telugu desam party

నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై రాళ్ళ దాడి

తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు ఇంటిపై రాళ్ళ దాడిని త్రీవ్రంగా ఖండిస్తున్నాను. శింగనమల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ బండారు శ్రావణి
అనంతపురం : తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపై వైస్సార్సీపీ అల్లరి మూకలు రాళ్ల దాడిని త్రీవ్రంగా ఖండిస్తున్నామని, వైస్సార్సీపీ ప్రభుత్వంలో ఒక ప్రతిపక్ష నేత కు భద్రత కల్పించ లేదంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ఎక్కడుందని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నామని, జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న ప్రతిపక్ష నేత ఇంటి పైకి వైస్సార్సీపీ గూండాలు రాళ్లు, కర్రలతో దాడి చేసి తెదేపా శ్రేణులపై విచ్చలవిడిగా దాడులు చేశారంటే, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయా ఒక సారి ప్రజలు ఆలోచించాలని శింగనమల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ బండారు శ్రావణి అన్నారు.

ఒక ప్రతిపక్ష నేత ఇంటి పైకి అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన జోగి రమేష్ తన అనుచరులైన ఐదు వందలమంది అల్లరిమూకలతో
ఈ రాష్ట్రాన్ని పధ్నాలుగు సంవత్సరాలు పాలించిన ప్రతిపక్ష నేత ఇంటి పైకి దాడికి వెలుతూంటే రాష్ట్ర డిజీపీ కి కనిపించలేదని ఈ సందర్భంగా తెదేపా తరపున ప్రశ్నిస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమం లో మాజీ మండల కన్వినర్ చితంబరి దొర, గుర్రం లక్ష్మినారాయణ,చిదానందనాయుడు,పెద్దిరెడ్డి, ఆలం నాగార్జున, చంద్రమోహన్,నరసయ్య,శేషానందరెడ్డి,రమణప్ప,పెద్దప్ప, చల్లా నాగరాజు,విజయ్,పప్పూరు శీనా,బోయ సత్యనారాయణ, ఆది, లక్ష్మినారాయణ, నరసింహ, లోకేష్, ప్రతాప్,మిట్టా పవన్,సుదర్శన్ నాయక్, మల్లి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button