Punch Prasad Health:నడవలేని స్థితిలో జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్

Punch Prasad Health: తనదైన కామెడీ పంచ్ డైలాగ్స్ తో బుల్లితెర అభిమానులను నవ్వించిన పంచ్ ప్రసాద్ తన నిజ జీవితంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం పంచ్ ప్రసాద్ నడవలేని స్థితిలో ఉన్నారు. కనీసం ఆయనకు వచ్చిన ఆ జబ్బు ఏంటో కూడా తెలియని స్థితిలో బాధపడుతున్నారు.

కాగా ప్రేక్షకులను అలరించే షో జబర్దస్త్ పంచ్ ప్రసాద్ కమెడియన్ గా గుర్తింపు పొందాడు. తనదైన స్పాంటేనిటి పంచలతో పంచ్ ప్రసాద్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని తన సొంతం చేసుకున్నాడు. చాలా కాలంగా ఆయన కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. తనకున్న వ్యాధికి కూడా చాలా సందర్భాల్లో స్కిట్ లో వాడి అందరిని నవ్వించారు.

నడవలేని స్థితిలో జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్
నడవలేని స్థితిలో జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్

ఎప్పుడు ఏ షోలో కనిపించిన తనదైన స్టైల్ తో ఫుల్ కామెడీ చేస్తూ అందరిని కడుపుబ్బ నవ్వించే ప్రసాదును గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్య వేధిస్తుంది. అయినా సరే షోలో యాక్టివ్ గా ఉంటూ కామెడీ చేస్తూ వస్తున్న పంచ్ ప్రసాద్. ప్రతివారం డయాలసిస్ చేసుకున్న సరే తన బాధను బయటికి చెప్పకుండా నవ్వించాడు. అలాంటి పంచ్ ప్రసాద్ పరిస్థితి ప్రస్తుతం చాలా దారుణంగా మారింది.

కనీసం నడవలేని స్థితిలో అతను ఉన్నాడు. తాజాగా తన యూట్యూబ్ ఛానల్ షేర్ చేసిన వీడియోలో ప్రసాద్ తీవ్ర నొప్పితో బాధపడుతూ కనీసం లేవలేని స్థితిలో ఉన్న ప్రసాద్ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇంక పంచ్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ లో కమెడియన్ జోడి నూకరాజు చూసి ఈ వీడియోను పోస్ట్ చేశాడు.

ఇందులో తన ఆరోగ్య పరిస్థితిని బయటకు చెప్పేందుకు ప్రసాద్ కూ ఇష్టం లేదు. అయినా చాటుగా ఈ వీడియో తీసి ఆయన అనారోగ్య పరిస్థితిని చూపించాడు నూక రాజ్. ఇక పంచ్ ప్రసాద్ భార్య చెప్పిన దాన్ని ప్రకారం ఒకరోజు షూటింగ్ తర్వాత ఫీవర్ గా ఉందని ఇంటికి వచ్చిన ప్రసాద్ నడుము నొప్పితో చాలా కష్టపడ్డాడు.

అలా నడవలేని ప్రసాద్ చాలా ఇబ్బంది పడ్డాడు. డాక్టర్స్ కూడా ఫస్ట్ ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాలేదని, టెస్టులు చేసి నడుము వెనుక వైపు కుడికాలి వరకు చీము పట్టేసినట్లు తెలుస్తుంది. అని ఆమె చెప్పుకొచ్చింది ప్రసాద్ కి ఇష్టం లేకపోయినా సరే ఈ మొత్తాన్ని షూట్ చేసి యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసినట్లు నూకరాజు చెప్పాడు. అభిమానులు కూడా ప్రసాద్ కి సపోర్ట్ చేయాలని అందరూ అనుకున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker