అమరావతి రాజధాని అంటూ నిన్న మొన్నటి వరకు విజయవాడ గుంటూరు కేంద్రంగా నడిచిన రాజకీయం ఇప్పుడు విశాఖ కు షిఫ్ట్ అయింది. వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ నుంచి ఉద్యమ కార్యాచరణ మొదలవుతుంది. అటు జనసేననీ రోడ్ షో కూడా ఉంది.
జనసేన కూడా నేడు విశాఖలో జనవాని కార్యక్రమాన్ని చేపట్టింది. ఇటు టిడిపి ప్రత్యేక నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. పవన్ కళ్యాణ్ మూడు రోజులపాటు విశాఖలో పర్యటించేందుకు ప్లాన్ రెడీ చేశారు. విశాఖపట్నం సమయంలో పవన్ రోడ్డు షో నిర్వహిస్తున్నారు. గర్జన ఎందుకు అంటూ అధికార వైసిపికి 20కి పైగా ప్రశ్నలు సంధించారు. జిల్లాల నుంచి ప్రజా సమస్యలపై వచ్చే వినూతులను పవన్ కళ్యాణ్ గారు నేరుగా స్వీకరిస్తారు. 17న ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం శ్రీకాకుళం జిల్లాల నాయకులతో సమావేశం అవుతారు. ఈ సమావేశాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు జనసేననీ పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు.
విశాఖ గర్జనను విజయవంతం చేసేందుకు వైసిపి ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. రాష్ట్రానికి అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయానికి వ్యతిరేకిస్తున్న టిడిపి…మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం రాష్ట్రంలోని పార్టీ ప్రముఖులతో పాటు మేధావులను కూడా విశాఖకు ఆహ్వానించింది. ఉత్తరాంధ్రకు వైసిపి ప్రభుత్వం మూడేళ్లలో ఏం చేయలేదని, అలాగే గతంలో వైసిపి నేతలు చేసిన వ్యాఖ్యలు, ప్రస్తుతం చెబుతున్న మాటలను వివరించాలని ప్లాన్ చేస్తుంది.
ఏపీ రాజధానిపై పార్టీల మధ్య యుద్ధం ఆగడం లేదు. వికేంద్రీకరణనే ముద్దని అధికార పార్టీ అంటుంటే, ఓకే రాజధాని అంటూ విపక్షాలు అంటున్నాయి. క్యాపిటల్ విషయంలో ఎవరైనా వెర్షన్ వారు చెబుతున్నారు. అటు విశాఖ గర్జన, ఇటు టిడిపి నేతలు రౌండ్ టేబుల్, మరోవైపు జనసేన పార్టీ అధినేత రోడ్డు షో.. మూడు పార్టీలు తీరంలోకి ఎంటర్ అవ్వడంతో ఉక్కు నగరం ఉక్కిరిబిక్కిరి అవుతుంది.