Kondagattu: కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం ప్రాముఖ్యత

అందరి దేవుళ్ళలో చిన్న పిల్లల నుంచి, ముసలి వాళ్ళ వరకు భక్తులు ఉండే ఒకే ఒక దేవుడు హనుమంతుడు. అలాంటి ఆంజనేయ స్వామి కొలువై ఉన్న దేవాలయాలలో కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఓ పశువుల కాపరి, అతని భార్య పశువులు కాసుకుంటూ ఉంటే, మంద నుండి వేరుపడిన ఒక గేదెను వెతుక్కుంటూ కొండపైకి వెళ్లిన ఈ దంపతులకు ప్రజెంట్ జగిత్యాల జిల్లాలో కోడిమ్యాలకు చెందిన సింగం సంజివుడికి అక్కడే ఉన్న ఒక పొదల్లో హనుమాన్ విగ్రహం కనిపించింది.

కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం ప్రాముఖ్యత
కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం ప్రాముఖ్యత

మరుసటి రోజు ఆయన తన భార్యను తీసుకువచ్చి ఆ స్వయంగా హనుమాన్ విగ్రహాన్ని బయటకు తీసి దానికో చిన్న గుడిగట్టి అందరికంటే ముందు ఆ హనుమాన్కి మొక్కిన వారు ఆ గొల్ల దంపతులే. ఈ మాట దాదాపు 4 (లేదా)5 వందల సంవత్సరాల క్రితం మాట. తర్వాత కాలంలో కృష్ణ రావు దేశ్ముఖ్అని దొరవారు ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడం వల్ల అక్కడికి తరలివచ్చే భక్తుల సంఖ్య పెరగడం జరిగింది.

తర్వాత 1968వ సంవత్సరం దీని నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ వారు చేపట్టారు. చాత్తాద వైష్ణవులే ఇక్కడ పూజా విధానాలు చేస్తూ ఉంటారు. ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం జగిత్యాల జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో కరీంనగర్ హైవే పైన ఉంది. ఈ ప్రాంతానికి ఏడాది పొడవునా హనుమాన్ భక్తులు వస్తూనే ఉంటారు.

“ఆంజనేయ స్వామి దీక్ష”కాలంలో ఇక్కడ చాలా ఎక్కువ సంఖ్యలో తరలివస్తుంటారు. ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు. కానీ ఇక్కడ సరైన రోడ్ల నిర్మాణాలు లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతూ ఉండేదని తెలిసింది. ఇటీవల కాలంలోనే జగిత్యాల జిల్లాకు సంబంధించిన సందర్శనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రావడం జరిగింది. ఈ ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కోసం 100 కోట్లు ప్రకటించారు.

మానాల, పొలవాస, ఎలగందుల నుండి గోల్కొండ ప్రాంతం వరకు కొండల రాయుడు అనే వ్యక్తి గొప్ప పేరు ఉన్న వ్యక్తి. ఈ వ్యక్తి ఈ ప్రాంతాన్ని తన స్థావరంగా వాడుకున్నాడు. అందుకే దీనికి కొండగట్టు అనే పేరు వచ్చిందని కొందరు చెప్తున్నారు. ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానానికి సంజీవుడు, ఆశమ్మలు చేసిన సేవలకు శాసన ఆధారాలు కూడా ఉన్నాయి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker