TRS

పోస్టల్ బ్యాలెట్ లో కారు ముందంజ

మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతుంది. పోస్టల్ బ్యాలెట్ లో టిఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది.686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి.ఈ ఓట్ల లెక్కింపు లో టిఆర్ఎస్ ముందు ఉంది.

మునుగోడు ఉప ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ లో (TRS) ముందంజలో ఉంది. మునుగోడు బై పోల్ కౌంటింగ్ ప్రారంభం అయింది. ఆ తరుణంలోనే (TRS) ముందంజలోకి వచ్చింది. అయితే.. ఈ పోస్టల్ బ్యాలెట్ (TRS) 4 ఓట్ల ఆధిక్యం లభించింది.

ఇక (TRS) 228 ఓటు పోల్ కాగా, BJPకి 224, BSPకి 10, ఇతరులకు 88 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ అయ్యాయి. కాగా మొత్తం ఓట్లలో చౌటుప్పల్ కీలకం కానుంది 30 శాతం ఓట్లు ఈ మండలం లోని ఉన్నాయి. మొత్తం మండలంలో మొత్తం ఓట్లు 59433 ఓట్లు ఉండగా, 55678 ఓట్లు పోల్ అయ్యాయి. 99. శాతం ఓట్లు పోల్ అయ్యాయి.

మునుగోడు బై పోల్ కౌంటింగ్ ప్రారంభించారు అధికారులు. మొదటగా.. పోస్టర్ బ్యాలెట్ లోని 686 ఓట్లు లెక్కిస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే.. పోస్టల్ బ్యాలెట్ లో (TRS) ముందంజలోకి వచ్చింది. అయితే.. ఎన్ని ఓట్లతో ముందంజలో ఉందో తెలియాల్సి ఉంది..

రెండో రౌండ్లో మారిన ఫలితం

మునుగోడు రెండో రౌండ్లో ఫలితం మారింది. పోస్టల్ బ్యాలెట్, తొలి రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ లీడింగ్ లో ఉండగా.. రెండో రౌండ్ (BJP) సిట్టింగ్ క్యాండిడేట్ రాజగోపాల్ కు అనుకూలంగా ఉంది. 2వ స్థానంలో కూసుకుంట్ల, 3వ స్థానంలో కూసుకుంట్ల, పాల్వాయి స్రవంతి ఉన్నారు. రౌండ్ రౌండ్ కు ఫలితం మారుతుండటంతో ఎవరు గెలుస్తారని తెలుగు రాష్ట్రాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ రౌండ్ రౌండ్ కు ఉత్కంఠగా సాగుతుంది. రెండో రౌండ్ లో 900 ఓట్లకు పైగా ఆధిక్యంలో బీజేపీ ఉంది. మొదటి రౌండ్ లో TRS, ఆధిక్యంలో ఉండగా, BJP 2వ రౌండ్ లో ముందుకు దూసుకు వచ్చింది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button