Telangana
MLC Mahidhar Reddy అవే నా చివరి ఎన్నికలు
వచ్చే ఎన్నికల్లో తాండూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని మాజీ మంత్రి మహేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ఎల్పీ బుధవారం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అసలు పైలెట్ కాదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ తో గెలిచి సర్టిఫికెట్ పెట్టాడని పేర్కొన్నారు. ఎంపీ రంజిత్ రెడ్డి తానే స్వయంగా రాజకీయాల్లోకి తీసుకు వచ్చాను అని చెప్పారు.
2028 లో తన వారసులు పోటీ చేస్తారని, లండన్ లో ఉన్న తన కొడుకు, తన అన్న కొడుకు రాజకీయాల్లో ఉంటానని తెలిపారు. దళిత బంధు మంచి పథకమని ఇలాంటి పథకం రాష్ట్రంలోని దళితులు అందరికీ వర్తింపజేయాలని కోరారు. అధికారిక టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉంటూ మరో ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.