Plants

Palakura Benefits in Telugu: పాలకూర ఉపయోగాలు

Palakura Benefits in Telugu కాయ కూరలతో పోలిస్తే ఆకుకూరలు భిన్నమైనది పాలకూర. కొవ్వు శాతాన్ని తక్కువగా కలిగి ఉండి పోషకాలు ఎక్కువగా కలిగి ఉండి ఆకుకూరల్లో పాలకూర ఒకటి. విటమిన్ a ,విటమిన్ c, విటమిన్ e తో పాటు ,ఐరన్ ,పొటాషియం, క్యాల్షియంతో పాటు ,ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి. పాలకూరను ఇంగ్లీషులో spinach అంటారు .హిందీలో పాలక్ అంటారు. పాలకూర సమృద్ధిగా ఐరన్ ను కలిగి ఉంది.

ఐరన్ శరీరంలో రక్త శాతాన్ని పెంచుతుంది ..సాధారణంగా మహిళలు మరియు చిన్నపిల్లలు రక్తహీనత వ్యాధితో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు క్రమం తప్పకుండా పాలకూరను తీసుకోవడం మంచిది. కంటి చూపును మెరుగుపరచడంలో పాలకూర కీలక పాత్ర వహిస్తుంది .ఇందులో ఉండే విటమిన్ ఏ ,కంటి చూపును మెరుగుపరచడంతో పాటు ,రేచీకటిని మరియు కంటి సమస్యలను దూరం చేస్తుంది. పాలకూర విటమిన్ ఈ ,మరియు కెరోటిన్ కలిగి ఉంటుంది. అందువల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మొటిమలు మరియు చర్మం పొడిబారడం ,నల్లటి మచ్చలు వంటి చర్మ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.

Palakura Benefits in Telugu: పాలకూర ఉపయోగాలు

ఇది చర్మానికి ఒక మాయిశ్చరైజేషన్ లాగా పనిచేస్తుంది. పాలకూరలో ఉండే పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు లక్షణాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాలను తగ్గించేందుకు ఉపయోగపడతాయి. ఇందులోని విటమిన్స్ మరియు మినరల్స్ అధిక రక్తపోటు సమస్యలను దూరం చేస్తాయి. పాలకూరలో ఉండే అమైనోఆమ్లాలు గుండెపోటు మరియు గుండెకు సంబంధించిన సమస్యలను నివారిస్తాయి .ఇది రక్తనాళాలలో ఏర్పడే అడ్డంకులను తొలగిస్తుంది .మరియు గుండె మరియు ఇతర అవయవాలకు రక్త సరఫరా బాగా జరిగేటట్లు చేస్తుంది.

అంతేకాకుండా పాలకూరలో ఉండే ఆంటీ ఇంప్లమెంటరీ లక్షణాలు కొన్ని రకాల క్యాన్సర్లను రాకుండా అడ్డగిస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలును చేస్తుంది .ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి ఆహారం సరిగ్గా లేకపోతే ఎన్ని ఉన్నా వేస్ట్ కాబట్టి అలా ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. 100 గ్రాముల పాలకూరలో 92 శాతం నీరు ఉంటుంది. కొవ్వు జీరో, మాంసకృతులు 2 గ్రాములు, శక్తి 26 క్యాలరీల శక్తి లభిస్తుంది. ప్రోటీన్స్ 2.2 గ్రామ్స్ లభిస్తుంది. విటమిన్ k ఎక్కువగా ఉంటుంది. విటమిన్ కే రక్తం గడ్డ కట్టడానికి బాగా ఉపయోగపడుతుంది.

పాలకూర పప్పు తయారీ విధానం:

పాలకూర పప్పు చాలా టేస్టీగా మరియు ఈజీగా తయారు చేసుకుందాం. ముందుగా ఒక కట్ట పాలకూరను తీసుకున్నాను. పాలకూరను మునిగేంత వరకు నీళ్లు వేసుకుని కొద్దిగా రాక్ సాల్ట్ వేసి శుభ్రంగా రెండు ,మూడు సార్లు వాష్ చేసి పెట్టుకున్నాను. రాక్ సాల్ట్ తో వాష్ చేయడం వల్ల చిన్న చిన్న పురుగులు, క్రిమిసంహారకమందులు ఉపయోగించినట్లయితే ఈ రాక్ సాల్ట్ శుభ్రం చేస్తుంది. తర్వాత పాలకూరను చిన్నచిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవడం వల్ల పాలకూర మెత్తగా ఉడికిపోతుంది. ముందుగా ఒక కుక్కర్ ను తీసుకోవాలి. అందులో ఒక్క కప్పు కందిపప్పు తీసుకోవాలి. కందిపప్పును,శుభ్రంగా వాష్ చేసుకోవాలి.

అందులోనేఒక పెద్ద సైజు టమాట పండును చిన్నగా కట్ చేసుకోనితీసుకోవాలి. ఒక ఉల్లిగడ్డను సన్నగా కట్ చేసుకోవాలి. చిటికెడు పసుపు, ఏడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు. మనంcut చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి. రెండు గ్లాస్ నారా వాటర్ వేసుకోవాలి. కుక్కర్ కి,మూత పెట్టుకొని ఐదు విజిల్స్,వచ్చినంతవరకు మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత ,మూత తీసి చూస్తే పాలకూర పప్పు మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఈ పప్పు ను,పప్పు గుత్తితో మెత్తగా మాష్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు ఉందో లేదో చూసుకుని వేసుకోవాలి.

తర్వాత తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో 3 tbs ఆయిల్ వేసుకొని, వేడి అయిన తర్వాత ,ముందుగా పోపు దినుసులు వేసుకొని, దోరగా వేగిన తర్వాత, రెండు ఎండుమిరపకాయలను అలాగే నాలుగు వెల్లుల్లి రెమ్మలను కచ్చాపచ్చా దంచుకుని వేసుకోవాలి. ఒక చిన్న సైజు ఉల్లిగడ్డను సన్నగా కట్ చేసుకుని ,అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చివరగా రెండు రెమ్మల కరేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ తాలింపును పాలకూర పప్పులో కలుపుకోవాలి. రుచికరమైన వాసనతో పాటు, టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెడీ.

పాలకూర ఫ్రై తయారీ విధానం:

ముందుగా మూడు కట్టల పాలకూరను తీసుకున్నాను. శుభ్రంగా నీటితో వాష్ చేసుకున్నాను. వీటిని సన్న సన్న పీసెస్ గా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. Stove ఆన్ చేసి కడాయి పెట్టుకోని, మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను.oil heat అయినతర్వాత, ఒకటి టేబుల్ స్పూన్ జీలకర్ర ,మినప్పప్పు, శనగపప్పు ,కొద్దిగా ఆవాలు ,వేసుకుని అవి చిటపటలాడింతవరకు వేడి అయిన తర్వాత, పెద్ద సైజు ఉల్లిగడ్డను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసి ఒక మూడు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి.

నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పాలకూర మెత్తగా కాడలతో సహా ఉడికిపోయి ఉంటుంది. ఒక టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మగ్గించుకోవాలి. పాలకూరలో ఉండే వాటర్ మొత్తం పోయి ఆయిల్ పైకి వచ్చి ,పాలకూర దగ్గరగా వచ్చి ఉడికిపోయినంతవరకు, లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చివరగా కొత్తిమీరతో గర్నిష్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు రుచికి సరిపడినంత ఉప్పు ఉందో లేదో టేస్ట్ చూసి వేసుకోవాలి. వేడివేడిగా ఉండే పాలకూర ఫ్రై రెడీ దీనిని చపాతీల్లో గాని , జొన్న రొట్టె లోకి గాని, సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటుంది.

పాలకూర కర్రీ తయారీ విధానం:

ముందుగా రెండు కట్టల పాలకూరను తీసుకోవాలి. పాలకూరను శుభ్రంగా వాటర్ తో వాష్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఆకుకూరలను ముందుగానే వాష్ చేసుకోవాలి. తర్వాత వాష్ చేయకూడదు. ఇందులో ఉండే ప్రోటీన్స్ , విటమిన్లుఅన్ని పోతాయి. కాబట్టి ముందుగానే వాష్ చేసి సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. మూడు టీ టేబుల్ స్పూన్ పెసరపప్పును తీసుకున్నాను. పెసరపప్పును శుభ్రంగా వాష్,చేసుకొని 15 నిమిషాల తో పాటు నీటిలో నానబెట్టుకున్నాను.

ఒక హూకడాయి పెట్టి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ మినప్పప్పు, ఒక టీ స్పూన్ శనగపప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, వేసుకుని చిటపటలాడింతవరకు దోరగా వేయించుకున్నాను. దోరగా వేగిన తర్వాత , పెద్ద సైజు ఉల్లిగడ్డను సన్నగా కట్ చేసి 5-6 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసి వేసుకున్నాను.అందులోనే నేను ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును నీళ్లు మొత్తం వ oపేసి వేసుకున్నాను. పెసరపప్పు నూనెలో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది .కాబట్టి మూడు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను.

మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పెసరపప్పు మగ్గిపోయి ఉంటుంది. తర్వాత కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నా పాలకూరను తీసుకొని చిన్నగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాను. ఫ్పాలకూరలోని నీళ్లు మొత్తం పోయి దగ్గరగా కొద్దిగా అవుతుంది. అందులోనే ఐదు ఆరు వెల్లుల్లి ను కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. పచ్చిమిరపకాయలు వేసినాను, కాబట్టి కారం కొద్దిగా తక్కువ పడుతుంది. చిటికెట్ పసుపు, ఆకుకూరల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది .కాబట్టి తక్కువ ఉప్పు పడుతుంది. ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. వేడివేడిగా ఉండే పాలకూర పెసరపప్పు కర్రీ రెడీ. చపాతిలో గాని, జొన్న రొట్టెలో గాని ,అన్నంలోకి గాని చాలా టేస్టీగా ఉంటుంది.

పాలక్ పన్నీరు రెసిపీ తయారీ విధానం:

ఇప్పుడు మనము రెస్టారెంట్ స్టైల్ లో లాగా రుచిగా పాలక్ పన్నీరు తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ,శుభ్రంగా కడిగిన పాలకూర రెండు కప్పుల వరకు add వేసుకోవాలి. మూత పెట్టి మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉంచి వాటర్ వేసుకోకుండా ఉడికించుకోవాలి. పాలకూరలో వాటర్ ఉంటుంది .కాబట్టి అవేవాటర్ సరిపోతుంది.

మూత తెరిచి చూస్తే పాలకూర మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. చల్లారింతవరకు ,మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు పెద్ద ఉల్లిగడ్డలను కట్ చేసుకోనివేసుకోవాలి .రెండు టమాటలను సన్నగా కట్ చేసుకుని మిక్సీలోనే వేసుకోవాలి. మిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. 7 నుంచి 8 పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి.1/2inch అల్లం ముక్కను వేసుకోవాలి. వీటిని అన్నింటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్ లోకి ఉడికించిన పాలకూరను తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే ఐదు నుంచి ఆరు కాజులను యాడ్ చేసుకోవాలి.

పాలక్ పన్నీర్ లోకి కాజు పొడి అనేది చాలా చాలా బాగుంటుంది. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరొక పక్కన ఒక పాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ,మరియు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవా లి. ఆయిల్ వేడి అయిన తర్వాత ఆఫ్ స్పూన్ జీలకర్ర ,రెండు బిర్యానీ ఆకులు ,గ్రైండ్ చేసుకున్న టమాటా ,ఉల్లిపాయ పేస్టు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఆఫ్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇందులోనే గ్రైండ్ చేసిన పాలకూర , కాజు పేస్టునుయాడ్ చేసుకోవాలి.

కాజు వేసినాము కాబట్టి అడుగున పట్టకుండాకలుపుతూ ఉండాలి. వీటిని అన్నింటిని పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి. ఇందులోనే అర టీ స్పూన్ గరం మసాలా, టి టేబుల్ స్పూన్ ధనియాల పొడి ,కారం ,టెస్ట్ కు సరిపడినంత ఉప్పు మరియు గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేది మన కన్సిస్టెంట్,కితగినంత వేసుకోవాలి. రెండు నుంచి మూడు నిమిషాలు ఉడకనివ్వాలి .ఉడికేటప్పుడు 200 గ్రాముల పన్నీరు ముక్కలను కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. పన్నీరును నెయ్యిలో వేయించుకొని వేసుకుంటే ఇంకా రుచి టేస్టీగా వస్తుంది.

ముక్కలను పాలకూరలోవేసి,బాగా కలుపుకొని మూడు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి .చివరగా కస్తూరి మేతిని కొద్దిగా తీసుకొని చేతితో నలిపి ఇందులో వేసుకోవాలి. కస్తూరి మేతి వేసుకోవడం వల్ల పాలక్ పన్నీర్ కు చాలా టేస్ట్ వస్తుంది. వేడివేడిగా ఉండే మన రెస్టారెంట్ స్టైల్ లో లాగా,రుచిగా ఉండే పాలక్ పన్నీర్ రెడీ. దీనిని మనం చపాతీలోకి ,పుల్కా లోకి ,రైస్ లోకి తీసుకోవచ్చు.

నష్టాలు:

పాలకూరలో ఆక్సలేట్ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల పాలకూరలో 736 గ్రాముల ఆక్సలేట్ఉంటుంది కాబట్టి పచ్చి పాలకూరను తీసుకోకూడదు .ఒకవేళ పాల కూర తీసుకున్న పాలకూరని వేడి చేసి తీసుకోవాలి. 90% ఆక్సలైట్ నశిస్తుంది. పచ్చిగా ఉండేపాలకూరను తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయి. టమాటాలో కూడా వేడి చేసుకోని తీసుకోవడం వల్ల అందులో ఉండే ఆ క్సలెంట్ నశించిపోతుంది. వేడి చేసుకుని టమాట పండ్లను కూడా తీసుకోవచ్చు. పచ్చిగా తింటే కిడ్నీలో,స్టోన్స్ వస్తాయి.

టేస్ట్ గా ఉండాలని ఉప్పును అధికంగా తీసుకుంటాము. ఈ ఉప్పు రక్తంలోకి వెళ్ళిపోతుంది .సాల్ట్ ఎక్కువగా అయినప్పుడు బయటికి రాదు .క్యాల్షియంతో పాటు సాల్ట్ కలిసిపోతుంది. దీనివల్ల క్యాల్షియం , ఆక్సలేట్ కలిసి,స్టోన్స్ ఏర్పడతాయి.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button