CricketSports News

Hardik Pandya:హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ద్వైపాక్షిక సిరీస్లో పాల్గొంటున్న టీమిండియా.

మొన్నటి వరకు టి20 ప్రపంచ కప్ 2022 టోర్నమెంట్ ఆడిన టీమిండియా ప్రస్తుతం ద్వైపాక్షిక సిరీస్ పై దృష్టి పెట్టింది. ఇంట్లో భాగంగా మూడు టీ20, మూడు వన్డేలు ఆడనుంది. నవంబర్ 18 తారీకు ఈసిరీస్ లో భాగంగా ఇండియా జట్టు న్యూజిలాండ్తో తలపడింది. ఈ మ్యాచ్ వెల్డింగ్టన్ వేదికగా జరిగింది.

ఈ సిరీస్లో మొదటి మ్యాచ్ కావడంతో శుభ ఆరంభం అందించడానికి ప్రయత్నిస్తున్నాయి రెండు జట్లు. ఈ మ్యాచులు అన్ని డిడి స్పోర్ట్స్, అమెజాన్ ప్రైమ్ లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. కానీ ఈ మ్యాచ్ కు సంబంధించి టీమిండియా జట్టులో కొంతమంది కీలక ప్లేయర్స్ ఈ సిరీస్ కు దూరంగా ఉంటున్నారు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రాహుల్, బూమ్రా, షమీ, దినేష్ కార్తీక్ లాంటి అనుభవజ్ఞులు ఈ జట్టు నుంచి దూరంగా ఉన్నారు. ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా ఉన్న టీమ్ ఇండియా జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. ఈ సిరీస్లో టీమ్ ఇండియాకు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఉంటున్నాడు.

హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ద్వైపాక్షిక సిరీస్లో పాల్గొంటున్న టీమిండియా.
హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ద్వైపాక్షిక సిరీస్లో పాల్గొంటున్న టీమిండియా.

ఇషాన్ కిషన్, సంజు సామ్సన్, శుభ్ మన్ గిల్, దీపక్ హుడా ఉన్న టీమిండియా జట్టు సీనియర్స్ లేని లోటును కచ్చితంగా పూరిస్తుంది. వీళ్ళందరూ కూడా అంతర్జాతీయ బౌలర్లను ఎదుర్కొన్న ప్లేయర్స్ అవడంతో న్యూజిలాండ్ జట్టు ఒక పెద్ద సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది.

తుది జట్లు(అంచనా):
భారత జట్టు: శుభమాన్ గిల్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), రిషబ్ పంత్, దీపక్ హుడా/వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.

న్యూజిలాండ్ జట్టు: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ఆడమ్ మిల్నే, లాకీ ఫెర్గూసన్, ఇష్ సోది.

మళ్లీ హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా-
హార్దిక్ పాండే ఈ సంవత్సరం కెప్టెన్ గా గుజరాత్ టైటాన్స్ ను ఐపీఎల్ మ్యాచ్లో గెలిపించి తన సత్తా చాటుకున్నాడు. ఇప్పుడు భారీగా పోటీ ఇచ్చే న్యూజిలాండ్ జట్టుపై తలపడేందుకు సిద్ధమవుతున్నాడు. క్రికెట్ విశ్లేషకులు అంచనాల ప్రకారం రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్ అర్హత హార్దిక్ పాండ్యా కు ఉందని ఈ సిరీస్ లో కెప్టెన్ అవకాశాలు కల్పించారు.

కానీ ఈ సిరీస్ లో కొంతమంది ముఖ్యమైన ఇండియా ప్లేయర్స్ ఆడనప్పుడు జట్టును గెలిపించి తన సత్తాను చాటుకుంటే మాత్రం రాబోయే ప్రపంచ కప్ లో కచ్చితంగా హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఉంటాడని, దీంట్లోఎలాంటి సందేహం లేదని క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆటగాళ్లతోనే జటను గెలిపిస్తే అది ఒక అద్భుతమే అని చెప్పాలి. సూర్య కుమార్ యాదవ్ ఎలాగూ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటి వరకైతే టీమిండియా అన్ని రకాల ప్లేయర్స్ తో పొట్టి సిరీస్ కు సరిపోయే మెటీరియల్ తోనే ఉంది.

ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో న్యూజిలాండ్-

సొంత ప్రదేశంలో, అన్నీ అనుకూలతలు ఉన్నప్పటికీ ఇండియా పై ఓడిపోయిన న్యూజిలాండ్ ప్రస్తుతం ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో ఉంది. అనుభవజ్ఞులు లేని ప్రపంచ నంబర్ వన్ టి20 జట్టుపై మొదటి మ్యాచ్ నుంచి ఆధిపత్యం కనబరచాలని న్యూజిలాండ్ జట్టు తగిన ప్రణాళికతో వచ్చింది.

సొంత గడ్డపై కూడా టి20 వరల్డ్ కప్ 2022 టోర్నమెంట్లో చేసిన ప్రదర్శననే కనబరచాలని న్యూజిలాండ్ ప్లేయర్స్ అనుకుంటున్నారు. భారత్ బౌలింగ్ విషయానికొస్తే కొంత బలహీనంగా ఉందని చెప్పాలి. బ్యాటింగ్ విషయమైతే బలంగా ఉంది. ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే అటు బ్యాటింగ్ లోను, ఇటు బౌలింగ్ లోను బలంగా ఉంది.

వెల్డింగ్టన్ వేదికగా జరిగే మ్యాచ్ పిచ్ విషయానికొస్తే భారీ స్కోరులకు ఎలాంటి కొదవ ఉండదు. ఈ పిచ్ లో దాదాపు 162 స్కోర్ మాత్రమే సగటుగా ఉంది. ఈ వేదికపై బౌలర్ల కంటే కూడా బ్యాటర్లకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్ కి వర్షం కూడా అంతరాయం కలిగించవచ్చు. కానీ మ్యాచ్ టైం కల్లా సర్దుకోవచ్చు. ఇక సొంత గడ్డ కాబట్టి న్యూజిలాండ్ కి ఎక్కువ అనుకూలతలు ఉండొచ్చు. ఎక్కువ అవకాశాలు ఉండొచ్చు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button