PlantsRecipes

Thotakura benefits in Telugu: తోటకూర వల్ల కలిగే నష్టాలు, లాభాలు

తోట కూర: ప్రతిరోజు 200 గ్రాముల తోటకూర తింటే ఆరోగ్యానికి మంచిది . ఇందులో ఐరన్ ,వివిధ పోషకాలు అధికంగా ఉన్నాయి . రెగ్యులర్ గా తోటకూర తింటే రక్తహీనత తగ్గుతుంది .బరువు తగ్గుతారు. రెగ్యులర్, గా తోటకూర తినడం మంచిది. ఇందులో పీచు పదార్థం ఉండడం వల్ల జీర్ణశక్తిని పెంచుతుంది .దానికి తోడు కొవ్వును తగ్గిస్తుంది .ఇంకా కడుపులోని పురుగులను తగ్గిస్తుంది .తోటకూర తక్షణ శక్తినిస్తుంది. తోటకూర శాస్త్రీయ నామం amaranthus gangeticus (అమరాంథ స్ గంజేటికస్), హిందీలో లాల్ షాగ్, సంస్కృతంలోమారిష ,భాష్పాక.

Thotakura benefits in Telugu

  1. భారతదేశమంతటా విరివిరిగా పెంచబడుతున్నది.తోటకూర వేపుకన్నా వండుకున్న కూర అయితే ఉత్తమం .అధిక ప్రోటీన్లు శరీరానికి అందిస్తాయి .
  2. హైపర్ టెన్షన్ తో బాధపడే వారికి మేలు కలగజేస్తుంది .
  3. ఇందులో విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది . మనము ఒక సీజన్ నుంచి మరొక సీజన్లోకి మారినప్పుడువాతావరణం లో కలిగే మార్పులకు,మన శరీరం తట్టుకుంటుంది.
  4. తోటకూర ఆకులను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకొని తలకు, జుట్టుకు పట్టిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది .
  5. అదేవిధంగా చుండ్రును కూడా తగ్గిస్తుంది ఇందులో, క్యాల్షియం మెగ్నీషియం, కాపర్, సెలీనియం, ఇనుము, ఫాస్పరస్, జింకు వంటి ఖనిజాలన్నీ లభిస్తాయి.
  6. రక్తనాళాలను చురుకుగా ఉంచి గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం వంటివి సమకూర్చుతాయి. అంతేకాకుండా విటమిన్ ల గని అని తోటకూరను చెప్పవచ్చు.
  7. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ బి12, విటమిన్ b6 ఒకే కూరలో దొరకడం అరదు
  8. ఒక్క తోటకూర తింటే ఇవన్నీ సమకూరుతాయి.
  9. 100 గ్రాముల తోటకూర తీసుకుంటే 716 క్యాలరీల శక్తి లభిస్తుంది కార్బోహైడ్రేడ్ ప్రోటీన్లు కొవ్వు పీచు పదార్థాలన్నీ లభిస్తాయి ఇంతటి పోషక విలువలు ఉన్న తోటకూర మీరు కూడా తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

చాలామంది శాకాహారులు తోటకూర నీ చికెన్ ,మటన్ తో సమానం అనుకుంటారు. ఆకు కూరలో విటమిన్ ఏ ,యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. పప్పుతో తోటకూర వండుకుంటే శక్తి ఎక్కువ లభిస్తుంది. సూక్ష్మ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పప్పుతో తోటకూర పండుకుంటే 100 గ్రాములు తీసుకుంటే 340 శక్తి లభిస్తుంది. విధంగా శనగపప్పులో తోటకూర వేసి చేసుకుంటే 350 క్యాలరీల శక్తి లభిస్తుంది. తోటకూరలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది .కాబట్టి రెగ్యులర్ గా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

తోటకూర తీసుకోవడం వల్ల కలిగే లాభాలు:

తోటకూరని విటమిన్ ల గని అని చెప్పుతారు. పైల్స్ తో బాధపడే వారికి ఈ తోటకూర బాగా ఉపయోగపడుతుంది. ఈ తోటకూర తీసుకోవడం వల్ల హిమోగ్లోవిన్ లెవెల్స్ ను పెరుగుతాయి. తోటకూరలో వాటర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. తోటకూరను తీసుకోవడం వల్ల మలబద్ధకాని ని వారిస్తుంది . గ్యాస్ ను నివారిస్తుంది. 100 గ్రాముల తోటకూర తీసుకుంటే 250 మిల్లీగ్రామ్స్ ల సోడియం ఉంటుంది. రక్తనాళాల సరఫరాకి బాగా ఉపయోగపడుతుంది .

గుడ్ కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. రక్తహీనత నుంచిఉపశమనం కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి పీచు పదార్థం ఉండటం వల్ల బరువు తగ్గుతారు. ఉంటుంది. కాబట్టి జీర్ణశక్తిని పెంచుతుంది . మధుమేహ వ్యాధిగ్రస్తులకు తోటకూర చక్కని ఔషధం లాగా పనిచేస్తుంది. తో ట కూర నెమ్మదిగా జీర్ణం అవుతుంది .కాబట్టి గ్లూకోజ్ నెమ్మదిగా రక్తంలో కలుస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నియంత్రణ చేస్తాయి.మొలల వ్యాధిని తగ్గిస్తుంది .కడుపులో పురుగులను తగ్గిస్తాయి. తక్షణ శక్తిని ఇస్తుంది . మంచి విరోచనా కారి .అధిక ఆకలిని పుట్టిస్తుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది .తోటకూర కొవ్వును తగ్గిస్తుంది .తోటకూరలోని పీచు పదార్థం జీర్ణశక్తి నీ పెంచుతుంది .తోటకూర రక్తనాళాన్ని చురుకుగా ఉంచుతుంది.

తోటకూర తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు

తోటకూరలో గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియంలు ఉన్నాయి.అధిక ప్రోటీన్లు శరీరానికి శక్తిని అందిస్తాయి.తోటకూరలో విటమిన్ సి ,రోగనిరోధక శక్తి నీ పెంచుతుంది. తోటకూరలో ఆక్సాలి క్ ఆసిడ్ ఎక్కువగా ఉంటుంది. కనుక కిడ్నీలో, రాళ్లతో బాధపడేవారు ఇతర కిడ్నీ సమస్యలు ఉన్నవారు, రోమరైటిస్ ,ఆర్థోరైటిస్తో ఇబ్బంది పడేవారు ,కీళ్లవ్యాధులతో, బాధపడేవారు తోటకూర ఎక్కువగా తీసుకోకూడదు.

Thotakura seeds:

తోటకూర తీసుకున్న తర్వాత ముందుగా పైన ఆకుల తో పాటువిత్తనాలు కనిపిస్తాయి. ఈ విత్తనాలను మనం తీసుకొని బయటపడి వేయకుండా, ఆ విత్తనాలను తీసుకొని ఒక పల్చటి పేపర్ మీద వేసి నీడలో మూడు రోజులపాటు ఆరబెట్టుకుంటే. విత్తనాల పైన ఉండే పచ్చదనం తగ్గిపోయి, ఎండినట్లు మనకు కనిపిస్తాయి. తీసుకొని చేతితో నలిపితే నల్లగా ఉన్న విత్తనాలు వస్తాయి. ఈ విత్తనాలు గాలిఎక్కువగా ఉంటే,అవి వెయిట్ l
లా స్ కాబట్టి ఎగిరిపోతాయి. కాబట్టి నేను ఇంట్లోనే ఆరబెట్టుకున్నాను. ఎండిపోయిన తర్వాత,వీటిని చేతులతో నలిపితే విత్తనాలు నల్లగా కింద పడతాయి. వీటిని తీసుకొని కుండీలో లేదా భూమి మీద చల్లి, కొద్దిగా తేమను ఉండేటట్లు చేస్తే, ఐదు రోజులలో మొలకలు కనిపిస్తాయి. ఈ విధంగా విత్తనాలతో తోటకూరను పెంచుకోవచ్చు. ఈ విధంగా ఆరబెట్టుకున్న విత్తనాలు నిల్వ చేసుకోవచ్చు. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ విత్తనాలను చల్లుకోవచ్చు..

తోటకూర పప్పు తయారీ విధానం (thotakura pappu):

ముందుగా ఒక పెద్ద సైజు తోటకూర కట్టను తీసుకున్నాను. చివర ఉన్న కాడలు మాత్రమే కట్ చేసినాను. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు వేసి రెండు మూడు సార్లు తోటకూరను శుభ్రంగా వాష్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత వీటిని రంధ్రాలు ఉన్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు కంది బ్యాలు తీసుకున్నాను. వీటిని రెండుసార్లు నీటితో శుభ్రం చేసుకున్నాను. శుభ్రం చేసుకుని ఒక ఏడు పచ్చిమిరపకాయలు సగం తుంచి వేసుకున్నాను. ఒక చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా చింతపండు, రెండు చిన్నగా ఉన్న టమాటా పండ్లను సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న తోటకూరను ఇందులో వేసుకొని, కంది బేలు మునిగేంత వరకు ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను.

కుక్కర్ కి మూత పెట్టి ఐదు విజిల్ వచ్చేంతవరకు తోటకూర పప్పును ఉడకబెట్టుకున్నాను. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే తోటకూర పప్పు మెత్తగా ఉడికిపోయింది. దీనిని పప్పు గుత్తితో మెత్తగా మాష్ చేసుకున్నాను. తాలింపు కోసం ఒక పాన్ పెట్టుకున్నాను. ఫ్యాన్ వేడి అయిన తర్వాత రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడి అయిన తర్వాత, ఒక టీ టేబుల్, పోపు దినుసులు వేసుకున్నాను. పోపు దినుసులు బాగా దోరగా వేయించుకున్న తర్వాత, రెండు ఎండుమిరపకాయలను సగానికి తుంచి వేసుకున్నాను. అలాగే ఒక చిన్న ఉల్లిగడ్డను సన్నగా కట్ చేసి వేసుకున్నాను. చివరికి రెండు రెమ్మల కరేపాకు వేసి దోరగా వేయించుకున్నాను. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ,వీటిని తోటకూర పప్పులో కలుపుకున్నాను .అంతే వేడి వేడిగా ఉన్న తోటకూర పప్పు రెడీ.

తోటకూర ఫ్రై తయారీ విధానం (thotakura fry):

ముందుగా రెండు కట్టల తోటకూరను తీసుకున్నాను. వీటి చివర ఉన్న కాడలు మాత్రమే తొలగించుకున్నాను. ఆ తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా నీటితో వాష్ చేసుకున్నాను. చేసుకొని సన్నగా పీసెస్ గా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, ఒక కడాయి పెట్టుకున్నాను. కడాయి హిట్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడి అయిన తర్వాత, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను సన్నగా పీసెస్ గా కట్ చేసి వేసుకున్నాను.

ఆ తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఉల్లిగడ్డలు కొద్దిగా వేడి అయిన తర్వాత ,సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసుకున్నాను. తోటకూర కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పు ,చిటికెడు పసుపు ,కొద్దిగా కారం కొద్దిగా అల్లం పేస్టు ,వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకబెట్టుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే తోటకూర మొత్తం కాడా లతో సహా మగ్గిపోయి ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర వేసి టెస్ట్ కి సరిపడినంత ఉప్పు ఉందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడివేడిగా ఉన్న తోటకూర ఫ్రై రెడీ దీనిని చపాతీలోకి ,పుల్కా లోకి ,జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది.

తోటకూర కర్రీ:

ముందుగా ఒక పెద్ద సైజు తోటకూరను తీసుకున్నాను. వీటిని శుభ్రంగా ఉప్పు వేసి రెండు మూడు సార్లు వాష్ చేసి , సన్నగాకట్ చేసుకుని,రంద్రాలున్న గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక పెద్ద సైజు టమాట పండును తీసుకున్నాను. టమాట పండును సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ,నూనె వేసి, పోపు దినుసులు వేయించి ,పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించి తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసుకొని, బాగా మగ్గపెట్టుకోవాలి. తోటకూర బాగా కాడాలతో సహా ఉడికిన తర్వాత టమాట పండును వేసి ఉడికించుకోవాలి.

టమాట పండు వేయడం వల్ల నీరు వేసుకోవలసిన అవసరం లేదు. టమాటా పండ్ల లోని,నీ రే సరిపోతుంది. తోటకూర టమాట పండ్లుబాగా ఉడికిపోయిన తర్వాత, నాలుగు ఐదు వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేస్తాం కాబట్టి కారం అవసరం ఉండదు. టేస్ట్ కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కొద్ది కొత్తిమీర వేసి ,మొత్తం ఒకసారి బాగా కలుపుకొని, రుచికి సరిపడినంత ఉప్పు ఉందో లేదో టేస్ట్ చూసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి వేడి టమాట తోటకూర కర్రీ రెడీ. దీనిని చపాతీల్లో లేదా రైస్ లోకి చాలా బాగుంటుంది.

తోటకూర రెసిపీ తయారీ విధానం:

ఒక పెద్ద సైజు మామిడికాయను తీసుకున్నాను. అలాగే రెండు కట్టలా తోటకూరను తీసుకున్నాను. తోటకూరను శుభ్రంగా వాష్ చేసుకుని ,సన్నగా పీసెస్ గా కాలాలతో సహా కట్ చేసుకున్నాను. రెండు టమాట పండ్లు సన్నగా పీసెస్ గా కట్ చేసుకున్నాను. ఏడు పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న నిమ్మకాయ సైజు అ oత చింతపండును తీసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, ఒక గుండ్రటి బౌల్ ను తీసుకున్నాను. ఆ గుండ్రటి బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత, పోపు దినుసులను వేసుకున్నాను.

పోపు దినుసులు వేడైన తర్వాత మూడు ఎండుమిరపకాయలను సగం వరకు తుంచి వేసుకున్నాను. ఒక చిన్న ఉల్లిగడ్డను సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసుకున్నాను. మూత పెట్టి తోటకూరను కాడలతో సహా ముగించుకున్నాను. మూత తీసి మగ్గిపోయిన తోటకూరలోకి చిటికెడు పసుపు ,రుచికి సరిపడనంత ఉప్పు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను , టమాటా పండ్లను కూడావేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసి పచ్చివాసన పోయేంత వరకుమగ్గించుకున్నాను.

తోటకూర టమాట పండ్లు ,బాగా ఉడికిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని, మగ్గించుకున్నాను. మగ్గిన తర్వాత మామిడి కాయను చిన్నగా పీసెస్ లుగా కట్ చేసి వేసుకున్నాను. మూత పెట్టి ఒక మూడు నిమిషాలు మామిడికాయను ముగించుకున్నాను. మరీ మెత్తగా మగ్గించుకోకూడదు.

మూత తీసి ఉడికించుకున్నమామిడికాయలను ఒక ప్లేట్ లోకి తీసుకొనిపక్కన పెట్టుకున్నాను. అందులో ఉన్న వాటర్ ను కూడా ఒక గిన్నెలోకి తీసుకొని, ఈ తోటకూర ,టమాట పండ్లను,పప్పు గుత్తితో మెత్తగా మాష్ చేసుకున్నాను. చివరగా పక్కన తీసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను, పక్కన తీసి పెట్టుకున్న నీటిని వేసి మొత్తం కలుపుకున్నాను. చివరగా రుచికి సరిపడినంత సాల్ట్ ఉందో లేదో చూసుకున్నాను. వేడివేడిగా ఉండే తోటకూర మామిడికాయ రెసిపీ రెడీ. దీనిని రైస్ లోకి గాని ,చపాతీలో గాని పుల్లగా ఉండే తోటకూర రెసిపీ చాలా బాగుంటుంది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button