andhra pradesh

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించాం

జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి

*అనంతపురం, సెప్టెంబర్ 19 :

అనంతపురం జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ను ప్రశాంతంగా మరియు విజయవంతంగా నిర్వహించామని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పేర్కొన్నారు. జిల్లాలోని 62 జడ్పీటీసీ స్థానాల్లో, 781 ఎంపీటీసీ స్థానాలలో నిర్వహించిన ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ను సజావుగా, అత్యంత పకడ్బందీగా నిర్వహించామన్నారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించడం జరిగిందన్నారు.

సాఫీగా, సజావుగా ఎన్నికల కౌంటింగ్ ని నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకోవడం, ఎన్నికల అధికారులకు, సిబ్బందికి, ఏజెంట్ లకు అవసరమైన అన్ని రకాల వసతి సౌకర్యాలు కల్పించడంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ముగిసిందన్నారు. ఇంతకుముందు లేనివిధంగా ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు సహకరించిన ఎన్నికల అధికారులు, సిబ్బందికి, పటిష్టమైన బందోబస్తు నిర్వహించిన పోలీసు సిబ్బందికి, మండల, డివిజనల్, జిల్లా స్థాయి ఎన్నికల అధికారులకు, సిబ్బందికి, నోడల్ అధికారులకు, జిల్లా ఎస్పీకి, జాయింట్ కలెక్టర్ లకు, పెనుకొండ సబ్ కలెక్టర్ కు, పాత్రికేయులకు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ని విజయవంతం కోసం ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి పనిచేశారన్నారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల మాదిరిగానే జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ను కూడా జయప్రదంగా నిర్వహించామని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు.

ఉదయం నుంచి కౌంటింగ్ ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్

*ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు కౌంటింగ్ ప్రక్రియను అడిగి తెలుసుకుంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో 5 రెవెన్యూ డివిజన్లలోని 17 కేంద్రాలలో కౌంటింగ్ ప్రక్రియని సజావుగా నిర్వహించి ఎప్పటికప్పుడు ఫలితాలను విడుదల చేసేలా జిల్లా కలెక్టర్ మానిటర్ చేశారు. దీంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా ముగిసింది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button