Gujarat Suspension Bridge: గుజరాత్ కేబుల్ బ్రిడ్జ్ ఘటన పై మోడీ సమీక్ష

Gujarat Suspension Bridge: గుజరాత్ లో మోర్బీ పట్టణంలోని బ్రిటిష్ కాలం నాటికి చెందిన వంతెన కూలిపోయిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవంబర్ ఒకటో తేదీన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గుజరాత్ చేరుకున్న ఆయన మంగళవారం ఉదయం..

గుజరాత్ లో మోర్బీ పట్టణంలోని బ్రిటిష్ కాలం నాటికి చెందిన వేలాడే వంతెన కూలిన ఘటనపై ప్రధాని మోడీ నవంబర్ ఒకటో తేదీన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించడం జరిగింది. గుజరాత్ చేరుకున్న ఆయన మంగళవారం ఉదయం గాంధీనగర్ లో రాజ్ భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి కి ఈ ఘటనకు గల కారణాలతో పాటు, అందిస్తున్న సహాయక చర్యల గురించి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఘటనలో మృతి చెందిన కుటుంబాలతో పాటు, క్షతగాత్రుల కుటుంబాలకు అన్ని విధాలా సహాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.

గుజరాత్ లో మోర్బీ పట్టణంలోని బ్రిటిష్ కాలం నాటికి చెందిన వంత
గుజరాత్ కేబుల్ బ్రిడ్జ్ ఘటన పై మోడీ సమీక్ష

దుర్ఘటనకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. బాధితులకు అన్ని విధాలగా అండగా ఉంటామని చెప్పారు. ఈ ఉన్నత స్థాయి సమావేశానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్, హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి, గుజరాత్ చీఫ్ సెక్రటరీ, డీజీపీతో పాటు రాష్ట్ర హోం శాఖ మంత్రి, గుజరాత్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అధికారులతో సహా ఇతర ముఖ్యమైన ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సౌరాష్ట్ర ప్రాంతంలోని మోర్బీ పట్టణంలోని బ్రిటిష్ కాలం నాటికి చెందిన వేలాడే వంతెన ఆదివారం సాయంత్రం కూలిపోవడంతో దాదాపు 134 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది నదిలో గల్లంతయ్యారు. ఈ క్రమంలోనే ప్రదానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఉదయం మోర్బీని సందర్శించారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సాంకేతిక, నిర్మాణ లోపాలు, కొన్ని నిర్వహణ సమస్యల వల్లే ఈ దుర్ఘటనకు ప్రాథమిక కారణమని ప్రాథమికంగా జరిపిన దర్యాప్తులో తేలింది. ధృవీకరణ లేకపోవడంతో పాటు కొన్ని నిర్వహణ సమస్యలతో సహా సాంకేతిక, నిర్మాణ లోపాలు ఈ విషాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో నిరూపణ జరిగింది.

అని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. మోర్బి వంతెన కూలిపోవడంపై సోమవారం అర్థరాత్రి జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షత వహించారు.

Show More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker