Plants

Thippatheega uses in Telugu: తిప్పతీగతో తిప్పలన్నీ దూరం అవుతాయి

Thippatheega: తిప్పతీగ అనేది ఔషధ మొక్క .ఇది తమలాపాకు రూపంలో ఉంది. చిన్నగా ,అందంగా, ఉంటుంది .దీనిని ఎన్నో ఆయుర్వేద మందులలో ఉపయోగిస్తారు . ఊర్లలో, పొలాల్లో ,రోడ్డు పక్కన ,కొండలలో ,ఇంటి పరిసరాలలో ఈ తిప్పతీగ,ఎక్కువగా దొరుకుతుంది. ఇది అన్ని సీజన్లో, చుట్టుపక్కల ,పచ్చని మొక్కలపై పెరుగుతుంది .తిప్పతీగకు మరణం అనేది ఉండదు. ఎందుకంటే దానిని తుంచినా అక్కడి నుండి మళ్ళీ కొత్త కొమ్మలు అల్లుకుంటూ వస్తుంది.

అమృతం అంటే దేవతల అమృతం అని అర్థం .అందుకే దీనిని సంస్కృతoలో “అమృతవల్లి “అని అంటారు. తెలుగులో తిప్పతీగ అని ,ఇంగ్లీషులో “హార్డ్ లివ్ మున్నిడ్” మరియు గూడుచిఅని అంటారు. బినామికల్ నేమ్ tinospora cordifolia అంటారు. ఇది మెని స్పిరిమేసి కుటుంబానికి చెందినది. అనేక రకాల వ్యాధులను నయం చేస్తుంది. కాబట్టి తిప్పతీగతో తిప్పలన్నీ దూరం అవుతాయి.

రోజు ఉదయం సాయంత్రం ఆహారానికి అరగంట ముందు ఒక తిప్పతీగ ఆకును,శుభ్రంగా కడిగి కొద్ది కొద్దిగా నమలి తింటూ ఉంటే పది నుంచి 30 రోజుల్లో అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ ,మధుమేహం, దగ్గు ,ఉబ్బసం ,పాత జ్వరాలు ,చర్మంపై ఉన్న గుల్లలు, పుండ్లు,గాయాలు , ముత్ర అవయవాలలోరాళ్లు మూత్రనాళ్లో పుండ్లు,లివర్ పెరుగుదల , ప్లీహ భివృద్ధి, సకల వాత నొప్పులు, మొదలైన అనేక రకాల దీరకాలిక వ్యాధులు కూడా అదుపులోకి వస్తాయి.

Thippatheega uses:

తిప్పతీగను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెంచుతుంది. ఈ తిప్పతీగ ఆకులు ,రెమ్మలలో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. 20 నుంచి 30 మిల్లీ లీటర్ల తిప్పతీగల కషాయాన్ని తీసుకొని అందులో అల్లం పొడి లేదా పాలు వేసి తాగితే ఎక్కిళ్ళు ఆగిపోతాయి. ఈ తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల అజిర్తి సమస్యలను తగ్గిస్తుంది. ఫ్రీ రాడికల్స్ బారిన పడకుండా ఈ తిప్పతీగ ఈ తిప్పతీగను తీసుకోవడం ద్వారా,మధుమేహాన్ని తగ్గిస్తుంది.రక్తంలోచక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

మరియు type -2షుగర్ రాకుండా చేస్తుంది. తిప్పతీగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి .కాబట్టి దగ్గు ,జలుబు ,శ్వాసకోస సమస్యలను తగ్గిస్తుంది. కీళ్ల వ్యాధులను ,రుమరైటిస్ ,ఆర్థోరైటిస్ ,వ్యాధులను తగ్గిస్తుంది. ముఖంపై ,మచ్చలు ,మొటిమలు ,వృద్యాప, ఛాయలను రానివ్వవు. రక్త దోషాలు ,వాంతులు ,వాతము ,దురద ,జ్వరము ,అనేక వ్యాధులను తగ్గిస్తుంది. ఈ తిప్పతీగపొడిని,చక్కెరతో కలిపి ,తీసుకుంటే వేడిని తగ్గిస్తుంది. ఈతిప్పతీగపొడిని ,బెల్లంతో కలిపి సేవిస్తే, మలబద్ధకం పోతుంది.

అలాగే ఆముదంతో కలిపి తీసుకుంటే వాత రక్తం తగ్గుతుంది.అలాగే సొంటితో సేవిస్తే, వాపులు తగ్గుతాయి.తిప్పతీగను తీసుకోవడం వల్ల జ్వరం ,మూత్రం పిండసమస్యలు ,హృదయా సమస్యలు ,రక్తహీనత ,ఆస్తమా, అజీర్ణ సమస్యలను తగ్గుతాయి. యoటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి .కాబట్టి శరీరానికి రోగ నిరోధక శక్తినిపెంచుతుంది. ఫ్రీ రాడికల్స్ తో పోరాడే గుణం కలిగి ఉంటుంది. శరీరంలోఉండే కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు ,మరియు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తిప్పతీగ బాగా ఉపయోగపడుతుంది. ఈ తిప్పతీగ డయాబెటిక్ పేషంట్లకి ఆర్థరైటిస్ వారికి ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది. పచ్చ కామెర్ల ఉన్నవారికి కూడా ఈ తిప్పతీగ బాగా ఉపయోగపడుతుంది. వైరల్,జ్వరాలను తగ్గిస్తుంది.

Read: Bitter Gourd Benefits in Telugu అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

Thippatheega power తయారీ విధానం:

ముందుగా తిప్పతీగ ఆకులను శుభ్రంగా కడిగి ఒకపలుచని,cloth మీద ఎండలో ఆరబెట్టుకోవాలి. ఈ తిప్పతీగ ఆకులను రెండు నుంచి మూడు రోజులు బాగా ఆరనివ్వాలి. పట్టుకుంటే ఆకులు విరిగిపోవాలి. ఈ విధంగా ఎండబెట్టుకున్న తర్వాత, ఈ ఆకులన్నింటిని కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వచ్చిన పౌడర్ ని జల్లెడతో జల్లించుకోవాలి.

మెత్తగా స్మూత్ గా ఉండే పౌడర్ మనకి వస్తుంది. మిగిలిన పౌడర్ ను పాడి వేయకుండా, మళ్లీ మిక్సీ జార్ లో తీసుకొని, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా వచ్చిన పౌడర్ ని ఒక డబ్బాల వేసుకొని నిలువ చేసుకోవచ్చు. ఈ పౌడర్ ని ప్రతిరోజు ఒక గ్లాస్ హాట్ వాటర్ లో, ఒక స్పూన్ వేసుకొని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.

తిప్పతీగ లీఫ్ ఉపయోగాలు (Thippatheega):

తిప్పతీగ ఆకుల రసాన్ని ఆయుర్వేదంలో బాగా వినియోగిస్తారు. తిప్పతీగ జ్యూస్ లేదా పౌడర్ తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకోవడం వల్ల అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా టైప్ టు షుగర్ నునియంత్రించుకోవచ్చు. తిప్పతీగ పొడిని, బెల్లంతో కలుపుకొని సేవిస్తే అజీర్తి సమస్య తగ్గుతుంది .మరియు జీర్ణ వ్యవస్థను మెరుగుపరచుకోవచ్చు. తిప్పతీగను తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది .దీనివల్ల హైపో గ్లైసామిక్,ఇండెక్స్ సూచిక బాగా పనిచేస్తుంది. కాబట్టి టైప్ టు మధుమేహం తగ్గింది కు బాగా ఉపయోగపడుతుంది. తిప్పతీగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.

Thippatheega uses in Telugu: తిప్పతీగతో తిప్పలన్నీ దూరం అవుతాయి
Thippatheega leaf

కాబట్టి దగ్గు ,జలుబు ,ట్రాన్సిల్స్,వంటి శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తుంది. తిప్పతీగపోడి ని ,కాస్త అల్లం మరియు పాలు కలుపుకొని తీసుకుంటే రుమటాయిడ్, ఆర్థరైటిస్, వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు .కీళ్ల వ్యాధులతో బాధపడేవారు ఈ తిప్పతీగ కషాయాన్ని తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది. తిప్పతీగ కషాయం తీసుకోవడం ద్వారా వృద్ధాప్య ఛాయాలనుతగ్గిస్తుంది.

అంతేకాకుండా ముఖంపై మచ్చలు, మొటిమలు రాకుండా చేస్తుంది. సంస్కృతంలో అమృత అని పిలవబడుతుంది తిప్పతీగ లేదా టీనేజ్ పోరా అనేది ఒక ఆకురాల్చుపుద ఇది భారతదేశంలోని అడవి ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతుంది. ఇది ఒకటి నుంచి ఐదు సెంటీమీటర్ల మందంతో పెరుగుతుంది. తిప్పతీగ ఆకులు, హృదయపూ ఆకారంలో ఉండి, తిప్పతీగ హైపో లిపిడ్మిక్ ను కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని తరచుగా తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారు. తిప్పతీగలో రోగ నిరోధక శక్తి యాంటీబయాటిక్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి దగ్గు జ్వరము మరియు అంటువ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది ఉబ్బసం వంటి లక్షణాలను తగ్గిస్తుంది. బోలు ఎలుకల వ్యాధిని కూడా తగ్గిస్తుంది.

యాంటీ యాక్సిడెంట్లక్షణాలు ఉండటం వల్ల క్యాన్సర్ చికిత్సలో కూడా తిప్పతీగను ఉపయోగిస్తారు. డెంగ్యూ సోకిన మహిళలకు 15 రోజులపాటు 20 మిల్లీలీటర్ల తిప్పతీగ రసాన్ని తీసుకోవడం ద్వారా 15 రోజులో జ్వరం మరియు దద్దుర్లు తగ్గిపోతాయి. మరియు ప్లేట్లెట్స్ ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది .నులిపురుగులు ,ఆకలి లేకపోవడం, వాంతులు, అధిక దాహం ,కడుపులో మంట, నొప్పి వంటి ,వాటిని నివారించడానికి సహాయపడుతుంది.

ఒత్తిడి ఆందోళన తగ్గిస్తుంది.మరియుమెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి వ్యాధి నిరోధక శక్తి చాలా అవసరం కాబట్టి ఈ తిప్పతీగను తీసుకుంటే తిప్పలని దూరం చేసుకోవచ్చు. ఈ తిప్పతీగ ఆకుల కషాయాన్ని తీసుకోవడం ద్వారా శరీరంలో ఉండే మలినాలను తొలగిస్తుంది. ఉబ్బసం ,ఆయాసం, శ్వాస వ్యవస్థ వంటి వాటిని నయం చేయడానికి తిప్పతీగలతో తయారు చేసిన కషాయం తీసుకోవడం వల్ల చాలా ఉపశమనం కలుగుతుంది.

ఈ తిప్పతీగల పొడిని ఉదయం సాయంత్రం మూడు గ్రాములు తీసుకోవడం ద్వారా గ్లూకోస్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. ఈ తిప్పతీగ యొక్క చూర్ణము తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ ని పెంచుకోవచ్చు. ఈ తిప్పతీగను తీసుకోవడం వల్ల ఒంట్లో వేడిని క్షణాల్లో తగ్గిస్తుంది.

Thippa theega Side Effect:

తిప్పతీగని అధికంగా తీసుకుంటే మలబద్ధకం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయుర్వేద వైద్యుల సమక్షంలో మాత్రమే తిప్పతీగను ఉపయోగించాలి. గర్భవతులు, పాలిచ్చే తల్లులు ఈ తిప్పతీగలను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు. అతిగా తింటే ఏదైనా విషయమే. అతిగా తీసుకోవడం వల్ల కాలేయ నీకి తిప్పతీగ వల్ల నష్టంవాటిల్లుతుంది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button