Uncategorized

Almond: బాదంతో బాప్ రే ఇన్ని బెనిఫిట్స్

భాదమును ఇంగ్లీషులో almond అంటారు. ‘రోసేసి (Rosales) ‘ఫ్యామిలీకి చెందినది. బొటానికల్ నేమ్. “Prunusdulcis “అంటారు. శరీరంలో వైరల్ ఇన్ఫెక్షన్లపై పోరాడే శక్తి పెరుగుతుంది .ఈ బాద o గింజలు తినడం ద్వారా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తెల్ల రక్త కణాల సంఖ్యను పెంపొందించడం కోసం ఈ బాదం పప్పులు తోడ్పడతాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది . కాబట్టి బాదంపప్పును”,కింగ్ ఆఫ్ నర్స్ గా” పిలుస్తారు.

ఐరన్, విటమిన్ బి12, విటమిన్ E, ఫైబర్, కాపర్,క్యాల్షియం, మెగ్నీషియం ,జింక్ , ఫాస్ఫరస్, సోడియం, ఖనిజలవనాలు మొదలైనవి పుష్కలంగా బాదంపప్పులో లభిస్తాయి. ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు ,విటమిన్లు, మినరల్స్ ,పుష్కలంగా బాదంపప్పులో లభిస్తాయి. కాబట్టిబాదంపప్పుతో బోలెడు బెనిఫిట్స్ ఉంటాయి. బాదంపప్పులో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. పొటాషియం బాదంపప్పులో అధికంగా లభిస్తుంది. మరియు సోడియం శాతం తక్కువగా ఉంటుంది.

కాబట్టి రక్తపోటు సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. మరియు రక్త ప్రసరణ సక్రమంగా జరిగేటట్లు చేస్తుంది. బాదంపప్పు లో ఉండే రైబో ఫ్లమిన్ , రాగి ,మెగ్నీషియం వంటి పోషకాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.  పొట్టుతో పాటు బాదంపప్పును తీసుకోవడం ద్వారా సరిగ్గా జీర్ణం కాదు. కాబట్టి నానబెట్టిన బాదంపప్పును తీసుకోవడం ద్వారా శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బాప్ రే బాదంతో ఇన్ని బెనిఫిట్స్ కలుగుతాయి.

Almond badam benefits in telugu
Almond

బాదంపప్పులోని క్యాలరీస్:

100గ్రాముల బాదంపప్పు లో ఉండే పోషక విలువలు.

100గ్రాముల బాదంపప్పులో 571కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది.పీచు పదార్థం 17.9g, ఫైబర్,10.7g,ప్రోటీన్21.43g, పిండి పదార్థాలు 30.82g, నీరు 6.31g, చక్కెర3.57g, ఫ్యాట్ 71.4g, క్యాల్షియం 286 మిల్లీగ్రామ్, ఫాస్పరస్ 536 మిల్లీగ్రామ్, ఇనుము 3.86 మిల్లీగ్రామ్, 286 మిల్లీగ్రామ్, పొటాషియం 714 మిల్లీగ్రామ్, కాపర్ 1. 07 మిల్లీగ్రామ్, మ్యాంగనీస్ 2 మిల్లీగ్రామ్, విటమిన్ b2,0. 9 1 1మిల్లీగ్రా,లభిస్తాయి.

బాదంపప్పు యొక్క బెనిఫిట్స్:

ప్రతిరోజు రాత్రి నీళ్లలో రెండు మూడు బాదం పప్పులను నీటిలో నానబెట్టి ఉదయం పిల్లలకు ఇవ్వడంద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. బాదం పప్పులో పీచు పదార్థం అధికంగా ఉండడం ద్వారా బరువు తగ్గాలనుకునే వారికి బాదంపప్పు తీసుకున్న ద్వారా ఉపశమనం కలుగుతుంది. ఇందులో క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల ఆర్థియోఫోరాసిస్ ను వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఎముకలు దృఢంగా ఉండేటట్లు చేస్తుంది.ఇందులో మెగ్నీషియం ఉండటం వల్ల కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

బాదం పప్పులో మోనో శాచూరేటెడ్, పాలిశా చురేటెడ్ వంటి ఫ్లాట్స్ అధికంగా ఉండటం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. బాదంపప్పును తీసుకోవడం ద్వారా  హుద్యోగ సమస్యలను నియంత్రణలో ఉంచుతుంది. పెద్దపేగు క్యాన్సర్ వంటి సమస్యల నుండి విముక్తి కలిగిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా బాదంపప్పు తీసుకోవడం ద్వారాపిండి పదార్థాలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. బాదం పప్పులో విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది.

ఆరోగ్యకరమైన జుట్టు కు కావలసిన పోషకాలు, విటమిన్లు ,బాదంపప్పులో లభిస్తాయి .కాబట్టి బాదంపప్పును తీసుకోవడం ద్వారా జుట్టు ఒత్తుగా, గట్టిగా ,బలంగా, దృఢంగా ఉండేటట్లు చేస్తుంది. జుట్టు ఒత్తుగా పెరిగేందుకు బాదంపప్పులోని మెగ్నీషియం, జింక్స్ బాగా తోడ్పడతాయి. చర్మం కాంతిని మెరుగుపరచడంలో కూడా బాదంపప్పు బాగా ఉపయోగపడుతుంది. బరువును తగ్గించడం కోసం నానబెట్టిన బాదంపప్పును తీసుకోవడం ద్వారా తొందరగా ఉపశమనం కలుగుతుంది. బాదం లో ఉండే మోనోసాచ్యురేటెడ్ ఆకలిని తగ్గిస్తుంది కాబట్టి పొట్ట నిండినట్లుగా ఉంటుంది .అందువల్ల బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు  నానబెట్టిన బాదంపప్పును తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారు.

చర్మ సౌందర్యాన్ని పెంచడం కోసం బాదంపప్పు చాలా ఉపయోగపడుతుంది. చర్మానికి సహజవంతమైన మెరుపును పెంచడానికి బీజింగ్ కారకాలు బాదంపప్పులో పుష్కలంగా ఉన్నాయి కాబట్టి చర్మం లోని మృతుకణాలను తొలగించి చర్మానికి కాంతిని ఇస్తాయి. నానబెట్టిన బాదం, తేనె ,ఆలివ్ ఆయిల్ ను బాగా మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత ముఖాన్ని  వాష్ చేసుకుంటే ముఖం శుభ్రంగా కాంతివంతంగా మెరుస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్, ను పెంచుతుంది. జీవ కణాలు దెబ్బ తినకుండా చేయడంలో మరియు జీవకణాలను ప్రోత్సహించడంలోనూ బాదంపప్పు తోడ్పడుతుంది.

బాదంపప్పులోయాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బాదంపప్పులోని ఒమేగా ఫ్యాటీ యాసిడ్ ,మెగ్నీషియం గుండె జబ్బులు రాకుండా చేస్తాయి ,మరియు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బాదంపప్పులో ఉండే మెగ్నీషియం, ఫాస్పరస్ ,దంతాలు, ఎముకలను ,దృఢంగా మరియు ప్రతిష్టంగా ఉంచడంలో తోడ్పడతాయి ,మెదుడును చురుకుగా ఉంచి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. బాదంపప్పులో ఉండే పీచు పదార్థం శరీరంలోని జీవక్రియను మెరుగుపరిచి మలబద్ధక సమస్యను నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

బాదంపప్పులోని మెగ్నీషియం రక్తంలోని షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉండేటట్లు చేస్తుంది. 20 నుంచి 22 బాదం లను మనము తీసుకోవచ్చు. అయితే స్టార్టింగ్ లో నాలుగు నుంచి ఐదు భాగములు మాత్రమే తినాలి. తినవలసిన దానికంటే అధిక మొత్తంలో భాగంలో తీసుకోవడం ద్వారా కడుపు నొప్పి అసిడిటీ డైజేషన్ ప్రాబ్లం, మలబద్దక సమస్యలు, ఏర్పడతాయి. రాళ్లు పిత్తాశయంలో రాలు ఉన్నవారు కిడ్నీలో రాళ్లు ఉన్నవారు బాదంపప్పును తీసుకోకూడదు. మరియు ఇతర డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి విధంగానే తీసుకోవాలి. పప్పులోని పొట్టులో tannin  పదార్థం ఉంటుంది. ,బాదం పప్పులోని పోషక విలువలు మన శరీరానికి అందకుండా చేస్తుంది కాబట్టి నానబెట్టి తీసుకోవడం మంచిది. మరియుసరిగ్గా జీర్ణం అవ్వదు .కాబట్టి 8 గంటలు నానబెట్టి తినడం ద్వారా సులువుగా జీర్ణం అవుతుంది.

Almond milk తయారీవిధానం:

ముందుగా 1/2litter పాలు తీసుకోవాలి. వీటిని ఒక కడాయి తీసుకొని అందులో వేసుకోవాలి.2-3 సార్లు పొంగు వచ్చినంత వరకు మరిగించుకోవాలి. ఆఫ్ లీటర్ పాలు కి 30 బాదం పప్పులు సరిపోతాయి. బాదంపప్పును ఎనిమిది గంటలు నీటిలోనానబెట్టుకోవాలి. తర్వాత వీటి పైన ఉండే పొట్టును తీసి30 బాదం పప్పును వేసి,కాచి చల్లార్చిన కప్పు పాలు వేసి మిక్సీలో వేసుకొని ,మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ఈ పేస్టును మరిగే పాలలో వేసి బాగా కలపాలి. వీటిలో చిటికెడు కుంకుమపువ్వు వేసుకోవాలి.

కుంకుమపువ్వు వేయడం వల్ల బాదంపాలు ఎల్లో కలర్ లో ఉంటుంది. మిక్సీ జార్ తీసుకొని అందులో 1, మరియు3/4 కప్పుల చక్కెరను తీసుకోవాలి. వీటిలోకి 4_5 ఇలాచి వేసుకోవాలి.2 స్పూన్స్, ల పాల పౌడర్ వేసుకోవాలి. వీటిని అన్నింటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న మొత్తం మిశ్రమాన్ని పాలలో వేసి2_3 పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని వేడిగైనా త్రా గవచ్చు లేదా చల్లార్చుకొని ఫ్రిజ్లో పెట్టుకొని త్రాగవచ్చు. చివరగా 4_5బాదం పప్పులు సన్నగా కట్ చేసుకుని గార్నిష్ కోసం గ్లాస్ పైన వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే బాదం మిల్క్ రెడీ.

Almond oil for hair:

ముందుగా మనము నాలుగు కప్పుల కొబ్బరిఆయిల్, ను తీసుకోవాలి. ఒక కప్పు బాదంపప్పును కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక,కాడాయి పెట్టుకోవాలి. అందులో నాలుగు కప్పుల కొబ్బరి నూనె వేసుకొని బాగా మరిగించుకోవాలి. తరువాత అందులో మనం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న బాదంపప్పుని వేసుకోవాలి.20 నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాదంపప్పు మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేడి చేసుకోవాలి. తరువాత ఆయిల్ చల్లార్చిన తర్వాత ఒక సీసాలో వడ పోసుకుని స్టోర్ చేసుకోవాలి.వీటిని జుట్టుకు రాత్రి పడుకునే ముందు బాగా అప్లై చేసుకోవాలి. ఉదయం లేచిన తర్వాత తేలిక పాటి షాంపుతో స్నానం చేయాలి. దీనివల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చిట్లిన వెంట్రుకలు త్వరగా మొలుస్తాయి. జుట్టు కాంతివంతంగా మెరుస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఫేస్ కి మరియు జుట్టుకి రాసుకోవడం వల్లమంచి ఉపశమనం కలిగిస్తుంది.

Almond Oilforface :

బాదం లో చర్మాన్ని శుభ్రపరిచే గుణాలతో పాటు య వ్వనాన్నిపెంచే గుణాలు అధికంగా ఉన్నాయి. బాదం పప్పులు పొడి చేసుకుని సీసాలలో పోసీ ఫ్రిడ్జ్ లో నిలువ చేసుకోవచ్చు. ఒక స్పూన్ బాదం పొడిలో కొద్దిగా నీళ్ళు పోసుకొని పేస్టులాగా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం ,మెడ ,చేతులకు రాసుకొని 20 నిమిషాల పాటు మసాజ్,చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల చర్మం లోపలి గ్రంధులు విడుదల చేసిన మలినాలు తొలగిపోయి ,చర్మం శుభ్రంగా కాంతివంతంగా మెరుస్తుంది.

నానబెట్టిన రెండు బాదం పప్పులను తీసుకొవాలి. వీటిని పొడి చేసుకోవాలి. ఈ పొడి చేసుకున్న బాదం మిశ్రమాలలో కొద్దిగామిల్క్ వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ,చేతులకు, మెడకు ప్యాక్ వేసుకొని ఐదు నిమిషాలు అప్లై చేసుకోవాలి .ఆ తర్వాత చల్లటినీటితో కడిగితే చర్మం తెల్లగా మారుతుంది. కొద్దిగా బాదంపోడిని, తీసుకొని అందులో వన్ స్పూన్ ఓట్స్ పొడి వేసి కలపాలి. ఈ విషయాన్ని ఫేస్ కి అప్లై చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత చల్లని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. దీనివల్ల ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్లకి ఈ ప్యాక్ చాలా మంచి ఉపశమనం కలిగిస్తుంది. బాదం పొడిలో కొద్దిగా పెరుగు, నిమ్మరసం, తేనె వేసి కలుపుకోవాలి. ఈ పేస్టును ముఖానికి అప్లై చేసుకోవాలి .పది నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో ఫేస్ వాష్ చేసుకోవాలి. దీనివల్ల స్కీన్ డ్యామేజ్ ని నివారిస్తుంది .మరియు చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

సైడ్ ఎఫెక్ట్స్:

బాదంపప్పులో మాంగనీస్ అధికంగా ఉంటుంది .కాబట్టి రక్తపోటును పెంచుతుంది .కాబట్టి బీపీ ఉన్నవారు మరియు టాబ్లెట్స్ వాడుతున్న వారు బాదం పప్పులను తీసుకోకూడదు. బాదంపప్పులో విటమిన్ ఈ పుష్కలంగా ఉండటం వల్ల తలనొప్పి, అలసట కలుగుతుంది. అందువల్ల మైగ్రేన్ సమస్యలు ఉన్నవారు బాదంపప్పులు తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. కిడ్నీలో రాళ్లు ,పిత్తాశయంలో రాళ్లు ఉన్నవారు ఈ బాదంపప్పును అస్సలు తినకూడదు .ఎందుకంటే బాదంపప్పులో ఆక్సలైట్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి స్టోన్స్ ఎక్కువగా అవుతాయి. అధిక బరువు ఉన్నవారు కూడా ఈ బాదంపప్పును తీసుకోకూడదు. ఎందుకంటే దీనిలో అదిగా క్యాలరీలు, కొవ్వులు ఉంటాయి. కాబట్టి ఊబకాయాన్ని మరింత పెంచుతాయి.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button