Cricket

No ball: తీవ్ర చర్చకు దారితీస్తున్న నోబాల్ వివాదం.

# No ball:ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠంగా జరిగింది. ఈ మ్యాచ్ లో నోబాల్ వివాదం తీవ్రదుమారం లేపుతుంది. బాబర్ అజామ్ తన ఇన్నింగ్స్ లో చివరి ఓవర్ ను 16 పరుగుల కట్టడి కోసం బౌలింగ్ ప్రారంభించిన నవాజ్, మొదటి బంతికే పాండ్యాను అవుట్ చేశాడు. రెండవ బంతికి కార్తీక్ సింగిల్ తీశాడు. 3వ బంతికి విరాట్ రెండు పరుగులు చేశాడు. నాలుగవ బంతి నుండి డ్రామా మొదలైంది.

నాలుగో బంతిని నవాజ్ నడుము ఎత్తులో ఫుల్ టాస్ గా వేశాడు. దీనిని కోహ్లీ సిక్స్ గా మలిచాడు. ఆ బంతిని అంపేర్ నోబాల్ గా ప్రకటించాడు. ప్రస్తుతం ఇదే వివాదం అవుతుంది. థర్డ్ ఎంపైర్ తో సంప్రదించకుండా, ఎంపైర్ నో బాల్ ఎందుకు ప్రకటించాలి, అని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హేగ్ ప్రశ్నిస్తున్నాడు. ఈ విషయంపై పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఎంపైర్ ను వివరణ అడిగిన ఎంపైర్ మాత్రం దానిని నోబాల్ గా ప్రకటించాడు.

ఐదవ బంతి:

నో బాల్ అనంతరం వేసిన ఫ్రీ హిట్ బాల్, వికెట్లను క్లీన్ బౌల్డ్ చేసి స్లిప్పు గుండా వెళ్ళింది. ఇంతలో కోహ్లీ మూడు పరుగులు తీశాడు. బంతి వికెట్లను తాకినప్పుడు డేటు బాల్ గా ప్రకటించాలి కదా, అని పాక్ కీపర్, కెప్టెన్, ఆటగాళ్లు ఎంపైర్ తో వాదించారు. కానీ ఎంపైర్ మాత్రం దానిని ప్రకటించలేదు. దీంతో భారత్ కు విజయం సులభతరమైంది. తర్వాత బంతికి కార్తీక్ అవుట్ అవడం, మరుసటి బాల్ వైడ్ గా వేయడం, చివరి బంతికి సింగిల్ తీయడంతో ప్రతిష్టాత్మక మ్యాచ్లో పాకిస్తాన్ పై భారత్ మరోసారి గెలిచి తన రికార్డును పెంచుకుంది.

ప్రస్తుతం ఈ రెండు బంతులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎందుకు ఎంపైర్ రివ్యూ తీసుకోలేదు? పాక్ ఆటగాళ్లు అడిగిన థర్డ్ ఎంపైర్ ను ఎందుకు సంప్రదించలేదు? కోహ్లీ బౌల్డ్ అయిన బాలును ఎందుకు డెడ్బాల్ గా ప్రకటించలేదు, అని బ్రాడ్ హాగ్ ట్విట్టర్ ద్వారా ప్రశ్నిస్తున్నాడు. ఈ రెండు బంతులను మూడవ ఎంపైర్ రివ్యూ కు వెళ్లి ఉంటే ఫలితం మరోలా ఉండేది అని మాజీ ఆటగాళ్లు భావిస్తున్నారు.

నాసిర్ హుస్సేన్:

ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు నోబాల్ వివాదం పై స్పందించాడు. ఎంపైర్ లు భారత్ కు అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించాడు.

పాక్ అభిమానుల సైతం కోహ్లీ క్రిజ్ బయటకు వచ్చాడు, కాబట్టి అది నోబాల్ కాదు, అని అంపైర్ నో బాల్ ఎలా ఇస్తాడని ప్రశ్నిస్తున్నారు.

Dead ball:

బంతి వికెట్లను తాకి బౌల్డ్ అయినప్పటికీ అది ఫ్రీ హిట్ కాబట్టి ఔట్ కాదు. అందుకే అది డెడ్ బాల్ కాదు, అని పలువురు వివరిస్తున్నారు. బంతి బౌలర్ చేతిలో గాని, కీపర్ చేతిలో గాని పడితేనే డెడ్ బాల్ అవుతుంది. ఫ్రీ హిట్ కాని సందర్భంలో బంతి వికెట్లను తాగి బ్యాటర్ను అవుట్ చేసిన బాల్ డెడ్ అవుతుంది. కానీ ఈరోజు జరిగిన సందర్భంలో ఫ్రీ హిట్ బాల్ కాబట్టి, బాల్ డెడ్ బాల్ కాలేదని కొంతమంది వివరిస్తున్నారు. ఈ విషయాలపై ఐసీసీ కానీ, బీసీసీ కానీ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button