Telangana

Telangana తెలంగాణలో ప్రజా సంకల్ప యాత్ర చేపడుతున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు యాత్ర చేపడుతున్నారో చెప్పాలి ?

తెలంగాణలో ప్రజా సంకల్ప యాత్ర చేపడుతున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు యాత్ర ఎందుకుచేపడుతున్నారని చెప్పాలని టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాదులో వరదలు వచ్చినందుకు ఒక్క పైసా కూడా కేటాయించకుండా, ఆదుకుంటామని హామీ ఇచ్చి ఆదుకున్నరనా, ఎందుకు చేపడుతున్నారో చెప్పాలని అన్నారు.

 కేంద్ర ప్రభుత్వం వన్ ఇండియన్ మేక్ ఇన్ ఇండియా అని పేర్కొంటూనే ప్రభుత్వ ఆస్తులను ఉందని ఆయన ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ భూములను విక్రయించి ఆరు లక్షల కోట్లు కేంద్ర సేకరించాలని అందులో భాగంగానే ఇరవై ఒక్క ఎకరాల రైల్వే భూమిని మౌలాలీలో ఎందుకు పెడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. పేదలకు ఇళ్లు నిర్మిస్తామని రెండెకరాల రైల్వే భూమిని కేటాయించాలని కేంద్రానికి కోరితే స్పందన కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ప్రకటించి ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేంద్రం ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు. దేశంలోని పబ్లిక్ సెక్టార్ లలో 11 లక్షల 30 వేల 840 ఖాళీగా ఉన్నాయని అందులో దళితులకు 1.76 లక్షల ఉద్యోగాలు, లక్ష ఉద్యోగాలు ట్రైబల్ లకు ఉన్నట్లు పేర్కొన్నారు. కరోనా మొదటి వేవ్ సమయంలో 20 లక్షల కోట్ల ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తామని చెప్పి ఒక్క పైసా కూడా కేటాయించలేదని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు కేంద్రం నిధులు ఇచ్చిందనా, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చామనా,  విభజన చట్టంలోని హామీలను నెరవేర్చేందుకా, లేక ప్రభుత్వ భూములను గుర్తించి అమ్మడానికి యాత్ర చేపడుతున్నారా, అని ప్రశ్నించారు?

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button