Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

Life partner: జీవిత భాగస్వామి చెప్పేది నిజమా, కాదో, తెలుసుకోవాలంటే

Life partner: జీవిత భాగస్వామి చెప్పేది నిజమా, కాదాతెలుసుకోవాలంటే మీరు చేయవలసిన పని ఇదే. వెయ్యి అబద్దాలు చెప్పి మరి ఒక పెళ్లి చేయాలి అని పెద్దలు అంటుంటారు. పెళ్లి జరిగితే ఇద్దరూ ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకుంటారు. అందువల్ల ఎటువంటి సమస్యలు రావు. కాలం గడుస్తున్న కొద్ది సర్దుకుపోతారని అనుకుంటారు. కానీ నిజానికి పెళ్లయిన తర్వాత భార్యాభర్తలలో ఎవరైనా అబద్ధం చెబితే అవి వారి మధ్య ఉన్న బంధానికి ప్రమాదంగా మారుతాయి. చాలా శాతం మంది వారి భాగస్వామి దగ్గర కొన్ని విషయాలను చెప్పకుండా దాసి ఉంచుతారు.

బయట చేసిన పనికి కారణం ఒకటైతే, ఇంట్లో దానికి సంబంధించి వేరే కారణాలు చెబుతారు. ఇలా చేయడం ఒకటి లేదా రెండు మూడు సార్లు అయితే అందువల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ అదే పద్ధతిగా ప్రతిసారి చేస్తే వారిపై అనుమాన పడాల్సి వస్తుంది. ఒక రకంగా చూస్తే దీనిని మోసం చేయడం అని కూడా అనవచ్చు. ఇలా అబద్ధాలు చెప్పేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, నిజం బయట పెట్టకుండా ఉంటారు. అలాంటి వారిని పట్టుకోవడం కోసం కొన్ని మార్గాలు ఉన్నాయి. వీటి ద్వారా మీ జీవిత భాగస్వామి నిజం చెబుతున్నారా లేదా తొందరగా కనిపెట్టవచ్చు.

Life partner జీవిత భాగస్వామి చెప్పేది నిజమా, కాదో, తెలుసుకోవాలంటే
Life partner

మీరు అడిగిన ప్రశ్నకు వేరువేరు సమాధానాలు చెప్పటం:

రోజు ఇంటికి తొందరగా వచ్చేవారు, కొన్ని రోజుల నుంచి ఇంటికి లేటుగా వస్తే ఏమైంది? ఎందుకు? లేటుగా వస్తున్నారని ప్రశ్నిస్తే, బైక్ పాడైందని, ఫ్రెండ్స్ కలిస్తే మాట్లాడి వచ్చానని, లేక ఆఫీసులో పని ఎక్కువగా ఉండటం వల్ల లేట్ అయిందని కారణాలు చెబుతారు. నిజానికి అక్కడ పర్సనల్గా కలుసుకొని వచ్చి దానిని కవర్ చేయడానికి ఇలా అబద్ధాలు చెబుతారు. అలాంటి వారిని పట్టుకోవడానికి ఒక ఉపాయం ఉంది.

మొదటిసారి అడిగినప్పుడు సమాధానం వచ్చిన తర్వాత సరే అని చెప్పి ఆ విషయాన్ని విడిచిపెట్టి అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోవాలి. ఇలా చేయడం ద్వారా అనుమానం రాలేదని రిలాక్స్ అవుతారు. తర్వాత కొంత సమయం గడిచిపోయాక మళ్ళీ వెళ్లి అడగాలి ఇలా చాలామంది అడిగినప్పుడు 90% వేరే జవాబులు ఇస్తారు. అందువలన ఒకటే ప్రశ్నకు మళ్ళీ వేరే సమాధానం ఇస్తారు. ఇలా వేరు వేరు సమాధానాలు చెప్పడం వల్ల అబద్ధం చెబుతున్నారని మనం నిర్ధారించుకోవచ్చు.

Read Also: సులువైన పద్ధతి ద్వారా డబ్బును  సంపాదించాలి అనుకుంటున్నారా?

2. సరిగ్గా మాట్లాడకుండా ఉండటం:

భార్యాభర్తలు అంటే అన్నిటిని మనసు విప్పి మాట్లాడుకోవడం. ఇలా ఉండకుండా తప్పించుకొని తిరగటం, అన్యోన్యంగా ఉండకపోవడం, అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఉండడం, తనకు సంబంధించిన ఏ విషయం గురించైనా చెప్పకుండా ఉండటం, తల్లి తండ్రి అంటూ భాగస్వామికి సంబంధించిన వాటిని పట్టించుకోకుండా ఉండటం, వారి ప్రవర్తనలో మార్పులు రావటం లాంటివి గమనిస్తే వారు అబద్ధాలు చెబుతూ, ఏదో విషయాన్ని మనకు తెలియకుండా దాచుతున్నారని నిర్ధారణ చేసుకోవచ్చు.

3. మనం అడిగిన ప్రశ్నకు ఎదురు ప్రశ్నలు వేయడం:

చాలామంది వ్యక్తులు తమను తాము రక్షించుకోవడం కోసం ఏదైనా ప్రశ్నలు అడిగినప్పుడు వాటికి సమాధానం చెప్పకుండా తిరిగి మనలానే ఎదురు ప్రశ్నలు వేస్తారు. అప్పుడు వారు ఏదో తప్పు చేస్తున్నారని విషయాన్ని గుర్తించాలి. మామూలుగా మనం ఏ విషయం గురించి అయినా ఎక్కువగా బలవంత పెట్టి అడిగినప్పుడు, వారు తిరిగి మనల్ని ప్రశ్నించి వారి వైపు తప్పు ఉన్న కానీ మనల్ని దోషుల్ని చేస్తారు దీనికి కారణం మీరే అని బాధపడటం జరుగుతుంది. నిజానికి అది మీ తప్పు కాదు. మీరు ప్రశ్నించినందుకు ఏ సమాధానం చెప్పాలో తెలియక ఇలా చేశారని తెలుసుకోవాలి.

4. చేసిన తప్పును బయటపడకుండా ఉంచే ప్రయత్నం చేయడం:

మీరు అడిగిన ప్రశ్న చిన్నది అయినప్పటికీ అవతలి వారు చెప్పే సమాధానం పెద్దపెద్ద అర్థాలు వచ్చే విధంగా ఉంటుంది. ఇలా చేయడం తమ తప్పులను, వారి ప్రవర్తనలను బయట పెట్టకుండా ఉంచేందుకు చేసే ప్రయత్నం అని తెలుసుకొని వారు అబద్ధం చెబుతున్నారని నిర్ధారణ చేసుకోవాలి. అలాంటి సమాధానాలు చెప్పేటప్పుడు వారు కొంచెం తడబడటం, ఆలోచనలలో ఉండటం మనం గుర్తించవచ్చు.

5. చిన్న విషయాలకు ఎక్కువగా కోపగించుకోవడం:

కొందరు ప్రతి చిన్న విషయానికి భయపడి ఎక్కడ తమ తప్పు బయటపడుతుందేమో అని పైకి కోపం ప్రదర్శిస్తారు. కోపంగా మాట్లాడుతూ గొడవలు ఎందుకు అనే కారణంగా మాట్లాడడం వల్ల, అవతలి వారు వెంటనే ఆ విషయాన్ని మధ్యలో ఆపేస్తారు. దానివల్ల వారికి సమాధానం చెప్పకుండా తప్పించుకోవచ్చు. ఏది అడిగినా వెంటనే కోపం చూపించే వారిపై చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వారి విషయంలో చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.

6. అడిగిన ప్రశ్నను పక్కన పెట్టి వేరే దాని గురించి మాట్లాడటం:

ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు, దానిని విడిచి వేరే టాపిక్ మాట్లాడడం కొందరికి వెన్నతో పెట్టిన విద్యలా ఉంటుంది. ఇలా చేయడం అనేది దాని గురించి మాట్లాడే ఉద్దేశం లేదని అని అర్థం చేసుకోవాలి. ఆ విషయం గురించి మాట్లాడే ఉద్దేశం లేకపోతే వేరే అందమైన కథలు చెప్పటం, ఇంట్రెస్ట్ గా ఉండే విషయాలను గురించి మాట్లాడటం, మిమ్మల్ని పొగడటం అవసరంలేని విషయాలను పదేపదే చెప్పటం. చెప్పవలసిన విషయాన్ని పూర్తిగా పక్కకు పెట్టేసి ఈ విధంగా చేయడానికి గురించి వారు అబద్ధం చెబుతున్నారని, తమ దగ్గర ఏదో దాస్తున్నారని నిర్ధారించుకోవచ్చు.

7. జీవిత భాగస్వామి ప్రవర్తనను గమనించడం:

ఏమీ లేనట్టుగానే వారితో మాట్లాడుతూ, వారి శారీరక ప్రవర్తన వల్ల వారు తప్పు చేస్తున్నారా లేదా అనే విషయాన్ని మనం గుర్తించవచ్చు. వారు చూసే చూపులు కంగారుగా ఉండటం, ముఖంలో ఆందోళన, భుజాలను కలుపుతూ ఉండడం, చేతులను పదేపదే నలుపుకుంటూ ఉండటం, ఎక్కువగా చమటలు పడటం, ఉన్న స్థలంలో కుదురుగా కూర్చో లేకపోవడం వంటి వాటి ద్వారా కూడా వీరు అబద్ధం చెబుతున్నారని తెలుసుకోవచ్చు.

8. వ్యక్తిగత విషయాన్ని దాచే ప్రయత్నం చేయడం:

వ్యక్తి ఒక కథ విషయం జీవిత భాగస్వామికి తెలియకుండా ఉంచాలి అనుకునేవారు, వారి విషయాలను చాలా సీక్రెట్ గా ఉంచుతారు. ఫోన్ లాక్ చెప్పకుండా ఉండటం. ఫోన్ వచ్చినప్పుడు మీకు వినపడకుండా, దూరంగా వెళ్లి మాట్లాడటం ఫోన్లో, లాప్టాప్ లలో వారి విషయాలను తెలియకుండా పాస్వర్డ్ పెట్టుకోవడం లాంటివి చేస్తారు. ఈ విధంగా చేయడం అంటే కచ్చితంగా ఏదో విషయం దాచిపెడుతున్నారని అర్థం చేసుకోవాలి.

9. మీతో ఇష్టంగా మాట్లాడకుండా ఉండటం:

ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు చాలా తక్కువ పదాలతో సమాధానం చెప్పటం. సరదాగా మాట్లాడాలి అనుకున్నప్పుడు ఇంట్రెస్ట్ లేకుండా తన పని ఏదో అది చూసుకోవడం. మీరు మాట్లాడాలి అని అంటే ముఖ్యమైన పనిలో ఉన్నట్టుగా చెప్పటం. ఇలా ప్రవర్తిస్తే ఖచ్చితంగా అనుమాన పడాల్సిందే. ఎందుకంటే ఎక్కడ నిజం బయటపడుతుందేమోనన్న భయంతో జీవిత భాగస్వామికి దూరంగా ఉంటున్నారని తెలుసుకోవచ్చు.

మీ జీవిత భాగస్వామి ఇలా చేస్తున్నప్పుడు మీరు చేయవలసిన పని:

  • ఈ విధంగా ప్రవర్తిస్తున్నట్లయితే వారు ఎందుకు ఇలాచేస్తున్నారు అనే దానిని గురించి ఓపికగా ఆలోచించాలి.
  • అలాగే వారితో మాట్లాడేటప్పుడు నిదానంగా మాట్లాడాలి. దేని గురించి త్వరగా డిసైడ్ చేసుకోకూడదు.
  • వారు చెప్పినది పూర్తిగా విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని తెలియజేయాలి.
  • సందర్భాన్ని బట్టి మాత్రమే ఏ విషయం గురించి అయినా అడిగి తెలుసుకోవాలి.
  • ఈ విధంగా చేయడం ద్వారా వారు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు.
  • అబద్ధం చెబుతున్నారని అర్థం అయినప్పుడు  దాచి పెట్టే పనులు ఏవి చేయకూడదు.
  • కొన్ని విషయాలను దీర్ఘంగా ఆలోచిస్తే తప్ప అర్థం కావు, ఎలాంటి ఎమోషన్స్నో దగ్గరికి రానివ్వకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
  • భార్య భర్తల బంధం విషయంలో ఎలాంటి కఠిన నిర్ణయాలు అయినా తీసుకోవాల్సి ఉంటుంది.అందువల్ల ఎవరి సంపాదన వారికి అత్యవసరం.

జీవిత భాగస్వామి విషయంలో పైన చెప్పిన అన్ని విషయాలు కాకపోయినా కొన్ని నిర్ధారణ అయిన,వారి ప్రవర్తనలో తేడాలు ఉన్న, మీకు వారికి మధ్య దూరం పెరిగిన,కచ్చితంగా మీరు సమస్యలలో ఉన్నట్లే అందుకే చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker