. బెండకాయ విటమిన్ సి కలిగి ఉంటుంది. ఇది అస్తమా వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. రొమ్ము క్యాన్సర్ను అడ్డుకునే,శక్తి ఉంటుంది. బెండకాయలోపీచు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మలబద్ధక సమస్యలు నివారిస్తుంది.

బెండకాయ వాటర్ గురించి:

మనలో చాలామందికి రక్తహీనత వ్యాధి వలన రక్తంలోని హిమోగ్రోబిన్ శాతం తగ్గిపోతూ ఉంటుంది. అలాంటివారు నానబెట్టిన బెండకాయ వాటర్ తీసుకోవడం వలన ఇమ్యూనిటీపవర్ పెరుగుతుంది. తద్వారా శరీరంలో తగినంత హిమోగ్లోబిన్ శాతం ఉత్పత్తి అవుతుంది. బెండకాయ వాటర్ దగ్గు, గొంతు నొప్పులు ,తగ్గించేందుకు సమర్థవంతంగా ఉపయోగపడుతుంది.వాతావరణ మార్పుల ఫలితంగా ఏర్పడే గొంతు నొప్పి, గొంతువాపు, దగ్గు, గొంతులో దురద, వంటి సమస్యలను బెండకాయలో ఉండే య oటీస్సెప్టిక్ లక్షణాలు సమర్ధవంతంగా ఎదుర్కొంటాయి. చక్కెర వ్యాధి బారిన పడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.

అలాంటి వారికి బెండకాయలు ప్రాపర్టీలు ఉంటాయి. ఇది చక్కెర వ్యాధిని నియంత్రించడంలో సహాయపడుతుంది. నానబెట్టిన బెండకాయ నీటిని తీసుకోవడం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ ను తగ్గించుకోవచ్చు. అతి సారాన్ని నియంత్రించడంలో కూడా ఈ బెండకాయ వాటర్ సహాయపడుతుంది. అతిసారం వలన శరీరంలో నుంచి నీరు అధికంగా బయటికి పోతుంది .

అందువల్ల శరీరం డిహైడ్రేషన్ బారిన పడుతుంది .కాబట్టి నానబెట్టిన బెండకాయ వాటర్ తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. బెండకాయలో నీటిలో కరిగే ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది .ఇది శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది .తద్వారా గుండెపోటు వంటి సమస్యలను నివారించుకోవచ్చు. దీంతోపాటు గుండె ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు .

బెండకాయ రక్త స్థాయిలను కూడా క్రమబద్ధీకరిస్తుంది. మలబద్ధకం అనేది సాధారణంగా కనిపించే సమస్య అయినా పరిష్కారం లేకపోతే మన ఆరోగ్యాన్ని దెబ్బతింటుంది.బెండకాయలో ఉండే ఫైబర్ ఈ సమస్యకు ఒక చక్కని పరిష్కారం ఇస్తుంది .నానబెట్టిన బెండకాయ నీటిని తీసుకోవడం వలన పేగుల్లో కదికలు జరిగి సాఫీగా మలవిసర్జన అవుతుంది.

Side Effects:

బెండకాయను మొలల సమస్యతో బాధే పడేవారు ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే మూత్రపిండ సంబంధితవ్యాధులు ఉన్నవారు కూడా ఎక్కువగా తీసుకోకూడదు. వయసు మీద పడి కీళ్ల నొప్పులతో బాధపడే వారు కూడా ఎక్కువగా తీసుకోకూడదు.

జుట్టు సమస్యలను నివారించడంలో బెండకాయ పేస్ట్:

ముందుగా రెండు బెండకాయలను నిలువుగా కట్ చేసుకుని ,ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో కట్ చేసిన బెండకాయలు వేసుకొని ఐదు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. తర్వాత సాఫ్ట్ గా అవుతాయి. చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ వచ్చిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ మెత్తగా చేసుకున్నా బెండకాయ పేస్ట్ లోనికి, రెండు టీ స్పూన్ల పెరుగును యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ తేనెను కలుపుకోవాలి. తేనె కలుపుకోవడం వల్ల జుట్టుకు షైన్ వస్తుంది. అందులోని ఒక టీ స్పూన్ అలోవెరా జ్యూస్ ను వేసుకొవలి. 1/2టీ స్పూన్ నిమ్మకాయ వేసుకోవాలి. వీటిని అన్నింటిని స్పూన్తో బాగా కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని మన జుట్టుకు బాగా మర్దన చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మరియు చుండ్రులు తగ్గిస్తుంది. దురద వంటి సమస్యను తగ్గిస్తుంది. జుట్టు రాలేసమస్య నుతగ్గిస్తుంది. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల, జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా ,జుట్టు మెరుస్తూ ఉంటుంది.

Exit mobile version