నారా లోకేష్ అరెస్టు అన్యాయం
పోలీసుల దౌర్జన్యాలను ఖండిస్తున్నా
—రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం
అరెస్టును నిరసిస్తూ కాగడాల ప్రదర్శన
రామచంద్రపురం // ఉన్మాది చేతిలో హత్యకు గురైన యువతి అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న నారా లోకేష్ ను పోలీసులు అరెస్టు చేయడం అన్యాయమని రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టును నిరసిస్తూ రామచంద్రపురం హౌసింగ్ బోర్డ్ కాలనీలో టిడిపి నాయకులతో కలిసి ఆయన కాగడాల ప్రదర్శన నిర్వహించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట లో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు నారా లోకేష్ ను వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారన్నారు. పరామర్శ వెళ్తున్న లోకేష్ ను కోవిడ్ నిబంధనల పేరుతో అడ్డుకోవడం అన్యాయమని చెప్పారు. వైసిపి నాయకులు పాదయాత్రలు, ర్యాలీలు చేయడానికి మాత్రం నిబంధనలు అడ్డురావు అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో సజ్జల రామకృష్ణారెడ్డి వేలాది మందితో నిర్వహించిన సమావేశానికి అడ్డురాని నిబంధనలు లోకేష్ పర్యటనకు అడ్డు వచ్చాయని వాపోయారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, అసలు దిశ చట్టం అమలు కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రజలు, మహిళలు వైసీపీ ప్రభుత్వ అరాచకాలను, అన్యాయాలను గమనిస్తున్నారని త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని సుబ్రహ్మణ్యం అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు చింతపల్లి వీరభద్రరావు , కడియాల రాఘవన్ ,పెంకే సాంబశివరావు, నండూరి ఫణికుమార్ ,జొన్నకూటి భాస్కరరావు, మేడిశెట్టి సూర్యనారాయణ , పైడిమల్ల సత్తిబాబు, లక్ష్మణరావు ,నర్సింహారావు , భాస్కర్ , విజయ రాజు , శంషాద్ బేగం , జాస్తి విజయలక్ష్మి చక్రవర్తి , బళ్ళ శివ,కొసనా శ్రీనివాస్, దొరబాబు, బాబ్జీ , గుబ్బల తమ్మయ్య , సూద౦ శెట్టి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.