ఆంధ్రప్రదేశ్ రాజధాని ని తేల్చేసిన కేంద్రం
Visakhapatnam: వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. 3 రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి తెచ్చింది. వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నది రాష్ట్రప్రభుత్వ ఆలోచన. ఈ దిశగా అడుగులు కూడా పడ్డాయి. కానీ, కొన్ని న్యాయపరమైన సమస్యలు ఎదురవడంతో.. వాటిని క్లియర్ చేసుకునే పని కొనసాగుతోంది.ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖపట్నానికి తీసుకెళ్తామంటూ తరచూ చెప్తున్నారు పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ. అయితే టిడిపి నేతలు వివిధ దశల్లో వ్యతిరేకతను వ్యక్తం చేస్తోంది.
3 రాజధానుల, ప్రకటనలో భాగంగా- రాయలసీమ ప్రాంతంలోని కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయించాలనేది జగన్ సర్కార్ కాన్సెప్ట్. అమరావతిని, చట్టసభల క్యాపిటల్ గా కొనసాగిస్తూ.. సాగర నగరం విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే జ్యుడీషియల్ అధికారాలు, కలిగి ఉన్న మానవ హక్కుల కమిషన్‌ను న్యాయ రాజధాని కర్నూలుకు తరలించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది.
అయితే, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అంశానికి సంబంధించి తాజాగా కొత్త అలజడి రేగింది. వివిధ రాష్ట్రాల్లో డీజిల్, పెట్రోల్, రేట్లు లు ఎలాగున్నాయంటూ పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల అడిగిన ప్రశ్నకు సెంట్రల్ పెట్రోలియం అండ్ గ్యాస్ మంత్రిత్వశాఖ లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చింది. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ ఇచ్చిన వివరణలో ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా విశాఖపట్నం ను పేర్కొంది. కేంద్ర పెట్రోలియం మరియు గ్యాస్ మంత్రిత్వశాఖ పేరుతో విడుదలైన ఈ డాక్యుమెంట్ ఇప్పుడు హైలెట్ గా మారింది. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని గా వైజాగ్ ను చూపడంతో సెంట్రల్ గవర్నమెంట్ అధికారికంగా గుర్తించిందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అటు పరిపాలన రాజధాని, ఇటు న్యాయ రాజధానిలో ఒకేసారి కార్యకలాపాలను సాగించాల ఉద్దేశం ప్రభుత్వ పెద్దల్లో కనిపిస్తోన్నట్లు తెలుస్తోంది. ఒకేసారి 3 రాజధానుల్లో పరిపాలన సాగించేలా ఏర్పాట్లు చేస్తోన్నట్లు చెబుతున్నారు. అమరావతి ప్రాంతంలోని సచివాలయాన్ని విశాఖపట్నానికి.. కర్నూలుకు ఏపీ హైకోర్టు, ఒకేసారి తరలించేలా మాస్టర్‌ప్లాన్‌ను జగన్ సర్కార్ రూపొందించిందని, దానికి అనుగుణంగా చర్యలు చేపట్టిందని సమాచారం. ఒకేసారి తరలింపు ప్రక్రియ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తుందనే వాదన ఉంది
వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ క్యాపిటల్ అనే దానిపై మాకు గాని, మా ప్రభుత్వానికి గాని, ప్రజలకు గాని ఎలాంటి అనుమానం లేదంటూ సంచలన కామెంట్స్ చేశారు..