తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు నరేష్. ఇతను విజయనిర్మలకు మొదటి సంతానంగా 1963 జనవరి 20న జన్మించాడు.ఇతని పూర్తి పేరు విజయకృష్ణ నరేష్. ఇతడు 1970 నుండి బాలనటుడిగా సినిమాలలో నటిస్తున్నాడు. సుమారు 200 పైగా చిత్రాలలో నటించాడు. 1983లో వచ్చిన రెండు జడల సీత, శ్రీవారికి ప్రేమలేఖ,కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ గ్రూప్, బావ బావ పన్నీరు,జంబలకడిపంబ లాంటి సినిమాలలో ప్రధాన నటుడిగా నటించి ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సినీ పరిశ్రమలో ఏర్పరచుకున్నాడు.
పవిత్రతో పరిచయం.
నరేష్ వివాహ వ్యవహారం:
సినిమా విషయంలో విజయవంతమైన నరేష్ వివాహ విషయంలో విజయవంతం కాలేకపోయాడు ఇప్పటికే మూడు వివాహాలు చేసుకున్న నరేష్ తాజాగా ప్రముఖ సినీనటి పవిత్ర లోకేష్ తో సానిహిత్యంగా ఉండడం తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారి తీసింది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ డాన్స్ మాస్టర్ శ్రీను కూతురును నరేష్ మొదటి వివాహం చేసుకున్నాడు. వారికి విజయ్ కృష్ణ నరేష్ అనే ఒక కుమారుడు కలడు. రేఖా శాస్త్రి అనే ఆమెను రెండవ వివాహం చేసుకున్నాడు. వారికి రణబీర్ అనే కుమారుడు కలడు. ప్రముఖ కాంగ్రెస్ నాయకుడైన రఘువీరా రెడ్డి తమ్ముడి కుమార్తె రమ్యను నరేష్ మూడో వివాహం చేసుకున్నాడు. వారికి తేజేశ్వన్ అనే కుమారుడు గలడు.
నరేష్ కు పవిత్రకు ఐదు సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఆ స్నేహంతోనే వారు త్వరలో వివాహం చేసుకోబోతున్నారంటూ సినీ పరిశ్రమలో చర్చించుకుంటున్నారు ఈ క్రమంలో మైసూర్ లోని హోటల్లో పవిత్ర లోకేష్,నరేష్ లో ఉన్నారన్న విషయం తెలుసుకున్న నరేష్ మూడో భార్య రమ్య అక్కడికి చేరుకుని వారిపై దాడి చేసింది.
పోలీసుల సహాయంతో నరేష్, పవిత్ర అక్కడి నుండి బయలుదేరి వెళ్లారు. తర్వాత పవిత్ర మీడియాతో మాట్లాడి తనకు పెళ్లి అయిందని భర్త సురేంద్ర ప్రసాద్తో ఉన్నానని నాపై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని, మాది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే అని మమ్మల్ని కావాలనే రమ్య బ్యాడ్ చేయాలని చూస్తుందని అన్నారు. ఈ వ్యవహారంతో పవిత్ర లోకేష్ కు ఊహించని ఎదుటి దెబ్బలు తగిలాయని రెండు పెద్ద సినిమాల్లో ఆమెను తల్లి పాత్రల నుంచి తొలగించారని సినీ పరిశ్రమలో విస్తృత ప్రచారం జరుగుతుంది