Evening walking benefits: ఈవినింగ్ వాకింగ్ గురించి తెలుసుకోండి?
వాకింగ్ చేయడం వలన మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. వాకింగ్ ఉదయమే కాక సాయంకాలం కూడా చేయవచ్చు. సాయంకాల సమయంలో నడవడం వలన మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్ స్టైల్ లో ఉదయం పూట వాకింగ్ చేయడం సాధ్యమవడం లేదు. ఉదయం పూట నడవటానికి సమయం సరిపోక సతమవుతమవుతున్నవారు.అటువంటి వారు సాయంకాలం నడవడం అలవాటు చేసుకోవచ్చు. ఇలా వాకింగ్ చేయడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మనుషుల జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఆహారం మార్పుల వల్ల ముసలివారే కాక యవ్వనస్తులు కూడా అనారోగ్యం పాలవుతున్నారు. అందువల్ల ఈవినింగ్ వాకింగ్ చేయడం వల్ల పాజిటివ్ ఎఫెక్ట్ కలిగి పాజిటివ్ బెనిఫిట్స్ అనుభవించవచ్చు. ఇజ్రాయిల్, కాలిఫోర్నియా యూనివర్సిటీలు పరిశోధనలు జరిపి ఉదయం కంటే సాయంకాలం నడవటం వల్ల 50 శాతం యాక్టివ్ గా ఉంటారు అని ప్రముఖ శాస్త్రవేత్తలు తెలిపారు.
సాయంకాలం కనీసం 30 నిమిషాలు లేదా 90 నిమిషాలు నడవడం మంచిది. ఇలా కొంచెం సమయం చల్లగాలిలో నడవడం వల్ల శరీరానికి శక్తి కలిగి శరీరం హెల్తీగా, ఫిట్ గా ఉండి మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. కొంచెం సేపు రోడ్డుపైన గాని, పార్కులలో గాని నడక సాగించడం వలన కండరాలన్నీ రిలాక్స్ అయ్యి పని చేసిన అలసట తగ్గి ప్రశాంతంగా ఫీల్ అవుతారు. సంధ్యా సమయంలో వాకింగ్ చేయటం వలన శరీరంపై పడ్డ నెగిటివ్ ఎఫెక్ట్, ఒత్తిడి, టెన్షన్ తగ్గి నిద్ర బాగా పడుతుంది.
ఇలా వాకింగ్ చేయడం వలన జీర్ణశక్తి పెరిగి ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. పగటిపూట కంటే రాత్రి సమయాలలో కొంచెం బెటర్ గా ఫీల్ అవడం జరుగుతుంది. నడుము నొప్పి ఉన్నవారు, పగలంతా ఆఫీస్ లలో కూర్చుని పనిచేసేవారు సంధ్యా సమయాలలో కొంచెం సేపు నడక సాగించడం ద్వారా అండరాలు అన్నీ కదిలి కొంచెం రిలాక్స్ గా ఉంటాయి అందువల్ల లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల బ్లడ్ ప్రెజర్ తగ్గి టెన్షన్స్ అన్నీ తగ్గుతాయి. దానివల్ల మనసు తేలికగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరిగి మనిషి ఆరోగ్యంగా తయారవుతాడు. ఇలా చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలను దూరం చేయవచ్చు.
వాకింగ్ చేయడం ద్వారా కొవ్వు కరిగి బరువు కూడా తగ్గించుకోవచ్చు. డిప్రెషన్ నుంచి కూడా బయటపడవచ్చు. సంధ్యా సమయంలో నడక సాగించడం ద్వారా మధుమేహం, గుండె సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు. నడవడం ద్వారా కండరాలు దృఢంగా తయారై ఆఫీసులలో, ఇంట్లో చురుకుగా పని చేసుకోవచ్చు. అందువల్ల ఈవినింగ్ వాకింగ్ మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కావున వీలైనంత త్వరగా ఈవినింగ్ వాకింగ్ అలవాటు చేసుకోవడం మంచిది. ఇలా వాక్ చేయడం శరీరానికి మంచి వ్యాయామం లాగా పనిచేస్తుంది.