CricketSports News

Jagadeesan:వన్డే మ్యాచ్లో రికార్డ్ బ్రేక్ చేసిన తమిళనాడు క్రికెటర్

Jagadeesan: బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో అరుణాచల్ ప్రదేశ్ వర్సెస్ తమిళ్ నాడు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో తమిళనాడు తరఫున ఆడిన ఎన్. జగదీష్ న్ 141 బంతుల్లో 277 పరుగులు చేశాడు. ఈ స్కోర్ ద్వారా ఎన్నో రికార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.

క్రికెట్ ఆటకు సంబంధించి లిస్ట్ A క్రికెట్లో ఇదే అత్యధిక స్కోర్. 277 పరుగులతో అరుణాచల్ ప్రదేశ్ పై ఎన్. జగదీష్ న్ చేసిన స్కోర్ పురుషుల జాబితా లిస్ట్A క్రికెట్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్.

గతంలో 2002 సంవత్సరంలో అలిస్టర్ బ్రౌన్, గ్లామోర్గాన్ పై చేసిన 268 పరుగులు అత్యధికంగా ఉండేవి. అలాగే శ్రీలంక కు సంబంధించిన మహిళల వన్డే టోర్నమెంట్లో 2007 సంవత్సరంలో పుష్పదన లేడీస్ పై శ్రీపాలి వీరక్కొడి చేసిన 271 నాట్ అవుట్ స్కోర్ అధికంగా ఉండేది.

వన్డే మ్యాచ్లో రికార్డ్ బ్రేక్ చేసిన తమిళనాడు క్రికెటర్ ఎన్. జగదీష్{277}
వన్డే మ్యాచ్లో రికార్డ్ బ్రేక్ చేసిన తమిళనాడు క్రికెటర్ ఎన్. జగదీష్{277}

ప్రస్తుతం జగదీష్ న్ చేసిన స్కోర్ అత్యధికంగా ఉంది. వరుసగా 5 ఇన్నింగ్స్ లో సెంచరీలు చేసిన మొదటి ఆటగాడిగా నిలిచిన ఎన్. జగదీష్న్.

గతంలో వరుసగా నాలుగు సెంచరీలు చేసిన బ్యాట్స్ మెన్స్ ముగ్గురున్నారు.(2014-15) సంవత్సరం లో కుమార సంగక్కర, (2015-16)లో అల్విరో పీటర్సన్ మరియు( 2020-21)లో దేవదత్ పడిక్కల్ వరుసగా నాలుగు సెంచరీలు చేసిన వ్యక్తులు వీళ్లు.

అరుణాచల్ ప్రదేశ్ వర్సెస్ తమిళనాడు మ్యాచ్లో తమిళనాడు స్కోర్ రెండు వికెట్లకు 506 పరుగులు స్కోర్ చేసింది. పురుషుల జాబితాలో లిస్ట్ A క్రికెట్లో 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి జట్టుగా తమిళనాడు జట్టు నిలిచింది. ఈ సంవత్సరం స్టార్టింగ్ లో జరిగిన నెదర్లాండ్ జట్టుపై నాలుగు వికెట్లు కోల్పోయి 498 పరుగులు చేసిన ఇంగ్లాండ్ స్కోర్ అత్యధికంగా ఉండేది. ప్రస్తుతం తమిళనాడు జట్టు దీన్ని బీట్ చేసింది.

అరుణాచల్ ప్రదేశ్ వర్సెస్ తమిళనాడు మ్యాచ్లో ఎన్. జగదీష్ న్ డబుల్ సెంచరీ చేయడం కోసం తీసుకున్న 141పరుగులు అనేది పురుషుల జాబితా లిస్ట్ A క్రికెట్ లో అత్యధిక వేగవంతమైంది. ఇంతకుముందు సంవత్సరంలో కూడా మార్ష్ వన్డే కప్ లో డబుల్ సెంచరీ చేయడానికి 141 పరుగులు తీసుకున్నాడు.

196.45 స్ట్రై క్ రేట్ తోఎన్. జగదీష్ న్ ఇన్ని పరుగులు చేయడం జరిగింది.2021వ సంవత్సరంలో ట్రవిస్ హేడ్ చేసిన181.1 అత్యధిక స్ట్రైక్ రేట్ గా ఉండేది. ప్రస్తుతం ఎన్. జగదీష్ న్ చేసిన స్ట్రైక్ రేట్ అత్యధికంగా ఉంది. ఈ ఫార్మాట్లో చేసిన మిగిలిన 36 డబుల్ సెంచరీలలో ఏ డబుల్ సెంచరీ కూడా 175 కంటే ఎక్కువ స్ట్రైక్ రేటు తో చేయ లేదు.

పురుషుల జాబితా లిస్ట్ A క్రికెట్లో 400 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్న మొదటి జంటగా జగదీష్ న్, సాయి సుదర్శన్ పేరు పొందారు. 2015 సంవత్సరంలో క్రిస్ గేల్, మార్లోన్ శామ్యూల్స్ భాగస్వామ్యం ద్వారా చేసిన 372 పరుగులే ఇంతకుముందు అత్యధిక పరువులుగా ఉన్నాయి. అరుణాచల్ కి చెందిన చేతన్ ఆనంద్ అనే ఒక బౌలర్ తన పది ఓవర్లలో 114 పరుగులు చేశాడు.

ఇది పురుషుల జాబితా లిస్ట్ A క్రికెట్లో ఒక బౌలర్ అత్యధిక పరుగులు చేయడం ఫస్ట్ జరిగింది ఇప్పుడే. ఇంతకుముందు చూసుకుంటే 2006వ సంవత్సరంలో దక్షణఆఫ్రికా జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్లో మిక్ లూయిస్ అనే బౌలర్ చేసిన 113 పరుగులే అత్యధికంగా ఉన్నాయి. ప్రస్తుతం దీన్ని చేతన్ ఆనంద్ బీట్ చేశాడు.

ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో ఎన్. జగదీష్ న్ కు 500 పరుగులు వచ్చాయి. ఈ పరుగులు ఏ బ్యాటర్ కైనా చాలా ముఖ్యం. ఎన్నో రికార్డ్స్ బద్దలు కొట్టడం జరిగింది ఇతను.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button