ASHA workers demand: ఆశా కార్యకర్తలు పర్మినెంట్ చేయాలి
ఆశా కార్యకర్తలు పర్మినెంట్ చేయాలి: సి ఐ టి యు
గ్రామాలలోని ఆశా కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉచిత సేవ చేస్తున్నారని సి ఐ టి యు రాప్తాడు మండల అధ్యక్షులు పోతులయ్య తెలియజేశారు. ఆశా కార్యకర్తలు పర్మినెంట్ చేయాలని, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం జీతాలు చెల్లించాలని, డిమాండ్ చేస్తూ మంగళవారం రాప్తాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని డాక్టర్ శ్రావణికి ఆశా కార్యకర్తలు, సిఐటియు నాయకులు కలిసి వినతిపత్రాన్ని అందించారు.
ఈ సంధర్భంగా మాట్లాడుతూ ఆశాలను వర్మినెంట్ చేయాలని, భీమా సౌకర్యం కల్పించాలని, సంక్షేమ పథకాలు, రిటైరెంట్ మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ఆశాలను సచివాలయాలకు బదలాయింపు ఆపాలన్నారు. ఆశా వర్కర్స్ ను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం నెలకి రూ. 21000/-లు చెల్లించాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించిన తరువాతే రిటైర్మెంట్ చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. గత 14 సంవత్సరాలుగా పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వం వీరి సేవలను గుర్తించి, కార్మికలుగా గుర్తించాలన్నారు.
పి.హెచ్.సి.ల నుండి వ్యాక్సిన్ తెచ్చే పని నుండి ఆశాలను మినహాయించాలని తెలియజేశారు. 10 వేల గౌరవ వేతనం ఒకేసారి ఇవ్వాలి.నాణ్యమైన యూనిఫామ్ ఇవ్వాలి. జనాభా ప్రాతిపదికన1000-1200 జనాకు ఒక ఆశా వర్కరును నియమించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు గాయత్రి విజయలక్ష్మి నాగవేణి ఇందిరమ్మ శివలక్ష్మి సావిత్రి జయశ్రీ నారాయణమ్మ ఓబులమ్మ వరలక్ష్మి అరుణ నాగమణి రామలింగమ్మ అరుణ తదితరులు పాల్గొన్నారు.