Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

Horoscope:ఈవారం ఏ రాశి వారికి అనుకూలంగా ఉందో తెలుసా?

మేషం

సన్నిహితులతో గొడవలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. సోదరులతో ఉన్న సమస్యలు తొలగిపోతాయి, వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన లాభాన్ని పొందుతారు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి, ఇంట, బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి, వ్యాపారాలకు నూతన ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహంతో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, చేయవలసిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు, అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది, విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు.

వృషభం

భూమికి సంబంధించిన విషయాలలో లాభాన్ని అందిస్తారు, వారం చివరలో ముఖ్యమైన పనులు చేయకుండా ఉండటం మంచిది. ఇంటి నిర్మాణ పనులు చేపట్టే అవకాశాలు ఉన్నాయి, చేయవలసిన పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు, కుటుంబంలోని వారితో ఉన్న మాట పట్టింపులు తగ్గిపోతాయి, దేవుని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, విద్యార్థులకు సంతోషకర వాతావరణం నెలకొంటుంది, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి, వృత్తి, ఉద్యోగాలలో స్థానాలు మారే అవకాశాలు ఉన్నాయి, దూరపు బంధువుల నుండి శుభవార్తలను వింటారు, స్థిరాస్తి గొడవలు వాయిదా పడతాయి, అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది, ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుంది, లక్ష్మీ స్తోత్రం పారాయణం చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

weekly  horoscope in telugu
Todays horoscope in telugu

మిధునం

బంధువుల రాకతో ఇంటిలో సంతోషకర వాతావరణం ఉంటుంది, చిన్న తరహా పరిశ్రమలు లాభాన్ని పొందుతాయి, ఎప్పటినుండో ఉన్న బాకీ డబ్బులు వసూలు చేస్తారు, ఇంటి నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు, సమాజంలో పేరు, ప్రఖ్యాతలు పెరుగుతాయి, విద్యార్థులకు మంచి వార్తలు వింటారు, వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు, ఎక్కువగా దేవుని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఉద్యోగులకు కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. సొంత ఆస్తి గొడవలు పరిష్కారం అవుతాయి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది, చిన్ననాటి స్నేహితులతో సంతోషంగా గడుపుతారు వారం చివరలో ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి, వెంకటేశ్వర స్తోత్రం పారాయణం చేయడం వలన మంచి ఫలితాలను అందుకుంటారు.

కర్కాటకం

వారం ప్రారంభంలో స్నేహితులతో దూరంగా ఉండటం మంచిది. సంతానం, వివాహం వంటి శుభకార్యాల కోసం కుటుంబంలోని వారితో కలిసి మాట్లాడతారు, బాకీ డబ్బులు చేతికి అందుతాయి, చేయవలసిన పనులు అనుకోకుండా పూర్తి చేస్తారు, బంధువులతో ఇంటిలో సంతోషకర వాతావరణం ఉంటుంది, ఇంట, బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. స్నేహితులతో కలిసి దేవుని సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు, వృత్తి వ్యవహారాలలో ఖచ్చితమైన నిర్ణయాలను అమలు చేసే అవకాశాలు ఉన్నాయి, నిరుద్యోగుల ప్రయత్నం ఫలిస్తుంది, అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి, అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది రామ రక్షా స్తోత్రం పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు

సింహం

సంతానం, వివాహ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి, బంధుమిత్రులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు, ఆదాయం అధికంగా ఉంటుంది, మిత్రులతో సహాయ సహకారాలను పొందుతారు, విలువైన వస్తువులను కొంటారు, సొంత ఆస్తి గొడవలు సర్దుమనుగుతాయి, నూతన వ్యాపారానికి కావలసిన సహాయాన్ని పొందుతారు, శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది, వారం మొదటిలో కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంపై జాగ్రత్తగా ఉండటం మంచిది. సోదరులతో కలిసిమెలిసి ఉంటారు, కష్టం మీద ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, శివాష్టకం పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.

కన్య

చాలాకాలం నుండి ఉండే సమస్యల నుండి ఉపశమనాన్ని పొందుతారు, బంధువులతో అనుకోకుండా గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ప్రయాణాలలో ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారం మధ్యలో గొడవలకు

వెళ్లకుండా ఉండటం మంచిది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. దేవుని సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి, ఉద్యోగస్తులు అధికారుల సహాయంతో వారి సమస్యలను పరిష్కరించుకుంటారు, అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది, ఇంద్రకృత లక్ష్మి స్తోత్రం పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలను అందుకుంటారు.

తుల

కుటుంబంతో కలిసి దేవాలయాలను దర్శిస్తారు, వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది, చేయవలసిన పనులు అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు, వ్యాపారాలకు సంబంధించి ఇతరుల నిర్ణయాలను పాటించకుండా ఉండటం మంచిది, ఇంటి నిర్మాణ పనులు చేపట్టే అవకాశాలు ఉన్నాయి, సొంత ఆస్తి వివాదాలు తక్కువ ముఖం పడతాయి, వ్యాపారాలలో ఆశించిన లాభాన్ని పొందుతారు, వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు, చేపట్టిన పనులను కష్టంతో పూర్తి చేస్తారు, అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది, కాలభైరవాష్టకం పారాయణం చేస్తే శుభ ఫలితాలను పొందవచ్చు

వృశ్చికం

ముఖ్యమైన పనులను త్వరగా పూర్తి చేస్తారు, ఇతరులతో దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు, అన్ని పనులు వారం ప్రారంభంలో చేయకుండా ఉండటం మంచిది. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి, కొన్ని సమస్యలను కుటుంబ సభ్యుల సహకారంతో పరిష్కరించుకుంటారు, స్థిరాస్తి గొడవలు తగ్గుముఖం పడతాయి, సంతానం, వివాహం ప్రయత్నాలు సంతోషకరంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది, అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది, వృత్తి వ్యాపారాలలు లాభాన్ని అర్జిస్తాయి, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు.

ధనస్సు

ఆర్థిక పరిస్థితి పురోగతిని సాధిస్తుంది, బంధువులతో ఇంటిలో సంతోషంగా గడుపుతారు, ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు, ఇంటా, బయట అనుకూల వాతావరణం ఉంటుంది, దూరపు బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి, వృత్తి, వ్యాపారాలలో పెద్దల సహాయం తీసుకోవడం మంచిది, గృహ, వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగాలలో పై అధికారులు ప్రశంసలను అందుకుంటారు, కొత్తగా రుణ ప్రయత్నాలు చేయకుండా ఉండటం మంచిది. దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను అందుకుంటారు.

మకరం

కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంపై సంతోషంగా ఉంటారు, అందవలసిన డబ్బు అందుతుంది, బంధువులతో సంతోషంగా గడుపుతారు, ఇంట బయటా అనుకూలంగా ఉంటుంది, వ్యాపారాలు లాభాన్ని అర్జిస్తాయి, సొంత ఆస్తి గొడవలు తగ్గే అవకాశాలు ఉన్నాయి, సంతానం, విద్యా, వివాహం వంటి విషయాల్లో ఆనందాన్ని పొందుతారు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఉద్యోగాలలో శ్రమ ఒత్తిడి తగ్గుతుంది, అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది, వారం మధ్యలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆప్తులతో ఉన్న గొడవలు పరిష్కారం అవుతాయి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి, విష్ణు పంజరత్ స్తోత్రం పారాయణం చేయడం వలన మంచి ఫలితాలను అందుకుంటారు.

కుంభం

పెద్దవారి ఆలోచనలను పాటించడం మంచిది, బంధువులతో చిన్నచిన్న గొడవలు వస్తాయి, చేపట్టిన పనులు సజావుగా పూర్తికావు, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఉద్యోగాలలో పై అధికారుల నుండి అప్రమత్తంగా ఉండటం మంచిది. ఇంటి నిర్మాణ పనులు నిదానంగా పూర్తి చేస్తారు, వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు, వారం మధ్యలో శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు, కొన్ని రంగాల వారికి మాత్రమే అనుకూల పరిస్థితులు ఉన్నాయి, గణపతి స్తోత్రం పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు.

మీనం

ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇంట, బయట పరిస్థితి అనుకూలంగా ఉంటుంది, చిన్ననాటి స్నేహితుల తో కలిసి ఇంటిలో సంతోషంగా గడుపుతారు, కావలసిన డబ్బు చేతికి అందుతుంది, ముఖ్యమైన పనులలో పెద్దలు నిర్ణయాలు తీసుకోవడం మంచిది, వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన లాభాలను అర్జిస్తారు. విద్యార్థుల పరీక్ష ఫలితాలు సంతోషాన్ని ఇస్తాయి, ఇంటి నిర్మాణ పనులు చేపడతారు, వారం చివరలో ముఖ్యమైన పనులు చేయకుండా ఉండటం మంచిది. దేవుని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, వ్యాపారాలను మంచి లాభాలను పొందుతారు, దత్త పంజర స్తోత్రంపారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker