విద్య, వైద్యం తో పాటు క్రీడలను ప్రోత్సహిస్తాం
అనంతపురం, సెప్టెంబర్16 :
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో ప్రజా సంక్షేమ పథకాలతో పాటు విద్య,వైద్యానికి పెద్ద పీట వేస్తున్నారని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వచ్చిన చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు 900 వ్యాధులను ఆరోగ్య శ్రీ పథకంలో ప్రవేశ పెడితే ఆయన తనయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశంలోనే ఎక్కడా లేని విధంగా కరోనా తో సహా 2,300 వ్యాధులను ఆరోగ్య శ్రీ పథకంలో ప్రవేశ పెట్టి ప్రజా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు.
అంతేకాకుండా ఆరోగ్య శ్రీ లో లేని వ్యాధులకు కూడా పేద, మధ్య తరగతి ప్రజలపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారని తెలిపారు.ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఒక్క అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం లోనే ఇప్పటి వరకు 220 మందికి రూ.1,24,32,000 పంపిణీ చేశారని పేర్కొన్నారు. విద్య,వైద్యం తో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్న సదుద్దేశంతో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో జాతీయ,అంతర్జాతీయ క్రీడల్లో పథకాలు సాధించిన క్రీడాకారులను ప్రోత్సాహకంగా నజరానా ఇస్తున్నారని తెలిపారు.
అనంతపురం జిల్లా కేంద్రంలోని పాతూరుకు చెందిన మహమ్మద్ హంయా హుస్సేన్(5 సంవత్సరాలు) స్కెటింగ్ క్రీడలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారన్నారు. హుస్సేన్ ది మధ్య తరగతి కుటుంబం కావడంతో ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఆర్థిక సహాయం కోరగా విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోగా ఆయన స్పందిస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా హుస్సేన్ కు రూ.2 లక్షల చెక్ ను అందించారని తెలియజేసారు.ఆర్థిక పరిస్థితి మూలంగా ఎవరు క్రీడలకు దూరం కాకూడదు అన్నదే సి ఎం సంకలమన్నారు.
ఒకవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ప్రజాసంక్షేమం దిశగా నడిపిస్తుంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తూ సైందవుడిలా అడ్డుపడుతున్నాడని విమర్శించారు.ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజా మద్దతుతో వాటిని అధిగమించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తారని పేర్కొన్నారు.కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫయాజ్, కార్పొరేటర్లు చంద్రమోహన్, రామాంజనేయులు, ఇషాక్, వైసిపి సీనియర్ నాయకులు అనంత చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.