జనసేన అదినేత పవన్ కళ్యాణ్ రహదారులు అన్ని చాలా అధ్వాన్నంగా ఉన్నాయి

రాష్ట్రంలో రహదారులు అన్ని చాలా అధ్వాన్నంగా ఉన్నాయి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం కోసం ఆందోళన చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్ జనసేన కార్యాలయం నుంచి ఆయన వర్చువల్ ద్వారా మాట్లాడారు.

https://telugu.thefinexpress.com/wp-content/uploads/2021/09/VID-20210901-WA0002.mp4

రాష్ట్రంలో సుమారు లక్షా ఇరవై వేల కిలో మీటర్ల మేర రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయి అని పేర్కొన్నారు. రోడ్లపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారు అని చెప్పారు. రోడ్ల కు సంబంధించి ఈనెల 2, 3, 4 తేదీల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ రెండో తేదీన గాంధీ జయతి రోజున రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఆందోళనలో తాను కూడా పాల్గొంటానని పవన్ కల్యాణ్ వెల్లడించారు….