Cricket

AUS VS AFG:ఆఫ్ఘనిస్తాన్ పై నాలుగు పరుగుల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా.

టీ ట్వంటీ వరల్డ్ కప్ 2022 మ్యాచ్లో భాగంగా ఈరోజు ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ అడిలైడ్ స్టేడియంలో జరుగుతుంది. దీనికి సంబంధించి స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మ్యాచ్ లోకి సంబంధించి లైవ్ అనేది ఇస్తున్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తుంది.

ఆస్ట్రేలియా జట్టు మెయిన్ ప్లేయర్స్
కామెరాన్ గ్రీన్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (c & wk), పాట్ కమిన్స్, కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.
ఆస్ట్రేలియా బెంజ్ ప్లేయర్స్–
అష్టన్ అగర్, ఆరోన్ ఫించ్, టిమ్ డేవిడ్, మిచెల్ స్టార్క్.
ఆఫ్ఘనిస్తాన్ మెయిన్ ప్లేయర్స్–
రహ్మానుల్లా గుర్బాజ్ (wk), ఉస్మాన్ ఘనీ, ఇబ్రహీం జద్రాన్, గుల్బాదిన్ నైబ్, దర్విష్ రసూలీ, నజీబుల్లా జద్రాన్, మొహమ్మద్ నబీ (c), రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూఖీ.
ఆఫ్ఘనిస్తాన్ బెంచ్ ప్లేయర్స్–
మహ్మద్ సలీమ్ సఫీ, కైస్ అహ్మద్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఫరీద్ అహ్మద్ మాలిక్.

ఆఫ్ఘనిస్తాన్ పై నాలుగు పరుగుల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా.
ఆఫ్ఘనిస్తాన్ పై నాలుగు పరుగుల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా.

ఫారుఖీ బౌలింగ్లో గ్రీన్ రెండు బంతుల్లో మూడు పరుగులు చేసి 2.1 పవర్ లో ఔట్ అయ్యాడు. నవీన్ బౌలింగ్లో డేవిడ్ వార్నర్ 18బంతుల్లో 25 పరుగులు చేసి 5.2 ఓవర్ లో అవుట్ అయ్యాడు. నవీన్ బౌలింగ్లో స్టీవ్ స్మిత్ నాలుగు బంతుల్లో నాలుగు పరుగులు చేసి ఆరవ ఓవర్లో ఔట్ అయ్యాడు. ముజీబ్ బౌలింగ్లో మిచ్చెల్ మార్ష్ 30 బంతుల్లో 45 పరుగులు చేసి 10.4 ఓవర్ లో అవుట్ అయ్యాడు.

రషీద్ బౌలింగ్లో స్టోయినీస్ 21 బంతుల్లో 25 పరుగులు చేసి 15.3 ఓవర్ లో ఔట్ అయ్యాడు. ఫారుఖీ బౌలింగ్లో వేడ్ 8 బంతుల్లో ఆరు పరుగులు చేసి 17.5 ఓవర్లో ఔట్ అయ్యాడు. నవీన్ బౌలింగ్లో కమ్మీన్స్ రెండు బంతుల్లో 0 పరుగులు చేసి 18.2 ఓవర్లో అవుట్ అయ్యాడు. నవీన్ బౌలింగ్లో రిచ్చర్డ్ సన్ ఒక బంతిలో ఒక పరుగు చేసి 19 ఓవర్ లోఅవుట్ అయ్యాడు. ఆస్ట్రేలియా నిర్నిత 20 ఓవర్లులో 168/8 స్కోర్ చేసింది.

ఆఫ్ఘనిస్తాన్ కు 169 పరుగులు టార్గెట్ గా ఇచ్చింది ఆస్ట్రేలియాహేజల్ ఉడ్ బౌలింగ్లో ఘని ఏడు బంతుల్లో రెండు పరుగులు చేసి 2.3 ఓవర్ లో అవుట్అయ్యాడు. రహమనుల్లా గుర్బాజ్ , రిచ్చర్డ్ సన్ బౌలింగ్లో 17 బంతుల్లో 30 పరుగులు చేసి 5.3 ఓవర్లో ఔట్ అయ్యాడు. జంప బౌలింగ్లో నయీబ్ 23 బంతుల్లో 39 పరుగులు చేసి 13.1 ఓవర్ లో అవుట్ అయ్యాడు. జంపా బౌలింగ్లో ఇబ్రహీం 33 బంతుల్లో 26 పరుగులు చేసి 13.2 ఓవర్లో ఔట్ అయ్యాడు.

https://www.instagram.com/reel/CkiZGNTMSdS/?igshid=YmMyMTA2M2Y=

నాజీబుల్లా జద్రాన్, జంపా బౌలింగ్లో రెండు బంతుల్లో సున్నా పరుగులు చేసి 13.4 ఓవర్ లో అవుట్ అయ్యాడు. హేజల్ వుడ్ బౌలింగ్లో మహమ్మద్ నబీ రెండు బంతుల్లో ఒక పరుగు చేసి 14.3 ఓవర్ లో అవుట్ అయ్యాడు. రసూలి, స్టోయినిస్ బౌలింగ్లో 13 బాళ్లకు ఐదు పరుగులు చేసి 19వ ఓవర్లో ఔట్ అయ్యాడు.

నాలుగు పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 164/7 స్కోర్ చేసి ఓటమిపాలయింది. ఈ మ్యాచ్ లో రసీదు ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ సూపర్ గా ఆడాడు.పాయింట్స్ టేబుల్ లో గ్రూప్ వన్ కు సంబంధించి న్యూజిలాండ్ ఏడు పాయింట్స్ తో మొదటి ప్లేస్ లో ,ఆస్ట్రేలియా 7 పాయింట్స్ తో రెండో ప్లేస్లో ఉంది..

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button