Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

Horoscope: అక్టోబర్ నెల రాశి ఫలాలు, జాతక చక్రాల వివరాలు.

మేషం :

అధికారుల ప్రోత్చాహంలో ప్రషన్స్ అవకాశాలు వుంటాయి. దూర ప్రయాణాలు చేయకుండ వుండటం మేలు. ఈమాసం ఫలితాలు అంతంత మాత్రంగా వుంటాయి. ఆప్తుల రాకలో ఇంటోలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. చేయవలసిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత మొరుగుపడుతుంది. మాసం మధ్యహానుంది. ఉద్యోగులకు పై అధికారులు వత్తిడి పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన వారితో పరిచయాలు పెరుగుతాయి వ్యాపారయ ఆశించిన లాభాలను పొందుతారు . అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి .దుర్గా ఆరాధన చేయడం మినుములు ద్వారా శుభ ఫలితాలను అందుకుంటారు. శనివారం ఇవ్వటం మంచింది?

horoscope image october month
horoscope image

వృషభం:

ఈ రాశికి ఈ నెల అనుకూలంగా లేదు. ఆరోగ్యం విషయలో డాక్టర్ను కలిసి జాగ్రత్తలు పాటించడం మేలు కుంటుంబ సభ్యులతో మాటపట్టింపులు వస్తాయి. ఆఫ్ఘుల లో అనుకోని విధంగా గొడవలు సంభవించే అవకాశాలు వున్నాయి. వృత్తి, ఉద్యోగాలలో చేపట్టినపనులు నిదానంగా పూర్తి అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు. వ్యాపారంలో నిదానంగా తెలివిగా ఆలోచించడం మంచిది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నెల చివరలో చిన్నప్పటి దూర స్నేహితులనుంచి శుభకార్యాలకు ప్రర్తనాలు పొందుతారు. సుబ్రమణ్య స్వామికి అభిషేకం చేయించటం మంచిది. 1/2 kg కందులు మంగళవారం దానంగా ఇవ్వడం ద్వారా మంచి పంతాలు పొందుతారు ..

మిధునం

ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా అవసరానికి ధన సహాయం అందుకుంటారు, పొరుగువారితో సన్నిహితంగా ఉండటం మేలు, ఉద్యోగంలో ఉన్న గొడవలు పరిష్కారం అవుతాయి, దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి, నెల ప్రారంభంలో శాంతంగా ఉండటం మంచిది. కొత్తగా విలువైన వస్తువులను కొనే ప్రయత్నాలు చేస్తారు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి, సొంత ఆస్తి గొడవలు తగ్గుముఖం పడతాయి, చిన్ననాటి స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు, ఆప్తుల రాకతో ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది, వృత్తి వ్యాపారాలు లాభాన్ని అర్జిస్తాయి, వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి, ఆంజనేయస్వామి ఆరాధన చేసి 11/4kg నల్ల నువ్వులు, శనివారం దానం చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు.

కర్కాటకం

ఈ రాశి వారికి ఈ నెలలో తక్కువ ఫలితాలు ఉంటాయి, కొత్త వాహనాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి, అనుకొని సంఘటన వలన మానసిక ఒత్తిడి అధికమవుతుంది, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మేలు, అన్ని రకాల సమస్యల నుండి బయటపడతారు, అన్ని విషయాలకు ఆందోళన పడకుండా ఉండటం మంచిది. దూరపు చుట్టాల రాకతో సంతోషకరంగా ఉంటుంది, వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు, గృహ నిర్మాణ పనులు చేయబడతారు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది, జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి, నెల చివరన దూర ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది, వ్యాపారాలలో లాభాన్ని అర్ధిస్తాయి, ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం పారాయణం చేసి, సోమవారం గోవుకు పచ్చగడ్డి దానగా పెట్టడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

సింహం

ఆదాయ మార్గాలు అధికంగా ఉంటాయి, ఈ రాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది, కొత్తగా వస్త్రాలు, బంగారం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి, చేయవలసిన పనులు సమయానికి పూర్తిచేస్తారు, సంతానం, విద్యా వంటి విషయాలపై ఆలోచించడం మంచిది. సమాజంలో ప్రముఖుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి, చిన్ననాటి స్నేహితులతో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించి లాభాలను అర్జించే అవకాశాలు ఉన్నాయి, ఆప్తులతో కలిసి దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి, ఇంటి నిర్మాణ పనులకు స్నేహితుల సహాయ, సహకారాలు అందుకుంటారు, ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రోత్సాహంతో ప్రమోషన్స్ వస్తాయి, నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, శివాలయంలో రుద్రాభిషేకం చేసి 11/4kg సెనగలు గురువారం దానం చేయడం ద్వారా శుభ ఫలితాలను అందుకోవచ్చు.

కన్య

ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు, ఆదాయ మార్గాలు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఈ రాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగస్తులకు ధన లాభం వచ్చే సూచనలు ఉన్నాయి, చేయవలసిన పనులు అడ్డంకులు వచ్చి నిదానంగా పూర్తి చేస్తారు, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు, ఇంటి నిర్మాణ పనులు పురోగతిని సాధిస్తాయి, వృత్తి వ్యాపారాలు లాభాన్ని అర్జిస్తాయి. స్నేహితుల రాకతో సంతోషంగా ఉంటుంది, నిరుద్యోగస్తుల ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి, మాసం చివరలో విలువైన వస్తువులను తీసుకోకుండా ఉండటం మేలు, ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది. ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేసి 11/4kg గోధుమలు ఆదివారం దానం ఇవ్వడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు.

తుల

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, వృత్తి, ఉద్యోగాలలో పై అధికారుల తో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి, కోర్టు కేసుల నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి, ఈ రాశి వారికి ఈ నెల లాభసాటిగా ఉంటుంది, చేయవలసిన పనులు సకాలంలో పూర్తి చేశారు, దీర్ఘకాలిక రోగాల నుండి బయటపడతారు, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది, కొత్త వ్యాపారానికి సంబంధించి స్నేహితుల నుండి పెట్టుబడులు పొందుతారు, విద్యార్థులకు పరీక్ష ఫలితాలు సంతోషకరంగా ఉంటాయి. డబ్బులకు సంబంధించిన విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ధైర్యంగా కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు, గణపతి ఆరాధన చేసి మంగళవారం 11/4kg ఉలవలు దానంగా ఇవ్వడం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు.

వృశ్చికం

ఆర్థిక పరిస్థితి లాభసాటిగా ఉంటుంది, చేపట్టిన పనులు త్వరగా పూర్తిచేస్తారు, చేయవలసిన పనులలో విజయం సాధిస్తారు, సంతానం, విద్య, ఉద్యోగాలలో మంచి ఫలితాన్ని పొందుతారు, ఈ రాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది, రుణ ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది, స్నేహితులతో కలిసి దేవుని సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు, దూర ప్రయాణాల వల్ల ప్రతిఫలం ఉంటుంది, కుటుంబంలో ఎటువంటి కలహాలు ఉండవు, కుటుంబంలో ఉండే పెద్దవారి ఆరోగ్య విషయంలో సంతృప్తి చెందుతారు, కొత్త వస్తూ, వస్త్రాలను తీసుకుని అవకాశాలు ఉన్నాయి, అందరికీ సహకరించడం వలన మీ పేరు,ప్రతిష్టలు పెరుగుతాయి, ఉద్యోగస్తులకు పని భారం తగ్గే అవకాశాలు ఉన్నాయి, ఈనెల చివరలో అందరితోనూ జాగ్రత్తగా మెలగడం మంచిది, లక్ష్మీదేవి ఆరాధన చేసి సోమవారం 11/4kg బియ్యం దానంగా ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు.

ధనస్సు

జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవలు సంభవిస్తాయి, ఈ రాశి వారికి ఈనెల అనుకూలంగా ఉండదు, అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి, కుటుంబ సభ్యులతో అనుకొని విధంగా గొడవలు వస్తాయి, ఇంట, బయట జరిగిన సంఘటనల ఆధారంగా మనశ్శాంతి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పెరిగి శ్రమ ఒత్తిడి పెరుగుతుంది, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు, దేవుని సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు, సొంత ఆస్తి గొడవలు తగ్గి ముఖం పట్టి అన్నదమ్ములతో కలిసిమెలిసి ఉంటారు, నెల మధ్యలో విలువైన వస్తువులనుకునే అవకాశాలు ఉన్నాయి, దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారానికి సంబంధించి ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది, ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం మంగళవారం 11/4kg కందులు, శనివారం 11/4kg నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం ద్వారా మంచి ఫలితాన్ని అందుకుంటారు.

మకరం

చేయవలసిన పనులు జాప్యం కలిగి ఆగిపోతాయి, ఈ నెలలో అనుకూలంగా లేదు, ముఖ్యమైన విషయమే విషయమై బంధుమిత్రుల నుండి మాట పట్టింపులు వస్తాయి, నెల చివరన కొత్తగా విలువైన వస్తువులనుకునే అవకాశాలు ఉన్నాయి, ఇతరులతో సన్నిహితంగా ఉండటం మంచిది. భార్యా,భర్తల మధ్య చిన్నపాటి గొడవలు సంభవిస్తాయి, సంతానం, విద్యా వంటి విషయాలలో కచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటారు, వృత్తి, వ్యాపారాలలో ఇతరుల ఆలోచనలను అనుసరించడం మంచిది. ఉద్యోగాలలో ట్రాన్స్ఫర్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు అంతంతమాత్రంగా ఉంటాయి, ఉద్యోగ ప్రయత్నాలు పలుస్తాయి, రుణ ఒత్తిడి అధికమవుతుంది, శనీశ్వర స్వామికి తైలాభిషేకం చేయించి హనుమాన్ ఆరాధన చేసి శనివారం నల్ల నువ్వులు 11/4kg దానంగా ఇవ్వడం వలన ఆశించిన ఫలితాలను పొందుతారు.

కుంభం

వ్యాపారానికి సంబంధించిన పనులు మందకోడిగా సాగుతాయి, ఉద్యోగాలలో శ్రమ, ఒత్తిడి పెరిగి నిద్రాహారాలు ఉండవు. ఈనెల గ్రహ సంచారం అనుకూలంగా ఉండదు, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది, సంతానం, విద్యా విషయాలలో సంతోషకరంగా ఉంటుంది, మీ శత్రువులతో జాగ్రత్త వ్యవహరించడం మంచిది. అందరినీ ఎక్కువ నమ్మకుండా ఉండడం చాలా మేలు, నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు, రుణం ఇచ్చిన వారి నుండి ఒత్తిడి పెరుగుతుంది, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండటం మంచిది, బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు, నెల చివరలో ఇంటిని కొనే ప్రయత్నాలు ఫలించవు, శని స్తోత్రం పారాయణం చేసే శనివారం 11/4kg శనగలు దానం చేయడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు.

మీనం

సమాజంలో మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి, చాలా కాలం నుండి ఉండే అనారోగ్య సమస్యలు తగ్గి ముఖం పడతాయి, సమాజంలో ప్రముఖుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, ఈ రాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది, కొత్త వ్యాపారాలు ప్రారంభించి లాభాలను అర్జిస్తారు, కుటుంబంతో కలిసి దేవాలయాలను సందర్శిస్తారు, ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది, ఉద్యోగస్తులకు తగిన ప్రతిఫలం లభిస్తుంది, ప్రయాణాలు లాభసాటిగా ఉండే అవకాశాలు ఉన్నాయి, కచ్చితంగా

నిర్ణయాలు తీసుకొని సమస్యలను అధిగమిస్తారు, అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది, విలువైన వాటిని కొనుగోలు చేస్తారు, చిన్ననాటి స్నేహితులతో సంతోషంగా గడుపుతారు, గురువారం సెనగలు 11/4kg దానం ఇచ్చి, దుర్గాదేవిని ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker