నటుడు ప్రతాప్ పోతన్ పూర్తిపేరు ప్రతాప్ కులంతుకల్ పోతన్. ఈయన ప్రముఖ దక్షిణాది సీనియర్ సినీ నటుడు, దర్శకుడు. ఈయన శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. తల్లి పొన్నమ్మ పోతెన్, తండ్రి కులంతకల్ పోతేన్.పోతేన్ కేరళాలోని తిరువనంతపురంలో జన్మించారు.(13-08-1952).
ప్రతాప్ పోతేన్ 1978 లో వచ్చిన అరవం అనే మలయాళ చిత్రం ద్వారా నటుడుగా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. సినిమాలలో వేసే పాత్రల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తెలుగులో ఆకలి రాజ్యం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయ్యారు. అంతేకాక కాంచన గంగ, జస్టిస్ చక్రవర్తి, చుక్కల్లో చంద్రుడు, లాంటి పెద్ద పెద్ద విజయాలు అందుకున్న సినిమాలలో నటించారు. అంతేకాక ఈయన తెలుగు, తమిళం, కన్నడ భాషలలో దర్శకుడుగా కూడా పనిచేశారు. తెలుగులో వందకు పైగా సినిమాలలో నటించారు. ఈయన ప్రత్యేకంగా డైలాగ్స్ చెప్పడంలో సుప్రసిద్ధుడు.
ఈయన తెలుగులో దర్శకత్వం చేసి తీసిన చైతన్య అనే సినిమా పెద్ద విజయాన్ని అందుకుంది. తెలుగులో దర్శకత్వం చేసిన ఏకైక సినిమా ఇదే.1985లో ప్రతాప్ తెలుగులో స్టార్ హీరోయిన్ అయిన సీనియర్ నటి రాధికను వివాహం చేసుకున్నారు.కొన్ని సమస్యల వల్ల వీరు 1986లో విడాకులుతీసుకుని విడిపోయారు.1990లో అమల సత్య నాద్ ను వివాహం చేసుకున్నారు.2012లో ఆమెతో కూడా విడిపోయి ఒంటరిగా జీవనంసాగించేవారు.వీరిరువురికి ఒక కుమార్తె, (కియా).
అదే చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ఇందిరాగాంధీ అవార్డు కూడా ఈయనకు లభించింది.1987లో రీతు బేధం అనే చిత్రానికి ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. 1985లో మొదలైన సీబీఐ 5కు, కాతల్ కథై చిత్రానికి బెస్ట్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు.
సినీ నటుడుగా, దర్శకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న ఈయన తన సొంత నివాసంలో గుండెపోటుతో కిందపడి కదలలేని స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న సన్నిహితులు చూసి హాస్పిటల్కు తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్టు అక్కడి వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలిసిన తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ సినీ తారలు, ప్రముఖులు సంతాపం తెలియజేశారు.