Uncategorized

Mushrooms types మష్రూమ్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయో తెలుసా?

మష్రూమ్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా పుట్టగొడుగుల ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. వీటి ద్వారా చాలామందికి ఉపాధి కూడా కలుగుతుంది. మష్రూమ్స్ వాడకం ఎక్కువగా పెరిగిపోయింది. ఎక్కడికి వెళ్లినా స్పెషల్ ఐటమ్ గా పుట్టగొడుగులను వాడుతున్నారు.

ప్రపంచం మొత్తంలో నాలుగువేల రకాల పుట్టగొడుగులు ఉన్నాయి. వీటిలో 200 రకాలు మాత్రమే తినడానికి వీలుగా ఉన్నాయని నిపుణులు గుర్తించారు. అయితే సాగు చేస్తున్నవి మాత్రం మూడు నాలుగు రకాలే.

1. తెల్ల గుండి పుట్టగొడుగులు.

2. ముత్యపు చిప్ప పుట్టగొడుగులు.

3. పాల పుట్టగొడుగులు.

4. వరిగడ్డి పుట్టగొడుగులు.

వీటి కోసం 85 నుంచి 90 శాతం తేమ, 16 నుంచి 18 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత, కంపోస్ట్ ఎరువులు అవసరం. వీటిని సాగు చేయడానికి జూన్ నుంచి ఫిబ్రవరి వరకు ఉన్న కాలం అనవుగా ఉంటుంది.

35 నుంచి 45 రోజులలో పంట చేతికి వస్తుంది పుట్టగొడుగులను కోసిన 24 గంటల వరకు నిల్వ ఉంటాయి. అంతేకాక వీటిగుబడి ఎక్కువగా ఉన్నందువల్ల నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది.

చిరు వ్యాపారస్తులు కూడా వీటిని ఎక్కువగా అమ్ముతున్నారు. వీటిని ఎక్కువ కాలం నిలువ చేసుకోవడానికి శుద్ధి చేసి ఎండబెట్టి ప్యాకింగ్ చేసుకోవాలి.

ఆహారంగా తీసుకునే పుట్టగొడుగులలో 89 నుంచి 91 శాతం నీరు ఉంటుంది. 0.97 నుంచి 1.26 శాతం వరకు లావణాలు, 4 శాతం మాంసకృతులు, 5.3 నుంచి 6.28% పిండి పదార్థాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

పోషకాహారంగా పుట్టగొడుగులను తినమని నూట్రిసియన్లు సలహా ఇస్తున్నారు. చాలా ఫంక్షన్లలో కూడా వీటిని రకరకాలు వంటలు చేయడంలో ఉపయోగిస్తున్నారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button