ysrcp

Vijayasai Reddy: విశాఖ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం

విశాఖ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం. రాష్ట్రంలో ఏ ఒక్కరికీ ఇల్లు లేకుండా ఉండకూడదు. ప్రతి ఒక్కరికి ఇంటి అవసరం ఉంటుంది.  అందుకే పేదలకు ఇళ్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. త్వరలో 1000 పార్కుల అభివృద్ధి చేస్తాం. అదే సమయంలో లో అభివృద్ధిలో వెనకడుగు వేయకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. విశాఖ పట్టణం నగరం సుందరీకరణ లో భాగంగా గా 1000 పార్కులు అభివృద్ధి చేస్తాం. అలాగే నగరంలోని 794 మురికివాడల్లో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేస్తాం. మురికివాడల్లో నివసించే వారందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఇల్లు లేకుండా ఉండకూడదు. అందుకే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం గౌరవ శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినట్టు విజయసాయి రెడ్డి గారు పేర్కొన్నారు. కొత్తగా నిర్మించే పార్కుల్లో వాకింగ్ ట్రాక్, బటర్ఫ్లైగార్డెన్,  రోడ్డు నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button