గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్…

గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్…

Gujarat: గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్ ఎంపికయ్యారు. ఇవాళ సమావేశం అయినా BJP శాసనసభా పక్షం ఈ మేరకు భూపేంద్ర పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది.

ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా విచ్చేసిన తోమర్, ప్రహ్లాద్ జోషి సమక్షంలో సిఎం ఎంపిక జరిగింది. గవర్నర్ ను కలిసిన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని భూపేంద్ర పటేల్ కోరనున్నారు. ఆయన ప్రస్తుతం ఘట్లోడియా నియోజకవర్గం నుంచి MLA గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటివరకు సీఎం గా ఉన్న విజయ రూపాన్ని నిన్న గవర్నర్ కు రాజీనామా లేఖను అందజేసిన విషయం తెలిసిందే. వచ్చే శాసనసభ ఎన్నికలలో భాజపాను విజయతీరాలకు చేర్చే లక్ష్యంగా పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి మార్పును చేపట్టింది. CM పీఠాన్ని పటేళ్ల సామాజిక వర్గానికి ఇవ్వాలని, పార్టీ అధిష్టానం నిర్ణయించడంతో అనూహ్యంగా భూపేంద్ర పేరు తెరపైకి వచ్చింది.