Uncategorized

Goruchikkudu uses: గోరు చిక్కుడు ఆరోగ్య ప్రయోజనాలు

Goruchikkudu uses: అరుదుగా దొరికే కూరగాయలలో గోరుచిక్కుడు(Goruchikkudu) ఎంతో ముఖ్యమైనది. ఇందులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది.గోరుచిక్కుడు లో పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు, కొవ్వు ,క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే,b1,b2,b3 లు సమృద్ధిగా లభిస్తాయి. గోరుచిక్కుడు ‘ఫ్యాబేసి ‘కుటుంబానికి చెందినది. బోట నికల్ నేమ్ .”cyamopsis tetragonoloba “అంటారు. ఇంగ్లీషులో’ cluster beans ‘అంటారు.ఉర్దూలో ‘మటకి ‘అంటారు. సంస్కృతంలో గోవర్ధన, దృడబీజ అంటారు.

తెలుగులో మట్టి కాయలు అంటారు. గోరుచిక్కుడు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఎక్కువగా భారతదేశంలోని పశ్చిమ, వాయువ్య ప్రాంతాలలోనూ గోరు చిక్కుడును పండిస్తారు. అమెరికా ,మెక్సికో ,ఆఫ్రికా ,ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కూడా గోరుచిక్కుడును పండిస్తారు.కరువు పరిస్థితులను కూడా తట్టుకొని పెరుగుతుంది.పాకిస్తాన్లోనూ గోరుచిక్కుడును ఎక్కువగా పండిస్తున్నారు.

Goruchikkudu uses:

క్యాలరీలు గోరుచిక్కుడులో తక్కువగా ఉంటాయి. విటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలంటే గోరుచిక్కుడు తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. క్యాన్సర్ సంబంధిత సమస్యల నుండి గోరుచిక్కుడు తీసుకోవడం ద్వారా ఉపశమనం కలుగుతుంది. పళ్ళుమరియు ఎముకలు దృఢంగా ఉంచడానికి గోరుచిక్కుడు ఉపయోగపడుతుంది. చర్మ సంబంధిత సమస్యలను కూడా నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు గుణాలు అధికంగా ఉంటాయి.

cluster beans
cluster beans

కాబట్టి చర్మంలో వచ్చే ముడతలను తొలగించి ,డార్క్ మచ్చలను తొలగించడంలో గోరుచిక్కుడు ఉపయోగపడుతుంది. రాగి మరియు ప్రోటీన్ గోరుచిక్కుడు కలిగి ఉండటం వల్ల చర్మం ముడతలను తొలగించి కాంతివంతంగా మెరిసేటట్లు చేస్తుంది. వృద్ధాప్య ఛాయలను కూడా తొలగిస్తుంది. గోరుచిక్కుడులో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. కాబట్టి రక్తహీనత సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది.

గోరుచిక్కుడు లో ప్రోటీన్స్, ఫైబర్ ,క్యాల్షియం ,ఫాస్ఫరస్ ,విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కె ,ఇలా అనేక రకాల పోషక పదార్థాలు ఉండటం వల్ల గర్భణీ స్త్రీలు చిక్కుడును తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి .మరియు పిండం ఎదుగుదలకు సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి గోరుచిక్కుడు ఒక గొప్ప వరమని చెప్పవచ్చు.

చిక్కుడులో ఫైబర్ అధికంగా ఉండి క్యాలరీలు తక్కువ ఉంటాయి. కాబట్టి గోరుచిక్కుడును తరు చుగా ఆహారము తీసుకుంటే బరువు తగ్గవచ్చు. ఇందులో విటమిన్ ఏ ఉండటం వల్ల కంటి చూపును మెరుగుపరుస్తుంది. గింజలు అధికంగా ఉన్న గోరుచిక్కుడు తినడం ద్వారా బరువు తొందరగా తగ్గుతారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా గోరుచిక్కుడును తీసుకోవడం ద్వారా షుగర్ స్థాయి కంట్రోల్ లో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ సమస్యను నివారిస్తుంది.

గర్భిణీ స్త్రీలు వీటిని తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువు పెరుగుదలకు సహాయపడుతుంది. చెడు కూడా స్ట్రాలను నివారిస్తుంది. నిద్రలేమి సమస్యను మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. మెదడు పనితీరును చక్కగా జరిగేటట్లు చేస్తుంది. దంతాలు ,నరాలు ,గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. క్యాన్సర్ కారకాలను తగ్గిస్తుంది.

గోరుచిక్కుడు లో గ్లైసామిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటాయి. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. ఫ్యాటీ లివర్స్ ఉన్నవారు ఈ గోరుచిక్కుడును తీసుకోవడం ద్వారా ఉపశమనం కలుగుతుంది. ఫైబర్,కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి స్టమక్ క్లీన్ కి కూడా చక్కగా ఉపయోగపడుతుంది .మరియు స్టమక్ ను హెల్తీగా ఉంచడం కోసం కూడా ఈ గోరు చిక్కుడుకాయలను తీసుకోవాలి.

గోరుచిక్కుడు లోని గింజలను వేరు చేస్తారు. ఇందులో ఎండోసైన్ అధికంగా ఉంటుంది .కాబట్టి జిగురు అధికంగా లభిస్తుంది. ఈ జిగురును ఐస్ క్రీమ్ ,చాక్లెట్, జెల్లీ ,బిస్కెట్లలో ఉపయోగిస్తారు. గోరుచిక్కుడు లో ఐరన్, క్యాల్షియం ,అధికంగా ఉండటం వల్ల మతిమరుపు సమస్యను నివారిస్తుంది. మరియు మెదడును ఉత్తేజపరుస్తుంది.

గోరుచిక్కుడు వేపుడు తయారీ విధానం:

ముందుగా మట్టి కాయలను పీసు తీసుకొని మీడియం సైజులో కట్ చేసుకోవాలి. రెండు మూడుసార్లు శుభ్రంగా నీటితో వాష్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మనం తుంచి వాష్ చేసి పెట్టుకున్న మట్టి కాయలను ఒక గిన్నెలో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. సాల్ట్ వేసుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత మట్టి కాయ లు ఉడికిపోయిన తర్వాత నీటిని వంపేసి పక్కన పెట్టుకోవాలి.

ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. కొబ్బరి ముక్కను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో3 టేబుల్ స్పూన్, ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత పోపుగుంజులు వేసుకోవాలి.

పోపుగింజలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇవి దొ రగా వేగిన తరువాత మనం ఉడికిoచి పక్కన పెట్టుకున్నా మట్టి కాయలను వేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో మట్టి కాయలను కలుపుతూ వేయించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మనం మిక్సీ జార్ లో గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం పేస్టును వేసుకోవాలి. వీటిని ఒకసారి మొత్తం కలుపుకొని రుచికి సరిపడినంత ఉప్పు ఉందో లేదో చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడివేడిగా ఉండే మట్టి కాయల వేపుడు రెడీ. దీనిని రసంలో గాని అన్నంలో గాని, సైడ్ డిష్ గా ,గాని చాలా బాగుంటుంది.

Goruchikkudu coconut curry తయారీ విధానం:

ముందుగా నేను ఇక్కడ 250g, ల గోరుచిక్కుడును తీసుకున్నాను. పైన ఉండే పీచును మొత్తం తీసుకొని మీడియం సైజులో వలచుకున్నాను. తర్వాత వీటిని రెండు మూడు సార్లు నీటితో శుభ్రంగా వాష్ చేసుకున్నాను. తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని, ఒక గ్లాస్ వాటర్ వేసుకొని, కొద్దిగా సాల్ట్ వేసి ఐదు నిమిషాలు ఉడికించుకున్నాను. వీటిలోని నీటిని మొత్తం వంపేసుకొని పక్కన తీసుకున్నాను.

మిక్సీ జార్ తీసుకొని అందులోకి 100 గ్రాముల కొబ్బరి ముక్కలను సన్నగా కట్ చేసి అందులో వేసుకున్నాను.6 ఎండుమిరపకాయలను సగానికి కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. నీళ్లు వెయ్యకుండా బరకగా గ్రైండ్ చేసుకున్నాను. ఈ పేస్టును ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టుకున్నాను. అందులోకి త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. తర్వాత టేబుల్ స్పూన్ శనగపప్పు ,టేబుల్ స్పూన్ మినప్పప్పు ,వేసి వేయించుకున్నాను.

తరువాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ,ఆఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకున్నాను. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొద్దిగా కరేపాకును కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాను. ఇవి దొరగా వేగిన తర్వాత ఉడికించుకొని పక్కన పెట్టుకున్న మట్టి కాయలను వేసుకున్నాను. అందులోనే చిటికెడు పసుపు వేసుకొని, కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం మట్టికాలను ఒకసారి బాగా కలుపుకున్నాను.

5నిమిషాలు మూత పెట్టుకొని నీరు లేకుండా ఉడికించుకున్నాను. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మట్టి కాయలు ఉడికిపోయి ఉంటాయి. తర్వాత మనం గిన్నెలోకి పక్కన తీసి పెట్టుకున్న కొబ్బరి పేస్టును వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకున్నాను. మట్టి కాయలకు ఈ కొబ్బరి పేస్టును కూరకి పట్టేటట్లు కలుపుకున్నాను. టేస్ట్ కి సరిపడినంత ఉప్పు ఉందో లేదో చూసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడివేడిగా ఉండే గోరుచిక్కుడు కోకోనట్ కర్రీ రెడీ. దీనిని సైడ్ డిష్ గా, గాని రొట్టెలోకి గాని చాలా బాగుంటుంది.

Goru chikkudu Kura తయారీ విధానం:

ముందుగా నేను ఇక్కడ ఆఫ్ కేజీ గోరుచిక్కుడుకాయలను తీసుకున్నాను. పీచు తీసుకొని చేత్తో తుంచుకున్నాను. తర్వాత రెండు మూడు సార్లు నీటితో శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకున్నాను. అందులో త్రి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అయిల్ వేడి అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఒక పెద్ద సైజు టమాట ను సన్నగా కట్ చేసి వేసుకున్నాను.

ఇవికొద్దిగావేగిన తరువాత సన్నగా తుంచుకొని పక్కనపెట్టుకున్నా గోరుచిక్కుడు లను వేసుకున్నాను. చిటికెడు పసుపు వేసుకున్నాను . ఒకటేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను .హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. వీటిని అన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. తరువాత మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను.

కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే మట్టి కాయలు ఉడికిపోయి ఉంటాయి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, కొద్దిగా కొత్తిమీర వేసుకొని సన్నని మంట మీద నీళ్లు లేకుండా ఉడికించుకున్నాను. రుచి కి సరిపడినంత ఉప్పు ఉందో లేదో చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. వేడివేడిగా ఉండే గోరుచిక్కుడుకాయ కూర రెడీ. అన్నంలోకి గాని ,చపాతీలోకి గాని చాలా బాగుంటుంది.

Goru chikkudu fry తయారీ విధానం:

ముందుగా నేను 250g, లగోరు చిక్కుడు లను తీసుకున్నాను. వీటిని పీసు తీసుకొని చేత్తో తుంచుకున్నాను. వీటిని మూడుసార్లు నీటితో శుభ్రంగా వాష్ చేసుకున్నాను. వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ,కొద్దిగా సాల్ట్ వేసుకొని, ఐదు నిమిషాలు ఉడికించుకున్నాను. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను.

ఆయిల్ వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని వేయించుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ,కొద్దిగా ధనియాలు వేసుకొని వేయించుకున్నాను. 7 -8 ఎండుమిరపకాయలను అందులోని వేసుకొని దోరగా వేయించుకున్నాను. 2 స్పూన్ల కొబ్బరి ముక్కలను కూడా వేసుకున్నాను.వీటిని అన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను.

ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకొని బరకగా గ్రైండ్ చేసుకున్నాను. ఇందులోనే ఐదు వెల్లుల్లి రెమ్మలు వేసుకుని కచ్చాపక్కగా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. అందులోనే రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ల పోపు గింజలు వేసుకున్నాను. వేగిన తరువాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను.

అందులోనే నాలుగు పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ సన్న కట్ చేసి వేసుకున్నాను. రెండు ఎండు మిరపకాయలను సగానికి తుంచి వేసుకున్నాను. ముందుగానే ఉడికి0చి పెట్టుకున్న మట్టికాలను ఇందులో వేసుకున్నాను. చిటికెడు పసుపు ,టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకున్నాను. మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్టును వేసుకొని ఒకసారి మట్టి కాయలకి తగిలే విధంగా మధ్య ,మధ్యలో వేస్తూ కలుపుకున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసుకొని, లో ఫ్లేమ్ లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. వేడిగా ఉండే మట్టి కాయల ఫ్రై రెడీ.

గోరుచిక్కుడు సీడ్స్ గురించి:

గోరుచిక్కుడును ఎక్కువగా జూన్ నుంచి ఆగస్టు నెలలో వరకు నాడుతారు. ఇది 30 నుంచి 40 రోజుల వరకు పంట కాపు కు వస్తుంది. గోరుచిక్కుడు విత్తనాలను వేసిన తర్వాత తేమ గల ప్రాంతంలో నాటాలి. వీటికి అధిక పురుగుల మందు అవసరం ఉండదు. ఐదు అడుగుల వరకు ఎత్తు పెరుగుతుంది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button