నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కింద ఇళ్ల నిర్మాణం అక్టోబర్ నాటికి బేస్మెంట్ స్థాయికి చేరుకోవాలి
గుంతకల్, సెప్టెంబర్ 16 :
*నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కింద ఇళ్ల నిర్మాణం అక్టోబర్ నాటికి బేస్మెంట్ స్థాయికి చేరుకోవాలని, ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. గురువారం గుంతకల్లు అర్బన్ పరిధిలోని ధోనిముక్కల పల్లి వద్దనున్న జగనన్న కాలనీలలో మౌలిక వసతులకు సంబంధించిన ఏర్పాట్లను, ఇళ్ల నిర్మాణాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. లబ్ధిదారులు తో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మహిళ పొదుపు సంఘాల లో సభ్యత్వం కలిగి ఉండాలని. మహిళలకు పిలుపునిచ్చారు. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయుచున్నది.
వాటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మహిళల ను కోరారు. అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గుంతకల్లు అర్బన్ పరిధిలోని ధోనిముక్కల పల్లి వద్దనున్న జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. ఈ లేఔట్ లో దాదాపు 2 వేలకు పైగా ఇల్లు మంజూరు కాగా గ్రౌండింగ్ అనేది నిదానంగా ఉందని, మొదటిదశలో 1500 ఇళ్లు, రెండో దశలో 4,500 ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని, గుంతకల్లు మున్సిపాలిటీలో 5,500 ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగా ఇళ్ల గ్రౌండింగ్ పనులు ఎలా జరుగుతున్నాయి, ఇందుకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి సిద్ధంగా ఉన్నారా అనే విషయమై లబ్ధిదారులతో ఇంటరాక్ట్ కావడం జరిగిందన్నారు.
కొత్తగా ఇల్లు మంజూరుకు సంబంధించి ఉన్న సమస్యలు గత వారం నుంచి పరిష్కరించడం జరిగిందన్నారు. దీంతో ఇళ్ల గ్రౌండింగ్ కు, కొలతలు ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉందన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం నీటి సరఫరా పనులు, ఇసుక సరఫరా సమస్య పరిష్కారంపై తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణంలో భాగంగా బేస్మెంట్ వేసేందుకు సహాయం చేయవలసిందిగా కోరారని, ఈ విషయమై ఇసుక సరఫరాకు సంబంధించి 3 థర్డ్ ఆర్డర్ రీచ్ లకు అనుమతి ఇస్తామని, ఇది మేజర్ లేఔట్ అయిన నేపథ్యంలో లేఔట్ కి రవాణా చేసేందుకు ప్రణాళిక ఉందని, స్టాక్ పాయింట్ నుంచి ఇసుక ను లేఔట్ లోనే డంప్ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థికంగా సహాయం చేసేందుకు సంఘాల్లోని మహిళలకు సంఘాల ద్వారా ఆసరా పథకం కింద, ఇంటర్నల్ సేవింగ్స్, శ్రీనిధి కింద ఇతర రుణాలు ఇచ్చే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు.
నీటి సరఫరా పనులు కూడా మోటార్లు ఏర్పాటు చేసి వేగవంతం చేయాలని ఆదేశించామన్నారు. వచ్చే అక్టోబర్ నాటికి అన్ని ఇళ్ల నిర్మాణాలను బేస్మెంట్ స్థాయికి తీసుకురావాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇళ్లన్నీ వచ్చే ఏడాది నాటికి పూర్తి చేయాలి కాబట్టి పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు దశలవారీగా అవసరమైన సహకారం అందిస్తూ లబ్ధిదారులకు అన్ని రకాల వసతులు కల్పిస్తూ ముందుకెళ్లాలన్నారు. సచివాలయ ఉద్యోగులు కూడా లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఇళ్ల నిర్మాణం వేగవంతంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భవాని, హౌసింగ్ పిడి కేశవ నాయుడు, స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ శేషన్న, తాసిల్దార్ రాము, హౌసింగ్ అధికారులు రామకృష్ణారెడ్డి,ఆయా శాఖల అధికారులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.