Uncategorized

హిజాబ్ తీర్పు సుప్రీం కోర్టులో ఊహించని పరిణామం

న్యూఢిల్లీ: కర్ణాటకలో విద్యాసంస్థలు హిజాబ్ ధరించటంపై నిషేధం విధించడానికి సవాల్ చేస్తూ దాకలైన పలు పిటిషన్ లపై గురువారం తీర్పు సందర్భంలో…. సుప్రీంకోర్టులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు వేరువేరు తీర్పులు వెలువరించారు. దీంతో సరైన దిశానిర్దేశం కోసం ఈ పిటిషన్లను సీజేఐకి సిఫారసు చేస్తున్నట్లు జస్టిస్ హేమంత్ గుప్తా తెలిపారు.

సుమారు పది రోజులపాటు హిజాబ్ పిటిషన్ల పై వాదనలు వినింది ద్విసభ్య న్యాయమూర్తుల ధర్మాసనం చివరికి కర్ణాటక హైకోర్టును తీర్పును జస్టిస్ హేమంత్ సమర్థించగా తీర్పును తోసిపుచ్చారు జస్టిస్ సుదాన్షు దులియా దీంతో ఈ వివాదం సిజెఐకి ముందుకు చేరగా…మరో బెంచ్ లేదంటే రాజ్యాంగ ధర్మాసనం ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విద్యా సంస్థల్లో విద్యార్థుల దుస్తులపై కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు వివాదంగా మారిన విషయం తెలిసిందే. స్కూల్స్, పాఠశాలల్లో హీజాబ్ ధరించకూడదని ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో పెద్ద ఎత్తున ఆందోళన జరిగాయి. హిజాబ్ నిషేధాన్ని సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. అయితే,హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తివేయడానికి నిరాకరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. పది రోజులపాటు వాదానలు విన్న జస్టిస్ హేమంత్ గుప్తా, సుధాన్షు ధులియాల ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఇరువురు జడ్జీలు హిజాబ్ నిషేధంపై ఏకాభిప్రాయానికి రాకపోవటం గమనార్హం.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button