కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్
కృష్ణా జిల్లా : కృష్ణా జిల్లా కంచికచర్ల పట్టణ పోలీస్ స్టేషన్ ను సందర్శించి పలు రికార్డుల పరిశీలించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ లను కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించామని వీటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.
కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని వీరులపాడు కంచికచర్ల మండలాల కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎవరు విజయోత్సవ సభలు,ర్యాలీలు నిర్వహించరాదని తెలిపారు.
బాణాసంచాలు పేల్లచరాదని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని వర్గ భేదాలు గాని ఇరుపార్టీల అనే తేడా లేకుండా పటిష్టమైన భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఈ నిబంధనలు అందరికీ వర్తిస్తాయి అని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు.