ముల్లంగిని తినడం లేదా? అయితే మీరు చాలా నష్టపోయినట్టే.

ముల్లంగిని తీసుకోకపోతే నష్టపోయినట్లేనా?

మనం ప్రతిరోజు ఆహారంగా తీసుకునే దుంపలలో ముల్లంగి ఒకటి. అన్ని దుంపలలో కల్లా శ్రేష్టమైనది మరియు ఆరోగ్యాన్ని ఇచ్చేది ముల్లంగి మాత్రమే. అన్ని దుంపలలకంటే తక్కువ క్యాలరీలను ఇచ్చేది ముల్లంగి. సాధారణంగా మనకు ముల్లంగి రెండు రకాలుగా దొరుకుతుంది.

1. తెల్ల రంగులో ఉండేది, లేత గులాబీ రంగులో ఉండే ముల్లంగి. లేత గులాబీ రంగులో ఉండే ముల్లంగి కన్నా, తెల్ల ముల్లంగిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ముల్లంగిని మాత్రమే కాకుండా ముల్లంగి ఆకులు మరియు గింజలు ఆహారంగా తీసుకోవచ్చు. ముల్లంగిని ప్రతిరోజు ఆహారంగా తీసుకోవడం ద్వారా మనకు అనేక లాభాలు వస్తున్నాయి. ముల్లంగి ఆకులను వంటలలోనే కాక అనారోగ్యం ఉన్నప్పుడు కషాయంగా కూడా తీసుకుంటారు.

ముల్లంగి వల్ల లాభాలు: ముల్లంగిలో “విటమిన్ సి” ఎక్కువగా ఉంటుంది దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొందరికి చిగుళ్ల నుంచి రక్తం కారుతుంది ఈ సమస్యను తగ్గించుకోవడానికి ముల్లంగి తీసుకోవడం మంచిది. ముల్లంగి ఆకుల రసాన్ని జ్యూస్ లా తీసుకోవడం వల్ల మూత్ర ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారిస్తుంది. ముల్లంగి గింజలను పొడి చేసి తీసుకోవడం ద్వారా మహిళలకు నెలసరి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

అలాగే పిరియడ్స్ క్రమంగా రావడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. ముల్లంగిని చిన్న ముక్కలుగా చేసుకొని, నిమ్మకాయ రసం వేసి, కాస్త ఉప్పు వేసి తీసుకుంటే జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. ఆకలి పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. ముల్లంగి రసాన్ని 60 నుంచి 80 మిల్లీ లీటర్లు 10 నుంచి 15 రోజుల వరకు క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మూత్రం సాఫీగా రావడానికి మరియు మూత్ర ఇన్ఫెక్షన్ తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

అలాగే 60 మిల్లీలీటర్స్ లా ముల్లంగి రసాన్ని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా మొలల సమస్యకు మరియు మొలల ద్వారా రక్తస్రావం తగ్గించడానికి మంచి టానిక్ ల ఉపయోగపడుతుంది. 60 మిల్లీలీటర్స్ లా ముల్లంగి రసాన్ని ప్రతిరోజు 15 నుంచి 30 రోజుల వరకు తీసుకుంటే కిడ్నీలో ఉండే రాళ్లు కరిగిపోతాయి.

లివర్ కు అనేక రోగాలు వస్తూ ఉంటాయి. వాటిలో లివర్ కామెర్లు ఒకటి. దీనికి ముల్లంగి ఆకుల రసంలో పట్టిక బెల్లం కలిపి తీసుకుంటే కామెర్ల సమస్యను తగ్గించుకోవచ్చు. అలాగే మలినాల్ని బయటికి పంపించి, లివర్ తిరిగి మామూలుగా పని చేసేలా చేస్తుంది. ఇందులో పోలిక్ యాసిడ్, యాంతో సీయానిక్ అనే కెమికల్స్ క్యాన్సర్ కణాలు రాకుండా చేస్తాయి. ఒకవేళ క్యాన్సర్ కణాలు ఉంటే తగ్గడానికి ఉపయోగపడతాయి. పురుగు కాటు, తేనెటీగల కాటు నొప్పిని ముల్లంగి తగ్గిస్తుంది.

Radish

ముల్లంగిలో ఉండే పాస్పరస్, జింక్ ,బి విటమిన్ చర్మ సమస్యలు రాకుండా కాపాడుతాయి. ముల్లంగి గుజ్జును మొహానికి ప్యాక్లా వేసుకోవడం ద్వారా మృత కణాలు తగ్గి మొహం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. ముడతలను రాకుండా నివారిస్తుంది. ముల్లంగి రసంలో, నల్ల ఉప్పు కలిపి తాగితే ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. జ్వరం, తలనొప్పి తగ్గుతుంది నోట్లో దుర్వాసన రాకుండా చేస్తుంది. అలాగే కడుపులో మంటను, దగ్గును కూడా నివారిస్తుంది. ముల్లంగిలో తక్కువగా క్యాలరీలు ఉంటాయి. క్రొవ్వులు, మాంసకృతులు అసలు ఉండవు.

అతి తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అందువల్ల బరువు తగ్గాలనుకున్నవారు దీనిని ప్రతిరోజు ఆహారంగా తీసుకోవచ్చు. 2012లో కర్ణాటకలోని యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ అనే సంస్థ ముల్లంగి మీద పరిశోధనలు చేసి ఇందులో ఇండోర్ కార్బనాల్, ఐ సో థియో సైనేడ్ అనే కెమికల్స్ ఉన్నాయి. ఇవి లివర్ ను క్లీన్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.

ముల్లంగిని జ్యూస్ లా చేసుకొని తాగడం ద్వారా కిడ్నీలలో ఉండే రాళ్లు తగ్గి మూత్రం ద్వారా బయటికి వచ్చేస్తాయి.  అధిక బరువు పెరగడం వల్ల రక్తంలో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకుండా చేసి షుగర్ రావడానికికారణంఅవుతుంది. ముల్లంగిలో ఉండేఎడిపోయాక్టీన్ హార్మోను వల్ల షుగర్ రాకుండా నియంత్రిస్తుంది. అలాగే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయడానికి దోహదపడుతుంది. అందువల్ల షుగర్, ఉన్నవాళ్లు బరువు తగ్గాలి అనుకునే వారు ఎక్కువగా ముల్లంగిని తీసుకోవచ్చు.

ముల్లంగి వల్ల గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ మరియు అల్సర్ అలాగే ఎసిడిటీని తగ్గిస్తుంది. అలాగే ముల్లంగి ద్వారా ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు మరియు ఆకుల ద్వారా కూడా వంటలు చేసుకొని తినవచ్చు. వంటల కన్నా ముల్లంగిని పచ్చిగా తీసుకోవడం ద్వారా మంచి మేలు కలుగుతుంది.

Exit mobile version