andhra pradeshtelugu desam party

రాష్ట్రంలోని శాంతి భద్రతలు కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం

రాష్ట్రంలోని శాంతి భద్రతలు కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం – మాజీ మంత్రి పల్లె

రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం నానాటికి పూర్తిగా విఫలం అవుతోందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు.

ఆదివారం ఆయన నల్లమాడ మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో దారుణంగా హత్యకు గురైన విద్యార్థి విగ్నేష్ (14) కుటుంబసభ్యులను పరామర్శించి, ప్రభుత్వ వెంటనే ఆ కుటుంబానికి తగిన న్యాయం చేయలైన, దోషులను కఠినంగా శిక్షించాలని వందలాది మంది గ్రామస్తులుతో కలిసి నిరసన చేపట్టారు.

ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేదాకా విగ్నేష్ అంత్యక్రియలు నిర్వహించేదిలేదని మూడు గంటలుకు పైగా రోడ్డుపైనే బైఠాయించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజులు నుంచి కనిపించకుండా పోయిన పసిబిడ్డను కాపాడలేకపోయిన చేతకాని ప్రభుత్వం అని విమర్శించారు. కనిపించకుండా పోయిన రోజే తల్లిదండ్రులు పోలీసులుకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు సత్వరమే స్పందించి ఉంటే ఈ రోజు విగ్నేష్ కుటుంబానికి ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు.

ఆడవారికి రక్షణ లేదు, పసిపిల్లలకు రక్షణ లేదని ఇంకా ప్రభుత్వం ఏమి చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. ఎక్కడ చూసిన అత్యాచారాలు, హత్యలు, దాడులు పరిపాటిగా మారాయని విమర్శించారు.

ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకోబోతుందో స్పష్టమైన హామీ వచ్చే దాకా అంత్యక్రియలు నిర్వహించేది లేదన్నారు. అనంతరం అక్కడికి చేరుకున్న కదిరి డిఎస్పీ భవ్య గారు పల్లె రఘునాథరెడ్డి గారితో పాటు చర్చించి, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారందరి పై తప్పక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అనంతరం గ్రామస్తులు కుటుంబసభ్యులను ఓదార్చిన పల్లె రఘునాథరెడ్డి గారు, అంత్యక్రియలు నిర్వహించారు. భవిష్యత్తులోనైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని డిమాండ్ చేశారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button