డ్రగ్స్ కేసుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న సినీ ఇండస్ట్రీకి డ్రగ్స్ కేసు పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం వైఖరి చెప్పాలని హైకోర్టు అనేక సార్లు కోరిందని రేవంత్ రెడ్డి అన్నారు.తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును క్లోజ్ చేసిందని రేవంత్ రెడ్డి గారు విమర్శించారు, ఈ కేసు నుండి ఎవరిని తప్పించేందుకు మూసివేశారని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.

కేసుకు సంబంధించిన ఈడీ మరొకసారి అందరికీ నోటీసులు ఇచ్చిన ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. డబ్బు బ్యాంక్ అకౌంట్ లేదా హవాలా లావాదేవీలు జరిగితేనే రంగంలోకి ఈడీ దిగుతుంది అన్నారు.కేసు విచారణ చేపట్టిన అకుల్ సబర్వాల్ ను ఎందుకు బదిలీ చేశారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.డ్రగ్స్ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకరించడం లేదని కేంద్ర సంస్థలు అఫిడవిట్ వేశాయని, ఈ కేసు విచారణ చేపడతామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కేసు విషయంలో కేటీఆర్ సహా ఎవరిపైన నా తాను ఆరోపణలు చేయడం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

కేసు విచారణ చేపట్టి బాధ్యులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ తో పిల్లల భవిష్యత్ నాశనం అవుతుందని, అవుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.