Munugodu Nomination:మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ తేదీలు

Munugodu Nomination: హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలలో 5 అంచెల వ్యూహాన్ని అనుసరించి విజయమే లక్ష్యంగా పనిచేయాలని కమలదళం నిర్ణయించింది. దసరా తర్వాత 7,8 తేదీల నుంచి ప్రచారాన్ని ఉధృతం చేయాలని కమలనాధులు భావిస్తున్నారు. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, పార్టీ స్టీరింగ్ కమిటీ నేతలు, మునుగోడు ఉప ఎన్నికలకు మండల ఇంఛార్జిలతో శనివారం విడివిడిగా సమావేశం అయ్యారు.

స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి, బిజెపి అభ్యర్థిగా నిలిచే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కమిటీ సమన్వయకర్త గంగిడి మనోహర్ రెడ్డితో పాటు సీనియర్ నేతలు ఈతల రాజేందర్, గరికపాటి మోహన్ రావు, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, స్వామి గౌడ్, రవీంద్ర నాయక్, దుగ్యాల ప్రదీప్ కుమార్, వెంకటేశ్వరరావు, యండల లక్ష్మీనారాయణ, శ్రావణ్ తదితరులు హాజరయ్యారు. మునుగోడు ఉపఎన్నికకు ఈనెల 15 తేదీకి నోటిఫికేషన్ రావచ్చు.

హిమాచల్ అసెంబ్లీతోపాటు ఇక్కడ నవంబర్ లో తొలి లేదా రెండో వారంలో ఎన్నిక జరగవచ్చు అని,సునీల్ బన్సల్ ఒకరిద్దరి నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. ఉప ఎన్నిక ప్రచారానికి వచ్చేందుకు జేపీ నడ్డా, అమిత్ షా సమయం ఇచ్చారని స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి చెప్పారు. ఉప ఎన్నికకు సంబంధించి తాజాగా 15 కమిటీలు వేసినట్టు, మేనిఫెస్టో కమిటీ ఈటల రాజేందర్ ను, చార్జిషీట్ కమిటీకి ధర్మపురి అరవింద్ చైర్మన్ గా నియమించినట్లు పార్టీ నేత ఒకరు తెలిపారు.

ఐదు అంచెల వ్యూహంతో భాగంగా…

ప్రతి పోలింగ్ బూత్ కు 21 మంది కమిటీ. ప్రతి మండలంలో ముగ్గురు స్థానికేతర నాయకుల్ని ఇన్చార్జిలుగా నియమించడం. ప్రతి మండలంలో పదిమంది నాయకులతో సమన్వయ కమిటీ ఏర్పాటు. నియోజకవర్గానికి ఎన్నికల ప్రణాళిక, చార్జిషీట్, బహిరంగ సభలు, 22 కమిటీలతో ముందుకు వెళ్లడం. కుల సమ్మేళనాల నిర్వహణ. ప్రతి ఇంటికి వెళ్తూ, ఒక్కో ఓటర్ ను కలిసేలా కమలనాధులు వ్యూహరచన చేశారు.