మునుగోడు ఉప ఎన్నికల పోరు రంజుగా సాగుతుంది. ఒకరి మించి ఒకరు అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలకు ఎందుకు ఓటు వేయకూడదు? తమ పార్టీని ఎందుకు గెలిపించారో చెబుతూ ప్రచార పర్వాన్ని సాగిస్తున్నారు. ఇలా ఉంటే మునుగోడు ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నామినేషన్లు దాఖలు చేస్తున్న క్రమంలో ఎందుకలా అధికారులు ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒకపక్క మునుగోడు ఎన్నికల నియమావళి అమలులో ఉన్న కారణంగా ఎన్నికల అధికారులు పార్టీల ప్రచారాలపై నిఘా కొనసాగిస్తూనే ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నారు.
మునుగోడు ఉపఎన్నికపై దేశవ్యాప్త ఆసక్తి… ఎందుకంటే
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి నెలకొంది. తెలంగాణ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ వర్గాలల్లో మునుగోడు ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. అందుకు కారణం లేకపోలేదు. టిఎస్ఆర్ అధినేత పార్టీని బీఆర్ఎస్ గా జాతీయ పార్టీగా మారుస్తూ తీసుకున్న నిర్ణయంతో మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిస్తే, జాతీయ పార్టీ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది. ఓడిపోతే కెసిఆర్ జాతీయ పార్టీపై మునుగోడు ఉప ఎన్నిక ప్రభావం ఏవిధంగా పడుతుంది. అన్న అంశాలను చాలా నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోని దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లోనూ మునుగోడుపై ఉపఎన్నికపై ఆసక్తి నెలకొంది.
టిఆర్ఎస్ అభ్యర్థి కాసులకుంట ప్రభాకర్ రెడ్డి ఇక మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. రేపటితో నామినేషన్ల గడువు ముగుస్తుంది. ఇప్పటికే మునుగోడు నియోజకవర్గం బిజెపి అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థిగా బరిలోకి దిగిన పాల్వాయి స్రవంతి సైతం నామినేషన్ దాఖలు చేశారు. టిఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కాసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. నేడు మంత్రి కేటీఆర్ కాసుకుంట్ల సుధాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీంతో నేడు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో ఈ నామినేషన్ ర్యాలీకి పాల్గొనన్నారు.