Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

Horoscope: ఈ వారం అనుకూలంగా లేక ఇబ్బంది పడే రాశులు

Horoscope: ఈవారం అనుకూలంగా లేక ఇబ్బంది పడే రాశులలో మీది ఏ రాశి తెలుసుకోండి.

మేషం:

ఈవారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార, వృత్తి, విషయాలలో ఆశించిన లాభాలను పొందుతారు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. సొంత ఆస్తి వివాదాలు తగ్గుముఖం పడతాయి, ఇంటి నిర్మాణ పనులు చేపడతారు, కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. వారం మధ్యలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రముఖుల పరిచయాలు లాభాలతో కూడుకొని ఉంటాయి. నవగ్రహ ధ్యానం శ్లోకం పారాయణం చేయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు.

వృషభం:

ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. ఆర్థిక పరిస్థితి, వృత్తి, ఉద్యోగాలలో నిరాశ తప్పదు. ఇంట, బయట పరిస్థితులు అనుకూలించవు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. వారం మధ్యలో పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. చేయవలసిన పనులు సకాలంలో పూర్తికావు. కుటుంబంతో కలిసి దేవాలయాలను దర్శించుకుంటారు. లక్ష్మీనరసింహ స్తోత్రం పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలను అందుతాయి.

మిధునం:

ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక, వ్యాపారం, వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన లాభాలను అర్జిస్తాయి. ఇంటి, వాహనం కొనుగోలు ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. చిన్నప్పటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మేలు. వారం చివరలో అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. చేయవలసిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి విభేదాలు తొలగిపోతాయి. ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు.

Horoscope
Horoscope

కర్కాటకం:

ఈవారం ఈ రాశి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ,ఉద్యోగ, వ్యాపార, వృత్తి, సంతానం, విద్య విషయాలలో సంతృప్తికరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ఆరోగ్య విషయంపై వైద్యుల సూచనలను పాటించడం మంచిది. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. గృహ నిర్మాణ పనులు చేపడతారు. చేయవలసిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దేవుని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆప్తులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు.

సింహం:

ఈ రాశి వారికి ఊహించని విధంగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ,ఉద్యోగ ,వ్యాపారం, విద్యా విషయాలలో ఆశించిన విధంగా లాభాలను పొందుతారు. స్నేహితులతో సంతోషంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారం మధ్యలో ఆస్తి వివాదాలు తప్పవు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఇంటిలో శుభకార్యాలు జరిపే అవకాశాలు ఉన్నాయి. నూతన వాహనం, బంగారు కొనే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. సుబ్రమణ్య కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందగలుగుతారు.

కన్య:

ఈ రాశి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, వృత్తి, వ్యాపారం, విద్య, ఆర్థిక విషయాలలో అనుకూలంగా ఉంటుంది. గృహ నిర్మాణ పనులు చేపడతారు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. చేయవలసిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఇంట, బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు.

తుల:

ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారం, విద్యా, సంతానం, ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. చిన్నప్పటి స్నేహితులను కలుసుకొని సంతోషంగా గడుపుతారు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. గృహ నిర్మాణ పనులు చేపడతారు. ధన వ్యవహారాలతో జాగ్రత్తగా ఉండడం మంచిది. వారం మొదటిలో ఆస్తి గొడవలు తప్పవు. వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం

పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు.

వృశ్చికం:

ఈ రాశి వారికి కొంతమేర అనుకూలంగా ఉంటుంది. వారం ప్రారంభంలో కుటుంబంలో చిన్నపాటి గొడవలు తప్పవు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో లాభాలు పొందుతారు. చేయవలసిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. విద్యార్థులకు విద్యా విషయంలో సంతోషకరంగా ఉంటుంది. ఇంటిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. దేవాలయాలను దర్శిస్తారు. అనుకోని విధంగా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. రాజరాజేశ్వర స్తోత్రం పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు.

ధనస్సు:

ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార, వృత్తి, విషయాలలో అనుకూలంగా ఉంటుంది. వారం మధ్య ధన విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. చిన్నప్పటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. చేయాల్సిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో చిన్న గొడవలు తప్పవు. రామరక్షా స్తోత్రం పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.

మకరం:

ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార, వృత్తి ,విద్య, విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. చేపట్టిన పనులు త్వరగా పూర్తిచేస్తారు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. నూతన గృహ, వాహనం కొనుగోలు చేస్తారు. వారం చివరలో కుటుంబంలో చిన్నపాటి గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లక్ష్మీ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు.

కుంభం:

ఈవారం ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక విషయాలలో అంతంత మాత్రమే లాభాలను పొందుతారు. వారం మొదట చుట్టాలతో గొడవలు తప్పవు. రాజకీయాలలో ఉన్న వారికి మంచి ఆహ్వానాలు అందుతాయి. నూతనంగా వాహనం కొనుగోలు చేస్తారు. అన్ని రంగాల వారికి కొంతమేర అనుకూలిస్తుంది. మీకు అందవలసిన డబ్బు అందడం ద్వారా అవసరాలు తీర్చుకుంటారు. దత్త పంజరస్తోత్రం పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు.

మీనం:

ఈ రాశి వారికి కొంత అనుకూలంగానే ఉంటుంది. చేయవలసిన పనులు త్వరగా పూర్తికావు. వృత్తి, ఉద్యోగాలలో, వ్యాపారాలలో కొంతమేర సంతృప్తికరంగా ఉంటుంది. దేవాలయం దర్శించుకుంటారు. వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. అన్ని రంగాల వారికి కొంతమేర అనుకూలంగా ఉంటుంది. స్థిర ఆస్తి గొడవలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker