ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… ఐఏఎస్ లకు సైతం ఫేస్ రికగ్నేషన్ యాప్

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… ఐఏఎస్ లకు సైతం ఫేస్ రికగ్నేషన్ యాప్

ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. సెక్రటేరియట్ లో విధులు నిర్వహించే ఐఏఎస్ లకు సైతం ఫేస్ రికగ్నేషన్ యాప్ అటెండెన్స్ ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. సెక్రటేరియట్లో ఉన్నతాధికారులు ఫోన్లలో ఫేస్ రికగ్నేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సర్కార్ ఆదేశించింది. ఈ నెల ఆరో తేదీ నుంచి ఫేస్ రికగ్నేషన్ యాప్ ద్వారా ఫోన్ నుంచి అటెండెన్స్ వేస్తున్నారు. సెక్రటేరియట్ లో పనిచేస్తున్న ఐఏఎస్ లు, సెక్రటేరియట్ నుంచి విధులు నిర్వహించాలని స్పెషల్ సిఎస్, ప్రిన్సిపల్ సెక్రెటరీ, సెక్రటరీ హోదాలో అధికారులు గతంలో సీఎం, సిఎస్ ఆదేశాలు జారీ చేశారు.

అయితే ఐఏఎస్ లను గాడిలో పెట్టేందుకు టీచర్ల తరహాలోని ఐఏఎస్ లకు ఫేస్ రికగ్నేషన్ యాప్ అటెండెన్స్ అమలు చేస్తున్నట్లు సర్కారు వెల్లడించింది. సీఎంఓలో విధులు నిర్వహించే వాళ్ళు సీఎం కార్యాలయం నుంచి ఫేస్ రికగ్నేషన్ యాప్ ద్వారా అటెండెన్స్ వెయ్యాలని స్పష్టం చేసింది సర్కార్.ఫేస్ రికగ్నేషన్ యాప్ ద్వారా అటెండెన్స్ వేయకుంటే మెమోలు జారీ చేస్తామని ఉన్నతాధికారులు స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం. గెజిటెడ్ అధికారులకు ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.