Bharat Bandh: ఈనెల 27న భారత్ బంద్

మోడీ ప్రభుత్వ నిరంకుశ విధానాలను నిరసిస్తూ ఈనెల 27న భారత్ బంద్

విజయవాడ : మోడీ ప్రభుత్వ నిరంకుశ విధానాలను నిరసిస్తూ ఈనెల 27న భారత్ బంద్.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా జూమ్ ద్వారా ఆన్ లైన్ బహిరంగ సభ.

పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా. సాకే శైలజనాథ్, సీపీఏం, టిడిపి మరియు ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు.

ఏపీసీసీ అధ్యక్షులు డా సాకే శైలజనాధ్ కామెంట్స్

★ సెప్టెంబరు 27 భారత్ బంద్ జయప్రదం చేయాలి

★ బిజెపి ప్రభుత్వం తక్షణమే వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

★ రాష్ట్రంలో విశాఖ ఉక్కు , ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుందని, తక్షణమే ప్రైవేటీకరణ ను నిలుపుదల చేయాలన్నారు.

★ మోడీ పాలనలో మహిళలు, గిరిజనులు, దళితులపై దాడులు పెరిగాయన్నారు.

★ ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు.

★ పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలన్నారు

★ కార్మికులకు ఉపాధి హామీ క్రింద 200 పని దినాలు కల్పించాలన్నారు.

★ *ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలకు నిరసనగా ఈ నెల 27వ తేదీన రైతు సంఘాల కార్యాచరణ సమితి ఇచ్చిన దేశవ్యాప్త బంద్ పిలుపును జయప్రదం చేయాలని శైలజనాధ్ కాంగ్రెస్ శ్రేణులకు మరియు సమితి నాయకులకు విజ్ఞప్తి చేశారు.