వైసీపీలో ఆ సీట్లకు అభ్యర్థులు ఫైనల్… ఎమ్మెల్యేగా బరీలో సిటింగ్ ఎంపీ
తూర్పుగోదావరి జిల్లా పై సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. టిడిపి, జనసేన పొత్తు ఖరారు అయితే మారే సమీకరణాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు జరుగుతుంది. కీలక నియోజకవర్గం కేటాయిస్తున్నారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ.. సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు అభ్యర్థులను ఖరారు చేస్తామని ప్రకటించారు. మొత్తం 175 సీట్లు ఈసారి గెలవాల్సిందేనని సీఎం జగన్మోహన్ రెడ్డి అదే లక్ష్యంగా పెట్టుకున్నారు.
గోదావరి జిల్లాలపై స్పెషల్ ఫోకస్:
అందులో భాగంగా ప్రతి సీటు పైన ప్రత్యేకంగా సమాచారం సేకరిస్తున్నారు. ఏ ఒక్క సీటు వదులుకోవడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారం డిసైడ్ చేసే గోదావరి జిల్లాల విషయంలో సీఎం జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఈ రెండు జిల్లాల్లోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు మొదలు ఎమ్మెల్యేల పనితీరు వరకు అనేక అంశాల్లో విభిన్న మార్గాల ద్వారా క్షేత్ర స్థాయి సమాచారం సేకరిస్తున్నారు. అందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో టిడిపి నాలుగు స్థానాలు దక్కించుకుంది. అందులో ఇప్పుడు రాజమండ్రి అర్బన్ తో పాటు మండపేట పైన ఇప్పుడు ముఖ్యమంత్రి సర్వేల ఆధారంగా నేతలకు బాధ్యతలు అప్పగించారు.
రాజమండ్రి అర్బన్ లో ప్రస్తుతం టిడిపి నుంచి ఆదిరెడ్డి భవాని సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా రౌతు సూర్య ప్రకాష్ రావు పోటీ చేసి ఓడిపోయారు. రాజమండ్రి సిటీ బాధ్యతలు భరత్ కు ఈసారి సీఎం జగన్ ఇక్కడ ప్రస్తుత రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ను బరిలో దింపే ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. భరత్ అనుహంగా తొలి ఎన్నికలలోని రాజమండ్రి ఎంపీగా గెలుపొందారు. లోక్ సభలో వైసీపీ విప్ గా ఉన్నారు. రాజమండ్రి అర్బన్ లో ఇంచార్జ్-పార్టీ కార్యక్రమాల నిర్వహణ పైన అస్పష్టత ఉంది. దీంతో మార్గాని భరత్ ను రాజమండ్రి అర్బన్ ఇన్చార్జిగా అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో భరత్ ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి అవకాశాలు తెలుస్తుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న తోట త్రిమూర్తులుకు ఈ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. తోట త్రిమూర్తులు గతంలో రామచంద్రపురం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.2019 ఎన్నికల తర్వాత వైసీపీలో చేరి ఎమ్మెల్సీగా అయ్యారు.
కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా తోట త్రిమూర్తులు పేరు ఉంది. అదే సమయంలో రామచంద్రపురం నుంచి ప్రస్తుతం మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్నారు. సర్వే నివేదికలు, జిల్లా సమన్వయకర్తగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి నివేదికల ఆధారంగా సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రానున్న ఎన్నికలలో మండపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా తోట త్రిమూర్తులు పోటీ చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి టిడిపి, జనసేన పొత్తు ఖాయమని వైసిపి అంచనా వేస్తుంది. దీంతో గోదావరి జిల్లాలో సామాజిక సమీకరణాలు కీలకం కానున్నాయి. 2019 ఎన్నికల్లో జగన్ అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్ అనూహ్య ఫలితాలను ఇచ్చింది.